రామగిరి/మడకశిర రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్ ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అరెస్ట్‌కు నిరసనగా గురువారం ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్‌ఎస్‌గేట్ సమీపాన 44వ జాతీయ రహదారిని గంట పాటు దిగ్బంధించారు. శంకరనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని మొదట్నుంచి పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీ ఒక్కటేనన్నారు.
సమైక్యం కోసం అసెంబ్లీలో గళం విప్పిన వైఎస్ విజయమ్మను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో సీఐ నరసింగరావు, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ వచ్చి వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పోలేపల్లి ఓబిరెడ్డి, నాయకులు రామాంజినేయులు, అంకే లక్ష్మన్న, రవీంద్రారెడ్డి, సందీప్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
‘సమైక్య’ తీర్మానం చేసి టీ బిల్లుపై చర్చించాలని పట్టుపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కై విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకు అనుకూలమని చెబుతున్నా... కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఓంకారస్వామి, జిల్లా యువత ఉపాధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, మండల ఎస్సీసెల్ కన్వీనర్ వెంకటరమణ, యువత నాయకులు సుదర్శన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నిద్రగట్ట నటరాజు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి దిగ్బంధం
Published Fri, Jan 10 2014 2:26 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement