
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడకు వెళ్లే టైం లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన రఘునందన్ రావు.. గత ఎనిమిది రోజులుగా సీఎం రేవంత్.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సందర్భించే తీరిక లేదన్నారు. తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు.. రేవంత్ ఒకవేళ కలిస్తే ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు.
పేరుకే పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారు. సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ గా ఉన్న మహేస్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నా. జీహెచ్ఎంసీలో ఒక అధికారికి ఐదేళ్లుగా డిప్యూటేషన్ మీద పని చేస్తున్నారు. ఇక మున్సిపల్ పాలనపై సీఎం రేవంత్ కు పట్టులేదు. మమునూరు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు. గద్వాల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో తన ఫోటో కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కిషన్ రెడ్డి సౌమ్యుడు.. ఆయన గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు. ఆరు మంత్రి పదవులు భర్తీ చేసుకోలేని పరిస్థితి రేవంత్‌ది

‘త్రిభాషా సిద్ధాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉర్దూ భాష ఎందుకు రాస్తున్నారు. 90 శాతం జనాలకు ఉర్దూ రాకపోయినా ఎందుకు బోర్డులపై రాస్తున్నారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ అనుమతి తీసుకొని రేవంత్ తెలుగులో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ లో ఏ భాషలో మాట్లాడతారు. వ్యక్తిగత విమర్శలపై మేం మాట్లాడగలం . సిద్ధాంతం మీద, ప్రజా సమస్యలపై చర్చకు సిద్దం. వేదిక, సమయం చెప్పాలని సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నా. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది.. ఇక్కడ కేంద్రానికి ఏం సంబంధం.. రేవంత్ ను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం మరిచిపోయినట్లున్నారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ భయపడుతున్నారు’ అంటూ రఘునందన్ రావు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment