కదిరి,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాటం శంకర్, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రమేష్‌రెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్‌కుమార్, జిలాన్, ఎన్‌పీకుంట మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు రమేష్‌రెడ్డి, ప్రభాకర్, రాజారెడ్డి, కేశవ, ఎదురుదొన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఓబుళేసు, పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు షామీర్‌బాషా, షేక్ బాబా ఫకృద్దీన్‌తో పాటు 300 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షురాలు కండువా వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
వైఎస్సార్‌సీపీలో చేరిక
Published Mon, Mar 17 2014 3:36 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement