సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా శశాంక్ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. గతంలో ఆయన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా, పర్యాటక, సాంస్కృ తిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు కొంత కాలం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. విద్యా శాఖ డైరెక్టర్‌గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు. గతంలో సీఈవోగా పనిచేసిన రజత్‌కుమార్‌ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిం చిన నేపథ్యంలో ఆయన స్థానంలో తాజాగా సీఈసీ శశాంక్ గోయల్‌ను నియమించింది. 2018 మేలో టర్కీకి విహార యాత్రకు వెళ్లిన శశాంక్ గోయల్ కుమారుడు శుభం గోయల్‌ను ఇస్తాంబుల్‌లో దోపిడీ దొంగలు కాల్చి చంపారు.
Comments
Please login to add a commentAdd a comment