రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గురువారం కన్నుమూసిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డికి జిల్లాతోనూ అనుబంధం ఉంది. 2012, జూలై 23న వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ సిరిసిల్లలో చేపట్టిన ‘నేతన్న దీక్ష’లో ఆమె పాల్గొన్నారు.
ఒకదశలో వేదికపైకి కొందరు రాళ్లు వేయగా.. అవి విజయమ్మకు తగలకుండా శోభానాగిరెడ్డి ముందుకు వచ్చి నిలుచున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకురాలు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలియగానే స్థానికులు పలువురు సంతాపం తెలిపారు. ఆనాటి సంగతులు గుర్తుకు తెచ్చుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సిరిసిల్ల గాంధీచౌక్‌లో శోభానాగిరెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు.
నేతన్నకు అండగా నేనూ..
Published Fri, Apr 25 2014 3:39 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement