తామంతా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, ఇతర పార్టీలోకి వెళ్లేది లేదని కడప నగర కార్పొరేటర్లు ముక్తకంఠంతో చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి తనయుడు, పార్టీ నేత లోకేష్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వలస వెళ్లనున్నారని ఓ వర్గం మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మునిగే నావవంటిదని వారు పేర్కొన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌ను తాము వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
‘మేం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు’
Published Mon, Feb 22 2016 12:19 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement