సర్కారు బడి సౌకర్యాల ఒడి | Amjad Basha Starts Mana Badi Nadu Nedu Program In YSR Kadapa | Sakshi
Sakshi News home page

సర్కారు బడి సౌకర్యాల ఒడి

Published Thu, Nov 14 2019 10:37 AM | Last Updated on Thu, Nov 14 2019 10:37 AM

Amjad Basha Starts Mana Badi Nadu Nedu Program In YSR Kadapa - Sakshi

నాడు నేడు కార్యక్రమాన్ని నిర్వహించనున్న మున్సిపల్‌ హైసూ్కల్‌, వేదిక వద్ద సిద్దమైన శ్యామియానా పందిరి

సాక్షి, కడప: ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నేడు తొలి అడుగు వేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఇంజినీరింగ్‌ అధికారులు సిద్ధం చేశారు. పాఠశాలలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి.. భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయనేది కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో పాఠశాలల స్థితిగతులపై అధికారులు ఇప్పటికే ఫొటోలు తీసి ఒక ప్రత్యేక యాప్‌(సూ్కల్‌ ట్రాన్సఫర్మేషన్‌ సిస్టమ్‌)లో భద్రపరిచారు. తొలి దశలో పాఠశాలలను అభివృద్ధి చేశాక ప్రజలకు వివరించాలనేది ప్రభుత్వ సంకల్పం. దీంతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. సూ్కళ్లలో చేపట్టే అభివృద్ధి పనుల పథకాన్ని  నాడు– నేడుగా వ్యవహరిస్తున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి గురువారం నాంది పలుకుతోంది. కడపలోని మున్సిపల్‌ హైసూ్క ల్‌ మెయిన్‌లో జిల్లా అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌తోపాటు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో  3253 పాఠశాలలున్నాయి. ఇందులో 2,18, 912 మంది చదువుతున్నారు. జగన్‌ ప్రభుత్వం ఆరంభం నుంచి విద్యకు పెద్దపీట వేస్తోంది. ఈ స్కూళ్లను బలోపేతం చేయడానికి వివిధ చర్యలు చేపట్టింది. అందులో భాగమే అమ్మ ఒడి పథకం. ఈ పథకం మార్గదర్శకాలు వెలువడగానే  ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది మున్నెన్నడూ లేనంతగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. మరోపక్క సర్కారు బడులలో మెరుగైన వసతులు కల్పించనుండటంతో ఇవి కార్పొరేట్‌ స్కూల్స్‌ను తలదన్నెలా తయారుకానున్నాయి. పేరెంట్‌ కమిటీ, గ్రామస్తులు, ఉపాధ్యాయులు సమక్షంలో పాఠాశాలలోనే సమావేశమై చర్చించి ప్రణాళికలను సిద్దం చేయనున్నారు.

పేరెంట్‌ కమిటితో పనులను చేయట్టనున్నారు. నాడు నేడు అమలుకు తొలి విడతలో 50 మండలాల్లోని 1059 పాఠశాలలను గుర్తించారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 718, ప్రాథమికోన్నత పాఠశాలలు 161, ఉన్నత పాఠశాలలు 180 ఉన్నాయి. ప్రతి మండలంలోని పాఠశాల తొలివిడతలో కచ్చితంగా ఉండేలా ఎంపిక చేశారు.  మౌలిక వసతుల కల్పన పర్యవేక్షణ బాధ్యతలను సర్వశిక్ష అభియాన్, సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. ఈ శాఖల అధికారులు వచ్చే ఏడాది మార్చిలోగా  ప్రతిపాదిత పనులు, సౌకర్యాల కల్పన పూర్తి చేశాలాషెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు.

ఏర్పాట్లను పూర్తి చేశాం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. గురువారం కడపలోని మున్సిపల్‌ హైసూ్కల్‌ మెయిన్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాష, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్,  ఎమ్మెల్యేలు హాజరై కార్యక్రమాన్నిప్రారంభించనున్నారు. – పొన్నతోట శైలజ, జిల్లా విద్యాశాకాధికారి 

అట్టహాసంగా నాడు నేడు ప్రారంభ కార్యక్రమం
కడప ఎడ్యుకేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నాడు నేడు కార్యక్రమాన్ని గురువారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. మున్సిపల్‌ హైసూ్కల్లో (మెయిన్‌) కార్యక్రమం నిర్వహించేందుకు విద్యాశాకాధికారులు ఏర్పాట్లును సిద్దం  చేశారు. ఏర్పాట్లను బుధవారం డీఈఓ పొన్నతోట  శైలజ, సమగ్ర శిక్ష అడిషినల్‌ ప్రాజెక్టు కోర్డినేటర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. ఎస్‌ఎస్‌ఏ ఈఈ, ఏపీఈడబ్లూడీసీ ఈఈలతోపాటు డిప్యూటీ డీఈఈఓ, ఎంఈఓలతో సమీక్షించారు.

డీఈఓ శైలజ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాల పరిస్థితులను ఫొటోలు, వీడీయోలను తీసి సిద్ధం చేశామన్నారు. వీటి ఆధారంగా  9 రకాల వసతులను కల్పించి స్థితిగతులను మారుస్తామన్నారు. సమగ్ర శిక్ష అడిషినల్‌ ప్రాజెక్టు కోర్డినేటర్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో భాగంగా 1059 స్కూల్స్‌ను ఎంపిక చేయడం జరిగిందన్నారు. డిప్యూటీ డీఈఓ జిలానీబాష, ఎంఈఓ పాలెం నారాయణ, సమగ్ర శిక్ష అభియాన్‌ ఈఈ కాంతయ్య, ఏపీఈడబ్లూఐడీసీ ఈఈ జనార్థన్‌రెడ్డి, వీసీఆర్‌ కోర్డినేటర్‌ రెహమాన్, హెచ్‌ఎం నాగమని తదితరులు పాల్గొన్నారు.

తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం..
1. బాల బాలికల నిష్పత్తి మేరకు మరుగుదొడ్లను నిర్మించడంతోపాటు నీరు అందుబాటులో ఉంచుతారు.
2. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సిబ్బందికి అవసరమైన çఫర్నీచర్‌ సమకూర్చుతారు.
3. తరగతి గదిలో విద్యుత్‌ సౌకర్యముంటుంది. ట్యూబ్‌ౖ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారు
4. విద్యార్థులకు తాగునీరుగా మినరల్‌ వాటర్‌ అందించనున్నారు.
5. తరగతి గదులను ఆహ్లాదంగా
రంగులతో తీర్చిదిద్దుతారు.
6. అవసరం ఉన్న మేర భవనాలకు 
మరమ్మతులు చేపడతారు.
7. విద్యార్థుల సంఖ్యకు సరిపడా 
తరగతి గదులుంటాయి.
8. బ్లాక్‌ బోర్డులు సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకుంటారు.
9. పాఠశాల భద్రతకు ప్రహరీ తప్పనిసరిగా నిర్మిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement