‘మంత్రి ఆదేశించినా పట్టించుకోరా’ | YSRCP Demands For Release KC Canal Water | Sakshi
Sakshi News home page

కేసీ కెనాల్‌ నీరు విడుదల చేయాలి : వైఎస్సార్‌సీపీ

Published Thu, Jul 26 2018 5:36 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YSRCP Demands For Release KC Canal Water - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కడప జిల్లాలోని కేసీ కెనాల్‌ నుంచి తెలుగు గంగా, బ్రహ్మం సాగర్‌ కాలువలకు సాగు కొరకు నీటిని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. నీటిని విడుదల చేయకపోతే వైఎస్సార్‌సీపీ తరుఫున పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని పార్టీ ఎమ్మెల్యేలు, రఘురామిరెడ్డి, అంజద్‌ బాషా, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌ బాబా పేర్కొన్నారు. ఆగస్ట్‌ 1 లోపు నీటిని విడుదల చేయాలని గురువారం ఓ సమావేశంలో మాట్లాడుతు ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. జిల్లాలో కాలువలకు నీటిని విడుదల చేయాలని  రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ ఆదేశించిన్పటికి అధికారులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement