
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ నేత, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ నెల 16వ తేదీన సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సాజిద్ అనే మరొక నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పాత గొడవల కారణంగా మద్యం మత్తులో వల్లభనేని శ్రీనివాసరావును చంపినట్టు పోలీసులు దర్యాప్తులో నిందితులు వెల్లడించారు.
కాగా స్థానిక నాయకులతో శ్రీనివాసరావు గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టి హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment