Motilal Naik
-
ఆరోగ్యం సహకరించడం లేదు.. దీక్ష విరమిస్తున్నా
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్) : ‘ఆరోగ్యం సహకరించడం లేదు.. శరీరంలోని అన్నీ అవయవాలు కొంతమేర శక్తిని కోల్పోయాయి. అందుకే నిరాహార దీక్ష విరమిస్తున్నా. ప్రలోభాలకు లొంగలేదు..తొమ్మిది రోజులు ఆహారం తీసుకోకుండా నిరుద్యోగుల కోసం పోరాటం చేశాను. ఇకపై ఆహారం తీసుకుంటూ ఉద్యమిస్తా.. త్వరలోనే ఐక్య కార్యాచరణ ప్రకటిస్తా’ అని నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌నాయక్ స్పష్టం చేశారు. తొమ్మిది రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆయన మంగళవారం ఉదయం గాంధీ ప్రాంగణంలో కొబ్బరినీళ్లు తాగి దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పలుపార్టీల నేతలు, సంఘ నాయకులు కలిసి ఉద్యమం చేద్దామనే పిలుపు మేరకు దీక్ష విరమించానని, రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పారు. తన దీక్షకు సంఘీభావం ప్రకటించిన అందరినీ కలిసి మద్దతు కూడగట్టి, నిరుద్యోగుల సత్తా చూపిస్తామని, ప్రభుత్వ మెడలు వంచి న్యాయమైన డిమాండ్లు సాధించుకుంటామన్నారు. తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, ఇకపై పాముకాటు ఎలా ఉంటుందో చూపిస్తానని సవాల్ విసిరారు. మరణిస్తే ఉద్యమం చేయలేనని, బతికి డిమాండ్లు సాధించుకుంటామని, రోజుకో తీరుతో విభిన్న తరహాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించనని శపథం చేశారు. తెలంగాణలోని పలు రాజకీ యపార్టీలు, సంఘాలు, నిరుద్యోగులు తన వెనుక ఉన్నారని, త్వరలోనే 10 లక్షల మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క ఫోన్ చేసి మాట్లాడింది వాస్తమేనన్నారు. నగరంలోని అశోక్‌నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి తన కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు తన పోరాటం ఆగదన్నారు. నగర కేంద్ర గ్రంథాలయానికి మోతీలాల్‌నాయక్ మోతీలాల్ నాయక్ దీక్ష విరమించిన అనంతరం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించారు. లక్షలాది మందితో మరో 10 రోజుల్లో టీజీపీఎస్సీని ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సిటీ లైబ్రరీ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. -
తాగి రచ్చచేసిన టీఆర్ఎస్ నేత
-
తాగి రచ్చచేసిన టీఆర్ఎస్ నేత
సాక్షి, వరంగల్ అర్బన్: పోలీసుల డ్రంక్ డ్రైవ్‌లో ఓ టీఆర్ఎస్ నేత పట్టుబడ్డాడు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు కారులో వస్తున్న టీఆర్ఎస్ నాయుకుడు మోతీలాల్ నాయక్‌ను గురువారం రాత్రి కాజీపేట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహించేందుకు ప్రయత్నించగా మోతీలాల్ అందుకు అంగీకరించలేదు. అంగీకరించక పోగా తాను అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌నని.. హోం మినిస్టర్ ను కలిసేందుకు వెళ్తుంటే కారును ఆపుతారా అంటూ పోలీసులపై చిందులు వేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐకి, టీఆర్ఎస్ నేతల మధ్య దాదాపు అరగంట పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. చౌరస్తాలో జరిగిన ఈ హంగామాతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఎట్టకేలకు బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేయగా మోతీలాల్ నాయక్ 72 శాతం మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. దీంతో మోతీలాల్ పై డ్రంక్ డ్రైవ్‌తో పాటు, ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
సేవాలాల్ మహారాజ్ చరిత్ర అందరికీ తెలవాలి
దేవరకొండ : సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చరిత్రను తెలంగాణలోని ప్రతి గిరిజ నుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉం దని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్‌నాయక్ అభిప్రాయపడ్డారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఈనెల 12న దేవరకొండ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించనున్న నేపథ్యంలో వారు మహారాజ్ చరిత్రకు సం బంధించిన బ్రోచర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్‌నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతిని జరుపుకునే తరుణంలో తెలంగాణలోని ప్రతి గిరిజనుడు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాంరావు మహా రాజ్, ఎమ్మెల్సీ రాములునాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎస్టీ సెల్ జిల్లా అ«ధ్యక్షుడు రాం బాబునాయక్, లాలునాయక్ తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలి పారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు పెద్దసంఖ్యలలో తరలిరావాలని కోరారు. నాగునాయక్, సాయికుమార్, రాజు, రమేశ్, కె.సునీల్, కె.రమేశ్, కె.శరత్‌నాయక్, నాగరాజు పాల్గొన్నారు.