
న్యూఢిల్లీ: ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం కలిశారు. డిప్యూటీ కమిషనర్‌తో దాదాపు మూడు గంటల పాటు ఆయన సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై చర్చించారు. ఈనెల 20న ఏపీలో రాజకీయ పార్టీలతో ముఖేష్ కుమార్ మీనా సమావేశం కానున్నారు. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు)ఇంటింటికి వెళ్లి ఓటర్లను తనిఖీ చేయనున్నారు.
కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయిన వారిని తొలగించడం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇంటింటికి వెళ్లే ఈసీ బృందంలో ఆయా రాజకీయ పార్టీలు ఏజెంటును (బీఎల్‌ఏ) ను నియమించుకునే అవకాశం ఉంది.
ఆగస్టు 2, 3 తేదీల్లో విశాఖలో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏపీలో ఈఆర్వోల నియామకం, ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 100% ఓటరు కార్డుల ముద్రణ పూర్తి కాగాకొత్త ఓటర్లకు సాధ్యమైనంత త్వరగా ఓటర్ కార్డులను ఇచ్చేందుకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రయత్నిస్తోంది.