సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న రెండు ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీ రవికిరణ్ స్థానంలో డీఎస్ లోకేష్ కుమార్‌ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా, మరో సీనియర్ IAS అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌ను జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్‌కు బుధవారం లేఖ రాసింది.
కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా ఐఏఎస్ వికాస్ రాజ్ కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ కలాహలం కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు, నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల సన్నద్దతపై వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment