సాక్షి, హైదరాబాద్ : నగరంలో రెండు మూడు వారాలుగా యాంటీ లార్వా ఆపరేషన్స్ చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలను ఎప్పటికపుడు వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 2400 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, హైదరాబాద్ లో 845 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 86 వేల ఇళ్లలో స్ర్పే చేయించామని, పాఠశాలలను శుభ్రం చేసే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు.
హైదరాబాద్ లో 410 అధిక ప్రమాదం గల ఏరియాలు ఉన్నాయని, డిసెంబర్ వరకు దోమల నివారణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారంలో రెండు రోజులు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేస్తున్నామని వెల్లడించారు. దోమల నియంత్రణ కోసం 1040 మిషన్లు ఉన్నాయన్నారు. అసలు దోమలు ఎపుడు ప్రభావంగా ఉంటున్నాయన్న అంశంపై పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం విష జ్వరాల ప్రభావం తగ్గిందని కమిషనర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment