చిన్నతనం నుంచే సేవాభావాన్ని అలవర్చుకోవాలని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఆమె వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు.
వైఎస్ విజయమ్మ పిలుపు
సాక్షి కడప/పులివెందుల : చిన్నతనం నుంచే సేవాభావం అలవరుచుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. వైఎస్ జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్ జార్జిరెడ్డి ఐటీఐలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం వికలాంగులకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ విమలమ్మ పాల్గొన్నారు. దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ యూఎస్‌ఏలో ఉండటంతో రాలేని నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ విమలమ్మ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వికలాంగులనుద్ధేశించి విజయమ్మ మాట్లాడుతూ స్వార్థంకోసం కాకుండా సేవా భావంతో ఆలోచన చేస్తే దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంఘం నెట్‌వర్క్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరెడ్డి, ప్రిన్సిపల్ రవిశంకర్‌రెడ్డి, ఐటీఐ సాయి, పలువురు ఉపాధ్యాయులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.
సీఎస్‌ఐ, జీసెస్ చారిటీస్‌లో
ప్రత్యేక ప్రార్థనలు
పులివెందులలోని తహశీల్దార్‌కార్యాలయం ఎదురుగా ఉన్న సీఎస్‌ఐ చర్చితోపాటు బాకరాపురంలో ఉన్న జీసెస్ చారిటీస్ చర్చిలో వైఎస్ విజయమ్మ, వైఎస్ విమలమ్మ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. వీరితోపాటు వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, రాజమ్మ, డాక్టర్ పురుషోత్తమరెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డి సతీమణి ఇసీ సుగుణమ్మ, వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి వైఎస్ లక్షుమ్మ, వైఎస్ ప్రకాష్‌రెడ్డి సతీమణి వైఎస్ పద్మావతమ్మ తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. సీఎస్‌ఐ చర్చి ఫాస్టర్ ఐజాక్ వరప్రసాద్, జీసెస్ చారిటీస్ చర్చి ఫాస్టర్లు మృత్యుంజయ, వార్డెన్ లిల్లీ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన వైఎస్ విజయమ్మ:
పులివెందులలోని జీసెస్ చారిటీస్‌లో ఉన్న చిన్నారులను వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా పలకరించారు. అందరినీ పేర్లతో పిలుస్తూ అందరూ బాగున్నారా... బాగా చదువుకుంటున్నారా.. కష్టపడి ఉన్నత చదువులు చదివి పైకి రావాలని ఆమె ఆశీర్వదించారు.
వైఎస్ విజయమ్మను కలిసిన పలువురు నాయకులు
పులివెందులలోని వైఎస్ స్వగృహంలో ఉన్న వైఎస్ విజయమ్మను పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలని ఆమె వారికి సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, వేముల మండల పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డి, సింహాద్రిపురం నాయకుడు కొమ్మా పరమేశ్వరరెడ్డి, పులివెందుల నాయకులు ఎర్రిపల్లె సర్వోత్తమరెడ్డి, ఓ.రసూల్, పార్నపల్లె నాయుడు, ముదిరాజు సంఘం అధ్యక్షుడు పెద్దిరాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జార్జిరెడ్డి విగ్రహం వద్ద ఘన నివాళి
వైఎస్ జార్జిరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్‌ఆర్ సోదరి వైఎస్ విమలమ్మ పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.
చిన్నతనం నుంచే సేవాభావం
Published Mon, Dec 8 2014 3:29 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement
Advertisement