సాక్షి, వరంగల్ అర్బన్: పోలీసుల డ్రంక్ డ్రైవ్‌లో ఓ టీఆర్‌ఎస్ నేత పట్టుబడ్డాడు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు కారులో వస్తున్న టీఆర్‌ఎస్ నాయుకుడు మోతీలాల్ నాయక్‌ను గురువారం రాత్రి కాజీపేట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహించేందుకు ప్రయత్నించగా మోతీలాల్ అందుకు అంగీకరించలేదు. అంగీకరించక పోగా తాను అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌నని.. హోం మినిస్టర్ ను కలిసేందుకు వెళ్తుంటే కారును ఆపుతారా అంటూ పోలీసులపై చిందులు వేశారు.
ఈ క్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐకి, టీఆర్‌ఎస్ నేతల మధ్య దాదాపు అరగంట పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. చౌరస్తాలో జరిగిన ఈ హంగామాతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఎట్టకేలకు బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేయగా మోతీలాల్ నాయక్ 72 శాతం మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. దీంతో మోతీలాల్ పై డ్రంక్ డ్రైవ్‌తో పాటు, ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment