హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థీ ఇంతవరకు హ్యాట్రిక్ రికార్డును కైవసం చేసుకున్న చరిత్ర లేదు. మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వరుసగా ఆ విజయాలను నమోదు చేసుకున్న పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. 1978లో సనత్‌నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు మొత్తం 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
1992, 1994లో వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి మర్రి శశిధర్‌రెడ్డి గెలుపొందగా 1999 ఎన్నికల్లో శ్రీపతిరాజేశ్వర్ గెలుపొందడంతో శశిధర్‌రెడ్డికి హ్యాట్రిక్ దూరమైంది. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో సైతం మర్రి శశిధర్‌రెడ్డి రెండుసార్లు వరుస విజయాలను నమోదు చేసుకోగా 2014లో ఆయన పరాజయం పాలవడంతో మరోసారి హ్యాట్రిక్ మిస్ అయ్యింది. ఇక 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గెలుపొంది మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment