y.s vijayamma
-
చిన్నతనం నుంచే సేవాభావం
చిన్నతనం నుంచే సేవాభావాన్ని అలవర్చుకోవాలని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఆమె వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్ విజయమ్మ పిలుపు సాక్షి కడప/పులివెందుల : చిన్నతనం నుంచే సేవాభావం అలవరుచుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. వైఎస్ జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్ జార్జిరెడ్డి ఐటీఐలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం వికలాంగులకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ విమలమ్మ పాల్గొన్నారు. దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ యూఎస్ఏలో ఉండటంతో రాలేని నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ విమలమ్మ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వికలాంగులనుద్ధేశించి విజయమ్మ మాట్లాడుతూ స్వార్థంకోసం కాకుండా సేవా భావంతో ఆలోచన చేస్తే దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంఘం నెట్వర్క్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరెడ్డి, ప్రిన్సిపల్ రవిశంకర్‌రెడ్డి, ఐటీఐ సాయి, పలువురు ఉపాధ్యాయులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. సీఎస్ఐ, జీసెస్ చారిటీస్‌లో ప్రత్యేక ప్రార్థనలు పులివెందులలోని తహశీల్దార్కార్యాలయం ఎదురుగా ఉన్న సీఎస్ఐ చర్చితోపాటు బాకరాపురంలో ఉన్న జీసెస్ చారిటీస్ చర్చిలో వైఎస్ విజయమ్మ, వైఎస్ విమలమ్మ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. వీరితోపాటు వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, రాజమ్మ, డాక్టర్ పురుషోత్తమరెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డి సతీమణి ఇసీ సుగుణమ్మ, వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి వైఎస్ లక్షుమ్మ, వైఎస్ ప్రకాష్‌రెడ్డి సతీమణి వైఎస్ పద్మావతమ్మ తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చి ఫాస్టర్ ఐజాక్ వరప్రసాద్, జీసెస్ చారిటీస్ చర్చి ఫాస్టర్లు మృత్యుంజయ, వార్డెన్ లిల్లీ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన వైఎస్ విజయమ్మ: పులివెందులలోని జీసెస్ చారిటీస్‌లో ఉన్న చిన్నారులను వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా పలకరించారు. అందరినీ పేర్లతో పిలుస్తూ అందరూ బాగున్నారా... బాగా చదువుకుంటున్నారా.. కష్టపడి ఉన్నత చదువులు చదివి పైకి రావాలని ఆమె ఆశీర్వదించారు. వైఎస్ విజయమ్మను కలిసిన పలువురు నాయకులు పులివెందులలోని వైఎస్ స్వగృహంలో ఉన్న వైఎస్ విజయమ్మను పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలని ఆమె వారికి సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, వేముల మండల పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డి, సింహాద్రిపురం నాయకుడు కొమ్మా పరమేశ్వరరెడ్డి, పులివెందుల నాయకులు ఎర్రిపల్లె సర్వోత్తమరెడ్డి, ఓ.రసూల్, పార్నపల్లె నాయుడు, ముదిరాజు సంఘం అధ్యక్షుడు పెద్దిరాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జార్జిరెడ్డి విగ్రహం వద్ద ఘన నివాళి వైఎస్ జార్జిరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలమ్మ పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. -
కన్నీటి వీడ్కోలు
అభిమానుల కన్నీటితో ఆళ్లగడ్డ తడిసి ముద్దయింది.. నిప్పుకణికలా మండే సూరీడు చిన్నబోయాడు... విషాద వదనాలు.. ఎవరిని కదిలించినా కన్నీరు ఉబికి వస్తోంది.. నలుదిక్కులా కనుచూపు మేర ఇసుక వేస్తే రాలనంతగా జనం.. కొందరు మహిళలు కన్నీరింకిపోయేలా పొగిలి పొగిలి ఏడ్చి.. అలసి సొలసినా తడబడుతూనే శోభమ్మకు కడసారి వీడ్కోలు పలికేందుకు అడుగులో అడుగువేశారు.. చిక్కటి చిరునవ్వుతో అచ్చ తెలుగు ఆడపడుచుకు ప్రతిరూపంగా.. అన్నా.. అక్కా.. తమ్ముడూ.. అవ్వా.. తాతా.. అంటూ అందరినీ ఆత్మీయంగా పలుకరించే శోభమ్మ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక అనుచరులు, ఆమెతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధం ఉన్న ఆత్మీయులు విలవిల్లాడిపోయారు.. రెండు రోజులుగా గుండెలవిసేలా రోదిస్తున్న శోభమ్మ పిల్లలను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.. జననేత జగన్మోహన్రెడ్డి విషాద వదనంతో దుఃఖాన్ని దిగమింగుకుని శోభమ్మ భౌతికకాయంపై పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని చూసిన జనం మూగగా రోదించారు.. విజయమ్మ, షర్మిల, భారతి.. శోభ నుదుటిపై ఆప్యాయంగా చెయ్యి వేసి, తల నిమిరిన దృశ్యం చూసి అక్కడున్న వారి గుండెబరువెక్కింది.. పురుషులు సైతం కంటతడి పెట్టారు. శోభమ్మ కుటుంబానికి అండగా ఉంటామంటూ ప్రతినబూనారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: తమను ప్రేమగా పలుకరించే తల్లి దూరమైందని పల్లెలు తల్లడిల్లాయి. తమను ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అక్క దూరమైందని తమ్ముళ్లు, చెల్లెమ్మలు.. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మా బాగున్నారా? అంటూ నోరారా పలకరించే తమ బిడ్డ లోకం వీడిపోయిందని ముదసలి తల్లులు బోరున విలపించారు. రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఇంటిని నిర్లక్ష్యం చేయకుండా.. పిల్లల ఆలనా పాలన.. ప్రజా పాలనను సమాన దృష్టితో చూసిన ధైర్యశాలి.. స్నేహశీలి అయిన సతీమణి దూరం కావడంతో భూమా నాగిరెడ్డి గుండెలవిసేలా రోదించారు. జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్న అమ్మ తమకు దూరం కావటంతో కూతుళ్లు, కొడుకు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అంతిమ యాత్రకు జనం పోటెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతి, వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆళ్లగడ్డకు చేరుకుని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ఉదయం నుంచే అభిమానులు బారులు దీరారు. గంట గంటకు రద్దీ పెరగటంతో భూమా నివాసం కిటకిటలాడింది. ప్రజల సందర్శనార్థం నివాసం వద్ద ఉంచిన శోభా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని చూసేందుకు జనం బారులు తీరారు. అభిమాన నేత పార్థివ దేహాన్ని చూసి చలించిపోయారు. నిన్నటి వరకు తమ మధ్యనే ఉన్న నేతను ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ జనం రోదించారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు విగత జీవిగా మారిన శోభమ్మను చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. శోకతప్త హృదయాలతో అభిమానులు తల్లడిల్లిపోయారు. విగతజీవి అయిన శోభమ్మను పట్టుకుని భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు మౌనంగా ఉండటం చూసి ప్రజలు మరింత కలత చెందారు. అభిమానులతో కిక్కిరిసిన ఆళ్లగడ్డ తమ అభిమాన నేత శోభా నాగిరెడ్డి అంతిమ యాత్ర కోసం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలిరావటంతో ఆళ్లగడ్డ కిటకిటలాడింది. ఉదయం నుంచే ఆళ్లగడ్డకు తరలిరావటంతో 9 గంటలకే రోడ్లన్నీ నిండిపోయాయి. సందర్శకుల సందర్శనార్థం భూమా నివాసంలో ఉంచిన శోభా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని చూసేందుకు జనం క్యూ లైన్లో బారులు తీరారు. ముగ్గురు డీఎస్పీల బృందం అభిమానులను అదుపు చేసే ప్రయత్నం చేసినా అభిమానులు గోడలెక్కి దుమికి వెళ్లి తమ అభిమాన నేత భౌతికకాయాన్ని సందర్శించారు. పోలీసులు అదుపు చేయలేకపోవటంతో భూమా నాగిరెడ్డే స్వయంగా అభిమానులను ఆదుపు చేయాల్సి వచ్చింది. ప్రచార రథంపెకైక్కి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బొంగురుపోయిన స్వరంతో ఆయన వేడుకుంటుండటం చూసిన జనం కన్నీటిని ఆపుకోలేకపోయారు. ‘అన్నా.. అన్నా.. శోభమ్మ’ అంటూ పెద్ద ఎత్తున రోదించారు. భారీ జనసందోహం మధ్య శోభమ్మ అంతిమ యాత్ర ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అంతిమ యాత్ర భారీ జనసందోహం మధ్య సాగింది. సాయంత్రం 3.30 గంటల వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచిన శోభమ్మ పార్థివ దేహానికి చివరిసారి ‘ముత్తైవు ప్రక్రియ’ను పూర్తి చేసేందుకు ఇంట్లోకి తీసుకెళ్లారు. బంధువులు కార్యక్రమాలను పూర్తిచేసి అంతిమ యాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలోకి తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి 4.16 గంటలకు నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది. భూమా నివాసం నుంచి టీబీరోడ్డు, గాంధీసెంటర్, పాతబస్టాండ్, కందుకూరు రోడ్డులోని భూమా పొలాల వరకు సుమారు రెండు కిలోమీటర్లు మేర అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్ర సందర్భంగా ఆళ్లగడ్డలోని దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసివేసి నివాళి అర్పించారు. నివాసాలకు తాళాలు వేసి ఆళ్లగడ్డ ప్రజలు మొత్తం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దుకాణాలు, మిద్దెలపై ఎక్కి శోభమ్మను కడసారి చూశారు. ముఖం నిండా పసుపు పూసి.. పట్టచీరతో అలంకరించిన శోభమ్మను చూసి మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడు జగద్విఖ్యాత్‌రెడ్డి చేతిలో నిప్పుకుండతో వాహనంపైకి ఎక్కటంతో చిన్నా, పెద్దా తేడా లే కుండా అందరూ కన్నీరు పెట్టుకోవటం కనిపించింది. బంధువుల సమక్షంలో శుక్రవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో శోభా నాగిరెడ్డి కుమారుడు జగద్విఖ్యాత్ చితికి నిప్పుపెట్టారు. అంతకు ముందు తల్లి భౌతికకాయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో భూమా నాగిరెడ్డి రెండు చేతులు జోడించి శోభమ్మకు నమస్కరిస్తుండిపోయారు. నిప్పు పెట్టిన వెంటనే కళ్లెదుట కాలిపోతున్న శోభమ్మను చూసి భూమా నాగిరెడ్డి, కుమార్తెలు అఖిలప్రియ, నాగమౌనిక, జగత్‌విఖ్యాత్ కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె ‘నాన్నా.. అమ్మ’ అంటూ చేయిచూపుతూ తండ్రిని గట్టిగా పట్టుకుని బోరుమని విలపించటం అక్కడున్న వారిని కలచివేసింది. అంతిమ యాత్రలో శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి, సోదరులు ఎస్వీ ప్రసాద్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, అక్క నాగలక్ష్మమ్మ, నాగరత్మమ్మ, పినతండ్రి ఎస్వీ నాగిరెడ్డి, ఆయన కుమారులు జగన్మోహన్రెడ్డి, లక్ష్మీరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి సన్నిహితులు ఏవీ సుబ్బారెడ్డి, బీవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేతన్నకు అండగా నేనూ..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గురువారం కన్నుమూసిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డికి జిల్లాతోనూ అనుబంధం ఉంది. 2012, జూలై 23న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ సిరిసిల్లలో చేపట్టిన ‘నేతన్న దీక్ష’లో ఆమె పాల్గొన్నారు. ఒకదశలో వేదికపైకి కొందరు రాళ్లు వేయగా.. అవి విజయమ్మకు తగలకుండా శోభానాగిరెడ్డి ముందుకు వచ్చి నిలుచున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకురాలు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలియగానే స్థానికులు పలువురు సంతాపం తెలిపారు. ఆనాటి సంగతులు గుర్తుకు తెచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు సిరిసిల్ల గాంధీచౌక్‌లో శోభానాగిరెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. -
రోడ్‌షో సక్సెస్
-
నేడు వైఎస్ విజయమ్మ రాక
సాక్షి, కడప : వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు రాయచోటి మున్సిపాలిటీలో ప్రచారంలో పాల్గొననున్నారు. జిల్లాలో నాలుగు రోజులపాటు తొమ్మిది నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. కడప కార్పొరేషన్‌తోపాటు రాయచోటి, మైదుకూరు, బద్వేలు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కడప కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లో విజయమ్మ యాత్ర నిర్వహించనున్నారు. 29వ తేదీ కమలాపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 28వ తేదీతో మున్సిపోల్స్ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ప్రచారం ఇప్పటికే పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు అన్ని విధాల ముందంజలో పయనిస్తున్నారు. ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఈ క్రమంలో వైఎస్ విజయమ్మ యాత్ర పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని నేతలు ధీమాగా ఉన్నారు. వైఎస్ విజయమ్మకు ఘన స్వాగతం పలికేందుకు, సభల నిర్వహణకు సమన్వయకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకులు వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు జిల్లాలోని ముఖ్య నేతలు విజయమ్మ యాత్రను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. బుధవారం ఉదయం విజయమ్మ పులివెందులకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు రాయచోటికి చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 27వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మైదుకూరు, సాయంత్రం 6 గంటలకు బద్వేలులో రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు సిద్దవటంలో రోడ్‌షో నిర్వహిస్తారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఎర్రగుంట్లలో, 10.30 గంటలకు ప్రొద్దుటూరులో, మధ్యాహ్నం 3 గంటలకు జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం వేపరాల, దొమ్మరనంద్యాల, ముద్దనూరులలో ప్రచారం కొనసాగిస్తారు. 29వ తేదీ మధ్యాహ్నం నుంచి కమలాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. -
పన్నులతో పేదల్ని బాదేశారు
చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలపై వైఎస్ విజయమ్మ ధ్వజం కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ హయాంలలో పన్నులు అమాంతం పెంచి పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల జీవితాలతో చెలగాటమాడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు హయాంలో 8 సార్లు, కిరణ్ హయాంలో 4 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, వీటితోపాటు ఆర్టీసీ, నీటి పన్నులు, మున్సిపాలిటీ పన్నులు, గ్యాస్, పెట్రో ల్, డీజిల్, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. రూ.32 వేల కోట్ల కరెంట్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిన కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే చంద్రబాబు విప్ జారీచేసి మరీ కాపాడారన్నారు. ఇప్పుడు విద్యుత్ చార్జీల పేరుతో మరో రూ.5,600 కోట్ల భారం వేయబోతున్నారని నిప్పులు చెరిగారు. ‘‘ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఉన్నారు. ఆయన పాలన సువర్ణ యుగం. అలాంటి పాలన జగన్‌బాబుతోనే మళ్లీ సాధ్యమవుతుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని జగన్‌బాబును సీఎంను చేద్దాం’’ అని విజయమ్మ కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల పాలనలో పైసా పన్ను, చార్జీలు పెంచకుండా రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ చేపట్టిన పర్యటన కర్నూలు జిల్లాలో నాలుగో రోజు ఆదివారం కొనసాగింది. విజయమ్మ డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో రోడ్ షో, బహిరంగ సమావేశాలు నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు విజయమ్మకు ఎదురొచ్చి ఘనస్వాగతం పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. పాల్గొన్న నేతలు.. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, డోన్, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మణిగాంధీ, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీలోకి మసాల ఈరన్న ఆలూరు మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ఎమ్మిగనూరులో విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. ఈయనతో పాటు పార్టీలో చేరిన పలువురు మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచ్‌లతోపాటు వెయ్యి మందికి విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ప్రభంజనం
భానుడి ప్రతాపాన్ని జనం ఏమాత్రం లెక్క చేయలేదు.. ఇళ్లలో ఉన్న జనం రోడ్లపైకి త రలివచ్చారు.. మహానేత వైఎస్ సతీమణి వచ్చిందంటూ మహిళలు, వృద్ధులు ఇళ్లపెకైక్కి ఆమె ప్రసంగాన్ని విన్నారు.. మహానేత వల్ల లబ్ధి పొందిన వారు రాకపోయినా.. ఇంత మంది గుండెల్లో మేముండటం చూస్తుంటే సంతోషం కలుగుతుందని విజయమ్మ అన్నప్పుడు జై జగన్ అంటూ జనం నినదించారు. సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రోడ్ షో, సభలకు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జిల్లాలో మూడు రోజులుగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న విజయమ్మకు మంగళవారం అనంతపురం నుంచి రాయదుర్గం వరకు రోడ్డు వెంబడి ప్రజలు గంటల తరబడి వేచి చూస్తూ ఆప్యాయతతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వల్ల ఎంతో మంది పదవులు, మరికొందరు ఎన్నో రకాలుగా లబ్ధి పొంది.. తమపై అభిమానం చూపకపోయినా మీరు తమ వెంట ఉంటూ అభిమానం చాటడం తమ కుటుంబం ఎప్పటికీ మరచిపోలేదని చెప్పినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున హర్ష ధ్వానాలతో స్పందించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రస్తుతం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పేరు ఉచ్చరించడానికే ఇష్టపడటం లేదన్నారు. మేలు చేసిన వారిని మరచిపోయే వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. ‘జగన్‌ను మీ అన్నగా, కొడుకుగా నాలుగున్నరేళ్ల పాటు కాపాడుకున్నారు. ఎన్నికల్లో జగన్‌ను ఆశీర్వదించండి. ప్రస్తుతం ఆగిపోయిన సంక్షేమ పథకాలు తిరిగి మీ చెంతకు చేరుతాయి’ అని ఆమె అన్నప్పుడు మేం గెలిపించుకుంటామంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయదుర్గం పట్టణానికి విజయమ్మ వస్తున్నారని తెలిసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎదురు చూసి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు అజయ్ కుమార్‌రెడ్డి, రాయదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ ఉపేంద్రరెడ్డి, రాయదుర్గం, గుమ్మఘట్ట మాజీ మండలాధ్యక్షులు నాగరాజురెడ్డి, రాఘవరెడ్డితో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, వారి అనుచరవర్గం కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడు కూడా మిగలకుండా పోయినట్లైంది. విజయమ్మ వెంట అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, సీఈసీ సభ్యుడు ఎల్.ఎం.మోహన్‌రెడ్డి, సమన్వయకర్త తిప్పేస్వామి, నాయకురాలు కాపు భారతి తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిక
కదిరి,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాటం శంకర్, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రమేష్‌రెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్‌కుమార్, జిలాన్, ఎన్పీకుంట మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు రమేష్‌రెడ్డి, ప్రభాకర్, రాజారెడ్డి, కేశవ, ఎదురుదొన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఓబుళేసు, పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు షామీర్‌బాషా, షేక్ బాబా ఫకృద్దీన్‌తో పాటు 300 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షురాలు కండువా వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
జనహోరు
కదిరి జనసముద్రంగా, పుట్టపర్తి జనపర్తిగా, హిందూపురం జనపురంగా మారింది. కనుచూపు మేర జనం.. కదిలి వచ్చిన మహిళాలోకం.. జననేతకే మా మద్దతు అంటూ యువతరం నినదించింది. ఆదివారం వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనకు ‘అనంత’ నీరాజనం పలికింది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె చేపట్టిన ‘జనపథం’ తొలిరోజు విజయవంతమైంది. అడుగడుగునా జనం అభిమానంతో అడ్డుపడటంతో పర్యటన షెడ్యూలు కంటే ఆలస్యమైనా ప్రజలు పోటెత్తారు. సాక్షి ప్రతినిధి, కదిరి/పుట్టపర్తి/హిందూపురం : యువ జనం కదం తొక్కింది. మహిళా లోకం కడలిలా కదలి వచ్చింది. పండుటాకులు పోటెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని చేపట్టిన ‘జనపథం’ కార్యక్రమంలో భాగంగా కదిరి, పుట్టపర్తి, హిందూపురం మున్సిపాలిటీలలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్ షోలకు జనసంద్రం పోటెత్తింది. యువతీ యువకులు, మహిళలు, వృద్ధులు నీరాజనాలు పలకడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో ఐదు రోజుల మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం కదిరిలో ప్రారంభించారు. ఆదివారం ఉదయం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధిని దర్శించుకొని నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. షెడ్యూలు సమయం కన్నా మూడు గంటలు ఆలస్యంగా వచ్చిన విజయమ్మకు కదిరి శివార్లలోని కుటాగుళ్ల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మధ్యాహ్నం 12.24 గంటలకు కదిరిలోని బస్టాండ్ సర్కిల్‌కు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. సభకు హాజరైన వారిలో సింహభాగం మైనార్టీ వర్గాలకు చెందిన మహిలే కావడం గమనార్హం. వైఎస్ విజయమ్మ ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన లభించింది. వైఎస్ జగన్ సీఎం కాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని వైఎస్ విజయమ్మ హామీ ఇవ్వగానే మహిళలు కరతాళ ధ్వనులతో అభినందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లను రూ.200 నుంచి రూ.700లకు పెంచుతామని ఇచ్చిన హామీకి జనం కేరింతలు కొట్టారు. అమ్మఒడి పథకం ద్వారా ఇద్దరు పిల్లలను చదివించే ప్రతి అమ్మకూ నెల నెలా రూ.1000 ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం జనాన్ని ఆకట్టుకుంది. కదిరి బస్టాండ్ సర్కిల్ నుంచి మార్కెట్, జీమాను సర్కిల్, నరసింహ స్వామి దేవాలయం మీదుగా వేమారెడ్డి సర్కిల్ వరకు నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బారులు తీరి వైఎస్ విజయమ్మపై బంతిపూల వర్షం కురిపించారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త ఇస్మాయిల్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ విజయమ్మ పుట్టపర్తికి బయల్దేరారు. పుట్టపర్తికి చేరుకొనే మార్గమధ్యలో ప్రతి పల్లెలోనూ జనమంతా రోడ్లపైకొచ్చి వైఎస్ విజయమ్మకు మద్దతు పలికారు. రెడ్డిపల్లి, నల్లమాడ, చెర్లోపల్లి, వెంగలమ్మ చెరువు గ్రామాల్లో వైఎస్ విజయమ్మపై బంతిపూల వర్షం కురిపించారు. మహిళలు అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పలికారు. భారీ జనసందోహం మధ్య పుట్టపర్తి శివారుకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. షెడ్యూలు సమయం కన్నా 3.30 గంటలు ఆలస్యంగా పుట్టపర్తికి చేరుకున్న వైఎస్ విజయమ్మకు ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. సత్యమ్మ దేవాలయం వద్ద బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు, కిరణ్‌లపై పదునైన విమర్శలు చేశారు. అత్యంత అవినీతి సీఎం చంద్రబాబేనని తెహల్కా డాట్కాం 2002లోనే తేల్చిందని, అలాంటి చంద్రబాబు ఈ రోజున వేదాలు వల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం రామలింగరాజు ఇచ్చిన నగదు మూటలతోనే చంద్రబాబు కుమారుడు లోకేశ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారని దుయ్యబట్టారు. అయితే చంద్రబాబు మాత్రం ఏ ఒక్క విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంటు ఇచ్చిన పాపాన పోలేదంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. పుట్టపర్తిలో సత్యమ్మ గుడి నుంచి వైఎస్ విజయమ్మ ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించి, నివాళులర్పించారు. సత్యసాయిని ప్రేమించే ప్రతి హృదయం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. ప్రశాంతి నిలయం నుంచి ఎనుములపల్లి సర్కిల్ వరకు విజయమ్మ రోడ్‌షో నిర్వహించారు. రోడ్డుకిరువైపులా జనం బారులు తీరి వైఎస్ విజయమ్మకు సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి హిందూపురానికి బయల్దేరారు. హిందూపురం చేరుకొనే మార్గమధ్యలో పెడపల్లి, గోరంట్ల క్రాస్, పాలసముద్రం క్రాస్ వద్ద ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి వైఎస్ విజయమ్మకు మద్దతు ప్రకటించారు. షెడ్యూలు సమయం కన్నా 2.54 గంటలు ఆలస్యంగా హిందూపురం శివారులోని కొట్టూరు క్రాస్ వద్దకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆర్టీసీ బస్టాండు, ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌వరకు రోడ్డుషో నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ చూడగలుగుతామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం, వృద్ధులకు, వికలాంగులకు రూ.700, వికలాంగులకు రూ.1000 పింఛన్‌గా ఇచ్చేందుకు రెండో సంతకం, రైతులకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధికి మూడో సంతకం, డ్వాక్రా రుణాల మాఫీపై నాలుగో సంతకం చేస్తారని భరోసానిచ్చారు. 34 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను, చేయని వాగ్దానాలను కూడా ఐదు సంవత్సరాల పాలనలో అమలు చేసి చూపారన్నారు. వైఎస్ నుంచి విలువలను, విశ్వసనీయతను పుణికిపుచ్చుకున్న జగన్.. చేసిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేసి విశ్వసనీయతను నిలబెట్టుకుంటారంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి, పుట్టపర్తి, హిందూపురంలో వైఎస్ విజయమ్మ ‘జనపథం’ విజయవంతమవడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నేడు వైఎస్ విజయమ్మ పర్యటన ఇలా.. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన జనపథం కార్యక్రమం సోమవారం మడకశిర, ధర్మవరం, అనంతపురం మున్సిపాలిటీలలో జరగనుంది. ఉదయం 9 గంటలకు మడకశిరలో రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొననున్న విజయమ్మ.. అక్కడి నుంచి పెనుకొండ, సీకేపల్లి క్రాస్, ఎన్ఎస్ గేటు మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు ధర్మవరం చేరుకుంటారు. అక్కడ రోడ్ షో నిర్వహించిన అనంతరం బత్తలపల్లి, ఎస్కేయూనివర్సిటీ మీదుగా సాయంత్రం 5 గంటలకు అనంతపురం నగరానికి చేరుకొని రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం నగరంలో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి విజయమ్మ ప్రసంగించనున్నారు. -
వైఎస్‌కు విజయమ్మ నివాళి
వేంపల్లె, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ తన భర్త, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం అనంతపురం జిల్లా కదిరికి వెళ్లారు. అంతకుమునుపు ఆమె బెంగళూరు నుంచి నేరుగా ఇడుపులపాయ ఎస్టేట్‌కు ఉదయం 8గంటలకు చేరుకున్నారు. వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుని దివంగత నేత వైఎస్ఆర్ సమాధి వద్ద పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్ నరేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలలో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. దివంగత నేత ఆశీస్సుల కోసమే విజయమ్మ వచ్చినట్లు వైఎస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు. నివాళులర్పించిన వారిలో చక్రాయపేట వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నాయకులు జనార్థన్‌రెడ్డి, కన్వీనర్లు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, మాజీ ఎంపీటీసీ రవికుమార్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మునిరెడ్డి, యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య, హార్టికల్చర్ మాజీ డెరైక్టర్ నాగభూషణరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు రామాంజనేయరెడ్డి, ఓబుళరెడ్డి, సర్పంచ్‌లు ఆర్ఎల్వీ ప్రసాద్‌రెడ్డి, సంజీవరెడ్డి, గఫూర్, పార్థసారథిరెడ్డి, పెద్ద రామయ్య, రఘురామిరెడ్డి, రామగంగిరెడ్డి, శేషు, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మాలమహానాడు అధ్యక్షుడు కమతం రాజా తదితరులు ఉన్నారు. కంటతడిపెట్టిన విజయమ్మ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వైఎస్ విజయమ్మ కంటతడిపెట్టారు. కదిరి, పుట్టపర్తి, హిందూపురం తదితర మున్సిపల్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం కోసం వెళుతూ మహానేత వైఎస్ఆర్ ఆశీర్వాదం కోసం ఆమె ఇడుపులపాయకు చేరుకున్నారు. ప్రార్థనలు నిర్వహించే సమయంలో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. -
నేడు ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ
పులివెందుల, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆదివారం ఉదయం ఇడుపులపాయకు రానున్నారు. అందుకు సంబంధించి పర్యటన ఖరారైనట్లు జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు నుంచి నేరుగా ఆదివారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు విజయమ్మ చేరుకోనున్నారు. అనంతరం మహానేత వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. నివాళి అనంతరం అనంతపురం జిల్లా కదిరి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
నేటి నుంచి విజయమ్మ జన పథం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ‘జన పథం’ పేరుతో ఆదివారం కదిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వరుస విజయాలతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు ప్రారంభించనుండటం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని నింపుతోంది. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికలకు క్వార్టర్ ఫైనల్స్‌గా భావిస్తోన్న మున్సిపల్ ఎన్నికలను వైఎస్సార్సీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడినా సహకార, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులపై నిర్వహిస్తోండటం వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం ద్వారా సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ప్రాదేశిక ఎన్నికల్లో.. ఫైనల్స్‌గా భావిస్తోన్న సార్వత్రిక ఎన్నికల్లో విజయభేరి మోగించాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని రగల్చి.. పార్టీ విధానాలను ప్రజలకు వివరించడానికి ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి పులివెందులకు చేరుకున్న విజయమ్మ.. ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించి, నివాళులు అర్పిస్తారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కదిరికి చేరుకుని రోడ్డు షో నిర్వహించి.. మధ్యాహ్నానికి పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడ రోడ్డు షో నిర్వహించి.. సాయంత్రం ఐదు గంటలకు హిందూపురం చేరుకుని రోడ్డు షో నిర్వహిస్తారు. హిందూపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి.. రాత్రి అక్కడే బస చేస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన తీరును ప్రజలకు వివరించనున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తారు. ఐదు రోజుల వైఎస్ విజయమ్మ పర్యటనను విజయవంతం చేయడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. టీడీపీ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతే.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరగా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుమ్మక్కై తెలుగుజాతిని రెండు ముక్కలు చేశాయి. నాలుగున్నరేళ్లుగా ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపాయి. పజాకంటక విధానాలు అవలంబించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మున్సిపల్, జెడ్పీ, సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కనివ్వకుండా చేసి.. గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను తిరుగులేని మెజార్టీతో గెలిపించడం ద్వారా రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనకు బ్రహ్మరథం పట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. - ఎం.శంకరనారాయణ, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ -
21న వైఎస్ విజయమ్మ రాక
సాక్షి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 21న జిల్లాలోని బనగానపల్లె నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. అదే రోజు ఆళ్లగడ్డలోనూ ప్రచారం నిర్వహించనున్నారు. 22న నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు.. 23న డోన్, ఆదోని, ఎమ్మిగనూరులో ప్రచారం చేపట్టనున్నారు. మూడు రోజుల పర్యటనకు పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలనే విషయంపై జిల్లా పార్టీ క న్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమానాగిరెడ్డి నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. విజయమ్మ పర్యటన కోసం జిల్లా ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. -
కదనోత్సాహం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 16న కదిరి నుంచి నగర, పురపాలక ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. జిల్లాలో అనంతపురం నగర పాలక సంస్థతోపాటు 11 పురపాలక, నగర పంచాయతీల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికలు, సహకార ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన విషయం విదితమే. వరుస విజయాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించనుండడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. నగర, పురపాలక, నగర పంచాయతీల్లో ప్రతికూల పరిస్థితులతో టీడీపీ ఎదురీదుతోంది. 1995, 2000, 2005 మున్సిపల్ ఎన్నికల్లో నగర, పురపాలక సంస్థల్లో టీడీపీ ఓడిపోవడమే అందుకు తార్కాణం. ఇప్పుడు రాష్ట్ర విభజనలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన తీరుపై నగర, పురపాలక, నగర పంచాయతీల్లోని ఓటర్లు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రవచించిన రెండు కళ్ల సిద్ధాంతం వల్లే రాష్ట్రం విడిపోయిందని ఓటర్లు భావిస్తున్నారు. ఇది టీడీపీని మరింత ఇరకాటంలో పడేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కాంగ్రెస్‌పై ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాజీనామా బాట పట్టాయి. దాంతో.. కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న జిల్లాలోనే ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ ఒక్కరూ సాహసించలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరి మున్సిపాల్టీ ప్రజల దాహార్తిని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి శాశ్వతంగా తీర్చేలా తాగునీటి పథకాలను చేపట్టారు. మడకశిర, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, గుత్తి, పామిడి నగర పంచాయతీల్లోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వైఎస్ కృషి చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపారు. ఇది వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో ఈనెల 16 నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలోని 12 నగర, పురపాలక, నగర పంచాయతీల్లో పర్యటించనున్నారు. ఈ ప్రచారంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చేపట్టబోయే సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించనున్నారు. -
కిరణ్ది అంతా ఆర్భాటమే
పులివెందుల, న్యూస్‌లైన్ : కొన్నేళ్లుగా భూమి పంపిణీ చేయకుండా.. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. కిరణ్ ఆర్భాటాలు చేస్తూ ఓట్ల కోసం తహతహలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. పులివెందుల తహశీల్దార్ కార్యాలయం వద్ద 7వ విడత భూ పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ ఉన్నప్పుడు పేద కుటుంబాల సంక్షేమం కోసం ఎప్పుడు ఆలోచన చేస్తుండేవారన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో 7లక్షల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇందిర జలప్రభ ద్వారా 5వేల కోట్లు వెచ్చించి భూములలో సౌకర్యాలను కల్పించారన్నారు. కొన్నేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల ముందు కళ్లుతెరిచి ఇప్పుడు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.అది కూడా ప్రజలకు అందుతుండటంతో తనకు సంతోషంగా ఉందన్నారు. ఇందిర జలప్రభ పథకం ద్వారా వైఎస్ఆర్ చాలా బోర్లు వేయించారని.. ప్రస్తుత కిరణ్ సర్కార్ లక్షల బోర్లు వేయిస్తామంటున్నా.. వేల సంఖ్యలో కూడా వేయించలేదన్నారు. ప్రజలకు ఏది అవసరమైనా తాము ముందుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఆర్డీవో రఘునాథరెడ్డి, రిటైర్డు తహశీల్దార్ మహమ్మద్ గౌస్ మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా యువజన విభాగపు నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పులివెందుల, వేముల మండల నాయకులు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, మూలి బలరామిరెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 7వ విడత భూ పంపిణీలో భాగంగా అసైన్మెంటు కమిటీలో ఆమోదం పొందిన 2300మంది లబ్ధిదారులకు 4వేల ఎకరాల భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పంపిణీ చేశారు. -
విజయమ్మ అరెస్ట్ అప్రజాస్వామికం
వింజమూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి నివాసంలో గురువారం ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని కోరినందుకు విజయమ్మను, పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యానికి రాష్ట్ర చరిత్రలో ఇదొక దుర్దినం అన్నారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం కనుసన్నల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కలిసి విభజన కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విభజించినా సీఎం ఉత్తుత్తి మాటలు చెప్పి జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విభజనను వ్యతిరేకించినందుకు వైఎస్సార్సీపీ సభ్యులను సస్పెండ్ చేసి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా చర్చించేందుకు టీడీపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. ఆయన వెంట జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి ఉన్నారు. నేడు నిరసనలు : అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేల అరెస్ట్‌కు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేరిగ మురళీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరసనను కార్యకర్తలు, నాయకులు విభిన్న రీతుల్లో చేపట్టాలన్నారు. -
జాతీయ రహదారి దిగ్బంధం
రామగిరి/మడకశిర రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్ ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అరెస్ట్‌కు నిరసనగా గురువారం ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్ఎస్గేట్ సమీపాన 44వ జాతీయ రహదారిని గంట పాటు దిగ్బంధించారు. శంకరనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని మొదట్నుంచి పోరాడుతున్నది వైఎస్సార్సీపీ ఒక్కటేనన్నారు. సమైక్యం కోసం అసెంబ్లీలో గళం విప్పిన వైఎస్ విజయమ్మను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో సీఐ నరసింగరావు, ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వచ్చి వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పోలేపల్లి ఓబిరెడ్డి, నాయకులు రామాంజినేయులు, అంకే లక్ష్మన్న, రవీంద్రారెడ్డి, సందీప్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ‘సమైక్య’ తీర్మానం చేసి టీ బిల్లుపై చర్చించాలని పట్టుపట్టిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కై విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకు అనుకూలమని చెబుతున్నా... కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఓంకారస్వామి, జిల్లా యువత ఉపాధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, మండల ఎస్సీసెల్ కన్వీనర్ వెంకటరమణ, యువత నాయకులు సుదర్శన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నిద్రగట్ట నటరాజు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలు అమలైతేనే రక్షణ
-
చట్టాలు అమలైతేనే రక్షణ
నిర్భయ చట్టం వచ్చాక కూడా మహిళలపై అఘాయిత్యాలు జరగడం దురదృష్టకరం: విజయమ్మ నల్లగొండ జిల్లాలో అత్యాచారానికి గురైన బాలికలకు పరామర్శ హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వాలు ఎన్నిరకాల చట్టాలు తెచ్చినప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయనంతవరకు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఏనిమీది తండా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అత్యాచారానికి గురైన 12 మందిచిన్నారులను పోలీసులు హైదరాబాద్‌లోని బాలికల వసతి గృహానికి(స్టేట్ హోం) తరలించారు. బుధవారం విజయమ్మ వారిని పరామర్శించారు. ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. అన్ని విధాలా తాము అండగా ఉంటామని, బాగా చదువుకుని ఉన్నతస్థితికి చేరుకోవాలని చెప్పారు. స్టేట్‌హోం అధికారులతో చర్చించి చిన్నారులను కంటికిరెప్పలా కాపాడాలని సూచించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమెమాట్లాడుతూ చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ఉన్న సమయంలో ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే వారిని చట్టం ద్వారా కఠినంగా శిక్షించేవారని, దాంతో మరోసారి ఇలాంటివి చేయాలన్నా భయపడేవారన్నారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా దేశంలో అధికశాతం మహిళలపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. అఘాయిత్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇందుకు పోలీసుల వైఫల్యం ఎంతో ఉందన్నారు. 108, 100 నెంబర్లకు ఫోన్లు చేస్తే పలికేవారే కరువయ్యారని చెప్పారు. బాలికలను పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, కేంద్రకమిటీ సభ్యులు పాదూరి కరుణ, నల్లగొండ జిల్లా కన్వీనర్ బి. సోమిరెడ్డి, నల్లగొండ జిల్లా మహిళా విభాగం నాయకులు నూకాలమ్మ, వైఎస్ఆర్సీపీ సేవాదళ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులున్నారు. ఆదర్శ రైతులకు కనీస వేతనం ఇవ్వాలి.. రాష్ట్రంలోని రైతులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం చెల్లించేలా సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదర్శ రైతుల అసోసియేషన్ (అప్సర) వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శేఖర్, ఉపాధ్యక్షుడు పుచ్చకాయల ఏడుకొండలుతోపాటు పలు జిల్లాల ప్రతినిధులు బుధవారం ఇక్కడ విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. ఆదర్శ రైతులకు వెయ్యి రూపాయలే గౌరవ వేతనంగా ఇస్తున్నారని.. దాంతో కుటుంబ పోషణ సాధ్యం కాద ని వివరించారు. కాగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదర్శరైతుల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని విజయమ్మ హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ నేతలు ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. -
పీబీసీ రైతులను ఆదుకోండి
పులివెందుల, న్యూస్‌లైన్: పులివెందుల బ్రాంచ్ కాలువ ఆయకట్టు రైతులకు నీరందించి ఆదుకోవాలని.. మూడు, నాలుగేళ్లుగా నీరు రాక.. ఆయకట్టు పరిధిలో చీనీచెట్లు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అనంతపురం కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖను వైఎస్ఆర్ సీపీ జిల్లా యువజన విభాగపు నాయకులు, పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయకట్టుదారుల సంఘం నాయకులు చప్పిడి రమణారెడ్డిలతోపాటు పలువురు రైతులు శనివారం సాయంత్రం అనంతపురం కలెక్టర్‌కు అందజేశారు. లేఖలోని సారాంశం.. పీబీసీ ఆయకట్టు స్థిరీకరణ కోసం చిత్రావతి బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని.. పులి వెందుల తాగునీటి అవసరాలతోపాటు అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల తాగునీటిని అందించేందుకు 2.83టీఎంసీల నీరు వినియోగమయ్యే పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి నీటిని డ్యాం నుంచి తరలిస్తున్నారని పేర్కొన్నారు. సీబీఆర్ ప్రాజెక్టు నుంచి 75శాతం అనంతపురం జిల్లా నీటి పథకాలే ఉన్నాయని లేఖలో విజయమ్మ గుర్తు చేశారు. ఐఏబీ కేటాయింపులు బాగానే ఉన్నా..పారదర్శకంగా అమలు చేయడంతో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారని అం దులో పేర్కొన్నారు. దీంతో పీబీసీ కాలువ పరిధిలోని ఆయకట్టుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఐఏబీలో పీబీసీకి నీటిని కేటాయిస్తున్నా.. పీబీసీ ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరి స్థితి నెలకొందని.. మూడేళ్లుగా వస్తున్న అరకొర నీటితో చివరకు పులివెందులకు తాగునీటికి కూడా అందించలేకపోయిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు. దీనికి ప్రధాన కారణం సీబీఆర్‌లో ఉన్న తాగునీటి అవసరాలు 2.83 టీఎంసీలయితే.. అధికారికంగా 2టీఎంసీలే ఇవ్వ గా.. 0.83టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు లోటుగా భావించాలి. ఇదంతకూడా ఐఏబీలో అవగాహనారాహిత్యంగా జరుగుతున్న తతంగమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ పెన్నార్ నుంచి తుం పెర వరకు నీరు ప్రవహించే సమయంలో 15శాతం నీటిని.. అలాగే తుంపెర నుంచి సీబీఆర్కి చేరే సమయంలో జరిగే నీటి నష్టాన్ని 20శాతం లాసెస్ కింద నష్టం జరుగుతోందని అధికారులు రికార్డులలో చూపిస్తున్నారని.. ఈ లెక్కన 2టీఎంసీల నీటిలో 35శాతం లాసెస్ కింద పోగా.. సీబీఆర్‌కు 1.40 టీఎంసీల నీరు చేరుతోందని విజయమ్మ పేర్కొన్నారు. మరోవైపు పీబీసీ రైతులకు చుక్కనీరు అందక.. బోర్లల్లో భూగర్భజలాలు అడుగంటి పులివెందుల ప్రాంత రైతులు చీనీ చెట్లను నరికివేసుకున్నారని వివరించారు. ఈ ఏడాది ఐఏబీ సమావేశంలో కేటాయింపుల అమలు తీరు మీకు వివరించాలనుకున్నామని.. ఈ ఏడాది ఐఏబీలో సీబీ ఆర్‌లోని తాగునీటికి 2 టీఎంసీలను.. పీబీసీ సేద్యపు నీటి అవసరాలకు 1.23టీఎంసీల నీటిని కేటాయించారు. తొలి విడత కింద తాగునీటి కోటాను సీబీఆర్‌కు ఆగస్ట్‌లో ఇచ్చారన్నారు. హెచ్ఎల్సీ అధికారుల లెక్కల ప్రకారం 2.33టీఎంసీలు ఇచ్చినట్లు వారు నివేదికలో చూపించారని.. వాస్తవానికి సీబీ ఆర్కు చేరింది ఒక టీఎంసీ నీరు మాత్రమేనని.. ప్రస్తు తం పీబీసీకి కేటాయించిన సేద్యపు నీటి కోటా కింద 1.23టీఎంసీల నీరు ఇస్తున్నారని.. ప్రస్తుతం తుంపెర వద్ద ఇస్తున్న రీడింగ్ ఇదే విధంగా అమలు చేస్తే ఈనెల 10వ తేదీకి సేద్యపు నీటి కోటా ముగుస్తుందని అధికారు లు చెబుతున్నారని వివరించారు. ఒకవేళ అధికారుల లెక్కల ప్రకారమే ఇస్తున్నారనుకున్నా.. తుంగభద్ర డ్యా ం నుంచి హెచ్ఎల్సీకి అదనంగా కేటాయించిన 2టీఎం సీలలో దామాషా కింద పీబీసీకి 12.62శాతం రావాలి. అంటే సుమారు 0.25టీఎంసీల నీరు పీబీసీకి రావాల్సి ఉంది కదా అని ఆమె ప్రశ్నించారు. మీరు పీబీసీ రైతాంగ దీన స్థితిని అర్థం చేసుకొని ఈనెల చివరకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే విజయమ్మ లేఖలో కోరారు. -
అర్హులకు భూపంపిణీ
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్ : నియోజకవర్గ వ్యాప్తంగా 7వ విడత భూ పంపిణీలోఅర్హులైన నిరుపేదలను గుర్తించి వారికే అందేటట్లు చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అధికారులను ఆదేశించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం 7వ విడత భూ పంపిణీపై అసైన్మెంటు కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు వైఎస్ఆర్ కూడా పేదలకు భూమి ఉంటే అభివృద్ధి చెందుతారని భావించారన్నారు. ప్రణాళికబద్ధంగా గ్రామాల్లో సర్వే చేపట్టి భూ పంపిణీ చేయాలన్నారు.అనంతరం ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు భూములు అందడంలేదన్నారు. ఆర్డీవో రఘునాథరెడ్డి మాట్లాడుతూ పులివెందులకు సంబంధించి 452 లబ్ధిదారులకు 823.39ఎకరాలు పంపిణీకి అర్హులుగా గుర్తించామన్నారు. అలాగే సింహాద్రిపురంలో 211మందికి 386.25ఎకరాలు, లింగాలకు చెందిన 286మందికి 561.21ఎకరాలు, తొండూరుకు సంబంధించి 838మందికి 1363.08, వేముల మండలానికి సంబంధించి 166మందికి 296.83, వేంపల్లె మండలానికి సంబంధించి 133మందికి 280.94 ఎకరాలు పంపిణీకి అర్హులన్నారు. కార్యక్రమంలో కడప ఆర్డీవో హరిత, టీడీపీ నాయకులు రాంగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్నాయకులు శివమోహన్‌రెడ్డి, అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శనీయుడు బ్రదర్ ఫిలిప్
చిక్కడపల్లి, న్యూస్‌లైన్: గత ఏడు దశాబ్దాలకు పైగా హెబ్రోన్ చర్చి వ్యవస్థాపకులు బ్రదర్ భక్త్ సింగ్‌తో కలిసి బ్రదర్ ఫిలిప్ దైవసేవకులుగా పని చేసి మార్గదర్శకులుగా నిలిచారని, ఆయన అందరికి ఆదర్శమని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ కొనియాడారు. బుధవారం గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని హెబ్రోన్ చర్చిలో బ్రదర్ ఫిలిప్(96) భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఫిలిప్ క్రైస్తవ సంఘాలకు నమ్మకంగా పనిచేసి దేవుని మహిమను చాటారన్నారు. బ్రదర్ ఫిలిప్ చనిపోలేదని, మన మనసులో నిలిచి ఉంటారని విజయమ్మ అన్నారు. ఫిలిప్ పులివెందులకు వచ్చినప్పుడు తమ అత్తగారి ఇంటికి వచ్చేవారని, అనేక ఏళ్లుగా తమకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, సుచరిత, హెబ్రో చర్చి బ్రదర్, దైవ సేవకులు పీటర్, జాన్ సుబ్బారెడ్డి, కె.ఎం. శ్యాంసన్, దీనబాబు, అరవిందం తదితరులు పాల్గొన్నారు. హెబ్రోన్ చర్చి నుంచి రాత్రి 9 గంటలకు చెన్నైలోని యోవోహషమ్మా చర్చికి ఫిలిప్ భౌతికకాయాన్ని తరలించారు. చెన్నైలో శుక్రవారం కిల్పాక్ మిషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. వేలాదిగా తరలి వచ్చిన క్రైస్తవులు బ్రదర్ ఫిలిప్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాదిగా క్రైస్తవులు, దేశ, విదేశాల నుంచి తరలి వచ్చారు. నగరంలోని గోల్కొండ క్రాస్ రోడ్డులోని ప్రసిద్ధి చెందిన బ్రదర్ భక్త్ సింగ్ స్థాపించిన హెబ్రోన్ చర్చి ప్రపంచంలోనే లక్షలాది శాఖలుగా విస్తరించి అనేక మంది భక్తులను చూరగొంది. హెబ్రోన్ చర్చి ట్రస్టీ, ఛైర్మన్ బ్రదర్ కె.ఫిలిప్ (96) భార్య సెలస్టియన్, కుమారుడు జాన్ఫిలిప్, కుమార్తె హన్నా, అల్లుడు కెనేత్లు దైవ సేవకులుగా ఉన్నారు. ఫిలిప్ బాంబేలో షిప్ ఇంజినీర్‌గా పని చేస్తున్నప్పుడు చర్చికి వెళ్లినప్పుడు దైవజనులు భక్త్‌సింగ్ సువార్త ద్వారా రక్షణ పొంది హెబ్రోన్ చర్చి సేవకుడిగా మారి ట్రస్టీ ఛైర్మన్‌గా పేరు ప్రఖ్యాతులు పొందారు. గత గురువారం బెంగళూరులో దైవ సేవలో పాల్గొనడటం విశేషం. దేశ, విదేశాల్లో దైవ సేవకులుగా మంచి పేరు గడించారు. హెబ్రోన్ చర్చి నుంచి రాత్రి 9 గంటలకు చెన్నైలోని యోవోహషమ్మా చర్చికి భౌతికకాయాన్ని తరలించారు. చెన్నైలో శుక్రవారం కిల్పాక్ మిషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. -
విజయమ్మకు ఘన స్వాగతం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మకు విశాఖ విమానాశ్రయంలో బుధవారం ఘన స్వాగతం లభించింది. శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆమెకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అభిమానులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, నగర యువజన విభాగం కన్వీనర్ గుడ్ల పోలిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, గండి బాబ్జీ, జి.వి.రవిరాజు, కోలా గురువులు, కోరాడ రాజబాబు, కుంభా రవిబాబు, చెంగల వెంకట్రావు, వంజంగి కాంతమ్మ, కిడారి సర్వేశ్వరరావు, పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర బీసీ కమిటీ సభ్యుడు తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, పార్టీ నాయకులు పీలా ఉమారాణి, అంగ అప్పలరాజు, ప్రభా గౌడ్, గండి రవికుమార్, బట్టు సన్యారావురెడ్డి, నారా నాగేశ్వరరావు, చింతల అప్పలనాయుడు, వల్లిరెడ్డి శ్రీనివాసరావు, పూజారి ఉదయ్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు మారుతీ ప్రసాద్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
జననేతగా..
సాక్షి, కడప: జననేత వైఎస్జగన్ మరోసారి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యేలు ఆకేపాటి, కొరముట్ల, గడికోట ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత అందరూ ఆమరణదీక్షలు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులో ఉండి కూడా సమైక్యరాష్ట్రం కోసం ఆమరణదీక్ష చేశారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా రెన్నెళ్లుగా సమైక్యరాష్ట్రం కోసం పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణనోట్‌ను కేంద్రకేబినెట్ గురువారం ఆమోదించడం పార్టీ శ్రేణులతో పాటు జిల్లావాసులను కలచివేసింది. ఇక విభజన ప్రక్రియను ఎవరూ ఆపలేరేమో అనే దిశగా చాలామంది డీలాపడ్డారు. ఈ క్రమంలో ప్రజలకు అండగా జగన్ నిలిచారు. ఇప్పటికే సమైక్యం కోసం దీక్ష చేసిన ఆయన మరోసారి హైదరాబాద్‌లో ఆమరణదీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆమరణదీక్ష కొనసాగించనున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు పట్టదా?: రాష్ట్రవిభజనపై కేంద్రం దూకుడు ప్రదర్శిస్తున్నా కాంగ్రెస్, టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం జిల్లా ప్రజలను తీవ్ర ఆవేశానికి లోనుచేస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యేలు సమైక్యరాష్ట్రం కోసం ఎక్కడా ఉద్యమంలో పాల్గొనడంలేదు. తెలంగాణపై సీడబ్ల్యూసీ ప్రకటన చేసిన తర్వాత రాజీనామాలు చేయలేదు. ఇదేంటంటే ‘అసెంబ్లీలో తీర్మానం వీగిపోయేందుకు పదవులు అవసరమని’ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఇదే నిజమైతే అందుకు ఎమ్మెల్యే పదవులు సరిపోతాయని, మంత్రి పదవులకు ఎందుకు రాజీనామా చేయడంలేదని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు కూడా సమైక్యరాష్ట్రంపై చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు. ఇప్పటి వరకూ ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడునోటి వెంట ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి’ అనే మాటనే చెప్పించలేకపోయారు. పైగా ఎంపీ పదవిని సీఎం రమేష్ ఆమోదించుకోలేకపోయారు. ఓ వైపు సహచరరాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రాజీనామాను ఆమోదించుకుంటే రమేష్ ఎందుకు ఆపని చేయలేకపోయారని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. జగన్‌దీక్షకు మద్దతుగా రిలేదీక్షలు: కే సురేష్‌బాబు, జిల్లా కన్వీనర్, వైఎస్సార్సీపీ సమైక్యరాష్ట్రం కోసం మా అధినేత జగన్ మరోసారి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. నేనున్నానంటూ సమైక్య ఉద్యమకారుల్లో ధైర్యం నింపుతున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జగన్ నాయకత్వంలో సమైక్యరాష్ట్రాన్ని సాధించుకుంటాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మాపార్టీ నేతలు రిలేదీక్షలు చేస్తున్నారు. జగన్ ఆమరణ దీక్షకు మద్దతుగా ఆ శిబిరాల్లో దీక్షలు కొనసాగుతాయి. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రత్యక్ష ఉద్యమంలో రావాలి. లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. జగన్దీక్షతో ఉద్యమకారుల్లో ధైర్యం కాంగ్రెస్, టీడీపీ నేతలు అండగా నిలవకపోయినా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ మలివిడత ఆమరణదీక్ష చేస్తుండటం సమైక్యవాదుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. సమైక్యరాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు జగన్ అని ఇటీవల జరిగిన రౌండ్‌టేబుల్‌సమావేశంలో జేఏసీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి ఆశలు వమ్ముకాకుండా మరోసారి జగన్ ఆమరణదీక్షకు కూర్చోవడాన్ని స్వాగతిస్తున్నారు. వైఎస్సార్‌పార్టీ దీక్షలకు మద్ధతు పలికి, ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. -
సాంకేతిక సమస్యలు పరిష్కరించండి
పులివెందుల, న్యూస్‌లైన్ : గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పులివెందుల బ్రాంచ్ కాలువకు కృష్ణా జలాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ పరిణామమని, అయితే నీటి విడుదలకు ముందే సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ జిల్లా కలెక్టర్ శశిధర్‌కు ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖను కలెక్టర్‌కు ఫ్యాక్స్ చేసిన అనంతరం మీడియాకు విడుదల చేశారు. గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటిని తెచ్చి అక్కడ నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 20వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని ప్రభుత్వం సంకల్పించడం సంతోషకరమని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కలెక్టర్‌గా చేసిన కృషిని అభినందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందించి మహానేత దివంగత సీఎం వైఎస్ఆర్ కలను నెరవేర్చారన్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్లు గండికోట ఎత్తిపోతల పథకంలో భాగంగా పైడిపాలెం రిజర్వాయర్ నుంచి పులివెందుల బ్రాంచ్ కాలువ ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే, హిమకుంట్ల చెరువు పనులు పూర్తి కావాల్సి ఉందని లేఖలో వివరించారు. ఈ విషయమై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు, తాను పలుసార్లు సంబంధిత కాంట్రాక్టు సంస్థపైన, అధికారులపైన ఒత్తిడి తెచ్చిన విషయాన్ని వివరించారు. అయినా, పనులు పూర్తిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణ పనులు పూర్తి కాకుండా పీబీసీకి నీరు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు. సత్వరమే ఆ పనులను పూర్తి చేయించి పీబీసీ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండు చేశారు. కరువు పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా పులివెందుల మునిసిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రతరమైందన్నారు. ఈ నేపథ్యంలో నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కృష్ణా జలాలతో నింపేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. -
అవిశ్రాంత పోరు
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా ‘అనంత’ ప్రజానీకం ముందుకు సాగుతోంది. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు 36 రోజులుగా అవిశ్రాంత పోరాటం సాగిస్తున్నారు. సమైక్య సాధనే తమ లక్ష్యమని, ఇందు కోసం ప్రాణాలైనా అర్పిస్తామని స్పష్టం చేస్తున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగితే జిల్లా వాసులకు ఏ విధంగా నష్టం వాటిల్లుతుందో ప్రజలకు అర్థమయ్యేలా, రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగేలా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బత్తలపల్లిలో జర్నలిస్టులు చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే గురునాథరెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే అన్ని విధాలా నష్టపోయేది మనమేనని, ప్రాణాలున్నంత వరకూ సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తున్నది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశామని, తర్వాత వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టారన్నారు. అనంతరం వైఎస్ జగన్మోహనరెడ్డి జైల్లోనే దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం సమైక్య శంఖారావం పేరిట షర్మిల బస్సు యాత్ర చేస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తున్నది కేవలం వైఎస్ కుటుంబమేనని, కాంగ్రెస్, టీడీపీలు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని ధ్వజమెత్తారు. అనంతపురంలో ఇందిరాక్రాంతి పథం ఉద్యోగులు చేపడుతున్న రిలేదీక్షల్లో వినూత్నంగా ఖాళీ బిందెలను ప్రదర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే తాగునీటి కరువు ఏర్పడుతుందని హెచ్చరించారు. స్టేట్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. నగరంలో ఉపాధ్యాయ జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత జనగర్జన కార్యక్రమానికి వస్తున్న ఎస్కేయూ విద్యార్థులు, సమైక్యవాదులను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు బుధవారం ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు పోలీస్‌స్టేషన్ ఎదుటే బైఠాయించారు. ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్, జేఏసీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి గర్జన విజయవంతమైంది. గుత్తి, పామిడిలలో సమైక్య ఉద్యమాలు హోరెత్తాయి. కళ్యాణదుర్గంలోని జయనగర్‌కాలనీ వాసులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ, మానవహారం చేపట్టారు. మడకశిరలో రెవెన్యూ ఉద్యోగులు ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. మడకశిరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమైక్య ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమకారులు రోడ్డుపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. పెనుకొండలో జ్యోతిష్యం చెబుతూ సమైక్యవాదులు నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాయదుర్గం బంద్ విజయవంతమైంది. శాంతినగర్ కాలనీ వాసులు వంటావార్పు నిర్వహించారు. ప్రైవేట్స్కూల్స్, ఆర్యవైశ్యసంఘం, ఫొటోగ్రాఫర్స్, ఆల్మర్చెంట్స్, బలిజ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కణేకల్లులో విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు జలదీక్ష చేపట్టారు. ఎన్జీఓ సంఘం నాయకులు బిక్షాటన చేసిన నిరసన తెలిపారు. గార్లదిన్నెలో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో పెన్నా నదిలో నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ నాయకులు కూరగాయల దండలు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే ఇన్నాళ్లూ కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ మనకు లేకుండా పోతుందా? అని కలత చెందిన ఓడిసి వాసి నారాయణరెడ్డి(43) గుండెపోటుతో మృతి చెందాడు. విభజన జరిగితే జరిగే నష్టాలపై స్థానికులతో చర్చిస్తుండగా గుండెపోటు రావడంతో ముదిగుబ్బ మండలం తప్పెలవారిపల్లికి చెందిన పీసీ నాగన్న (55) మృతి చెందాడు. ఇతడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.