trs leadar
-
టీఆర్ఎస్ కార్యకర్తలను తరలిస్తున్న టాటాఏస్ బోల్తా..
-
'పాత గొడవలతోనే చంపేశాం'
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ నెల 16వ తేదీన సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సాజిద్ అనే మరొక నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పాత గొడవల కారణంగా మద్యం మత్తులో వల్లభనేని శ్రీనివాసరావును చంపినట్టు పోలీసులు దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. కాగా స్థానిక నాయకులతో శ్రీనివాసరావు గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టి హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. -
తాగి రచ్చచేసిన టీఆర్ఎస్ నేత
-
తాగి రచ్చచేసిన టీఆర్ఎస్ నేత
సాక్షి, వరంగల్ అర్బన్: పోలీసుల డ్రంక్ డ్రైవ్‌లో ఓ టీఆర్ఎస్ నేత పట్టుబడ్డాడు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు కారులో వస్తున్న టీఆర్ఎస్ నాయుకుడు మోతీలాల్ నాయక్‌ను గురువారం రాత్రి కాజీపేట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహించేందుకు ప్రయత్నించగా మోతీలాల్ అందుకు అంగీకరించలేదు. అంగీకరించక పోగా తాను అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌నని.. హోం మినిస్టర్ ను కలిసేందుకు వెళ్తుంటే కారును ఆపుతారా అంటూ పోలీసులపై చిందులు వేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐకి, టీఆర్ఎస్ నేతల మధ్య దాదాపు అరగంట పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. చౌరస్తాలో జరిగిన ఈ హంగామాతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఎట్టకేలకు బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేయగా మోతీలాల్ నాయక్ 72 శాతం మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. దీంతో మోతీలాల్ పై డ్రంక్ డ్రైవ్‌తో పాటు, ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీఆర్ఎస్ నాయకుడి కారుకి నిప్పు
భద్రాద్రి : టీఆర్ఎస్ నాయకుడి కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కనగాల బాలకృష్ణ కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో హోండా క్రెటా కారు పూర్తిగా దగ్దమైంది. కారు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.