
సాక్షి, వైఎస్సార్: కడప పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటి (పాడ)పై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యూసీఐఎల్ కాలుష్యంపై అధికారుల వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా యూసీఐఎల్ సీఎండీ హస్నావి సీఎంని కలిసి.. వివరించారు. ఇప్పటికే యూసీఐఎల్ కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా సమావేశంలో సీఎం వివరాలు సేకరించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.