
సాక్షి, హైదరాబాద్: మాషా అల్లా హోటల్‌లో ఆహారం తిని 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన వారిలో 12 మంది కోలుకోగా మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్‌లోని మాషా అల్లా హోటల్‌లో బుధవారం రాత్రి 16 మంది మటన్ మండీ తిన్నారు. ఆ తరువాత అస్వస్థతకు గురయ్యారు.
వివరాలు సేకరిస్తున్న ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీవెంకాలు
దీంతో వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ శ్రీవెంకాలు గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్‌ను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment