సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు బాలుడి హత్యకు నరబలికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. వహీద్ హత్యకు ఆర్ధిక వివాదాలే కారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను బాలనగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.
వహీద్‌ను ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ హత్య చేసినట్లు డీసీసీ చెప్పారు. బాలుడి తండ్రి, ఇమ్రాన్ మధ్య చిట్టి విషయంలో గొడవలు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బాలుడిని ఆమె ఎత్తుకెళ్లి చంపేసినట్లు తెలిపారు. మహీద్‌ను హత్య చేసి మృతదేహాన్ని బకెట్‌లో కుక్కినట్లు పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్ సాయంతో మృతదేహన్ని గోనెసంచిలో మూటకట్టి నాలాలో పడేశారని చెప్పారు. బాలుడి కిడ్నాప్‌కు నలుగురు వ్యక్తులు సహకరించారని.. ఈ హత్యకేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా హత్యపై వివరాలు సేకరించామని.. వహీద్ హత్యపై విస్తృత దర్యాప్తు జరుగుతోందన్నారు.
చదవండి: Ramadan 2023: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Comments
Please login to add a commentAdd a comment