
కడప మేయర్ సురేష్ బాబు
వైఎస్సార్ జిల్లా : నువ్వు ఇచ్చిన హామీలన్నీ పచ్చి బూటకమని ప్రజలకు తెలిసిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సురేష్ బాబు విమర్శించారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..అందరికి భరోసా ఇస్తూ జగన్ ముందుకు వెళ్తున్నాడని అన్నారు. కేవలం పత్రికల్లో చంద్రబాబు ప్రచారం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అభిప్రాయపడ్డాడు. నిధులపై బీజేపీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను అడ్డుపెట్టుకుని హోదా నాటకం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు.
హోదా కోసం పోరాడిన, పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు. ఎందాకైనా హోదా కోసం జగన్ వెన్నంటి నడుస్తామని చెప్పారు. నలభై ఏళ్ల అనుభవశాలి అంటూ పొగడ్తల వర్షం తనపై కురుపించుకుంటూ మరో పక్క జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. నిన్నటి వరకు కేంద్రం మనకు ఎక్కువ నిధులు ఇస్తుందంటూ ప్రచారం చేసిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలంటూ ప్లేట్ ఫిరాయించాడని ఆరోపించారు.