రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నేత దుర్మరణం | YSRCP leader Died in Bike Accident Anantapur | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నేత దుర్మరణం

Published Fri, Nov 30 2018 11:50 AM | Last Updated on Fri, Nov 30 2018 11:50 AM

YSRCP leader Died in Bike Accident Anantapur - Sakshi

నివాళులర్పిస్తున్న మాజీ ఎంపీ అనంత, సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌ (ఇన్‌సెట్‌) గోవింద్‌రెడ్డి(ఫైల్‌)

అనంతపురం, కంబదూరు: కదిరిదేవరపల్లి–ములకనూరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మండల పరిషత్‌  మాజీ ఉపాధ్యక్షులు కదిరిదేవరపల్లి గోవిందరెడ్డి (49) దుర్మరణం చెందాడు.. మృతుడి బంధువులు, పోలీసు వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం ములకనూరు వద్ద ట్రాక్టర్‌–ఆటో ఢీ కొన్న ఘటనలో కదిరిదేవరపల్లికి చెందిన హరిజన గంగాధర్‌  తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గోవిందరెడ్డి ఆ యువకున్ని కళ్యాణదుర్గం నుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువకున్ని ఆస్పత్రిలో ఆడ్మిట్‌ చేయించి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే అర్ధరాత్రి సమయంలో కదిరిదేవరపల్లి–ములకనూరు గ్రామాల మధ్య ఓ లారీ చెడిపోవడంతో రోడ్డు పక్కన నిలబెట్టారు. అయితే లారీ ఇండికేటర్లు వేయకపోవడంతో ఆటువైపుగా వస్తున్న గోవిందరెడ్డికి  లారీకి కనిపించలేదు. దీంతో బైక్‌ వేగంగా వచ్చి లారీ వెనుక ఢీ కొట్టింది. ఘటనలో గోవిందరెడ్డి తల, ఛాతీకి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన 2001 నుంచి 2005 వరకు మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మృతుడికి భార్య అరుణమ్మ ,కుమారుడు కార్తీక్, కుమారై మధుప్రియ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ రాగిరి రామయ్య తెలిపారు.

నివాళులర్పించిన ప్రముఖులు..
విషయం తెలుసుకున్న  వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షులు, మాజీ ఎంపీ అనంతవెంట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, తిప్పేస్వామి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు రాజారాం తదితరులు గురువారం కదిరిదేవరపల్లికి చేరుకుని గోవిందరెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement