నియోజకవర్గ వ్యాప్తంగా 7వ విడత భూ పంపిణీలోఅర్హులైన నిరుపేదలను గుర్తించి వారికే అందేటట్లు చూడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అధికారులను ఆదేశించారు.
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్ : నియోజకవర్గ వ్యాప్తంగా 7వ విడత భూ పంపిణీలోఅర్హులైన నిరుపేదలను గుర్తించి వారికే అందేటట్లు చూడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అధికారులను ఆదేశించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం 7వ విడత భూ పంపిణీపై అసైన్‌మెంటు కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు వైఎస్‌ఆర్ కూడా పేదలకు భూమి ఉంటే అభివృద్ధి చెందుతారని భావించారన్నారు. ప్రణాళికబద్ధంగా గ్రామాల్లో సర్వే చేపట్టి భూ పంపిణీ చేయాలన్నారు.అనంతరం ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు భూములు అందడంలేదన్నారు.
ఆర్డీవో రఘునాథరెడ్డి మాట్లాడుతూ పులివెందులకు సంబంధించి 452 లబ్ధిదారులకు 823.39ఎకరాలు పంపిణీకి అర్హులుగా గుర్తించామన్నారు. అలాగే సింహాద్రిపురంలో 211మందికి 386.25ఎకరాలు, లింగాలకు చెందిన 286మందికి 561.21ఎకరాలు, తొండూరుకు సంబంధించి 838మందికి 1363.08, వేముల మండలానికి సంబంధించి 166మందికి 296.83, వేంపల్లె మండలానికి సంబంధించి 133మందికి 280.94 ఎకరాలు పంపిణీకి అర్హులన్నారు. కార్యక్రమంలో కడప ఆర్డీవో హరిత, టీడీపీ నాయకులు రాంగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌నాయకులు శివమోహన్‌రెడ్డి, అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.