సాక్షి, హైదరాబాద్: అండర్ బ్రిడ్జ్‌తో ఫేతే నగర్ బ్రిడ్జ్‌పై రద్దీ తగ్గుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం కేటీఆర్ మాట్లాడుతూ, ‘137 కొత్త లింక్ రోడ్లు వేస్తున్నాం. ఆర్ యూ బీ వలన ఫేతే నగర్ బ్రిడ్జ్ పై రద్దీ తగ్గుతుంది. దీని వలన 6.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం. రేపు రెండు లింక్ రోడ్లు ప్రారంభిస్తాం. సెప్టెంబర్ వరకు బాలా నగర్ ప్లై ఓవర్ పూర్తి అవుతుంది. రోడ్డు విస్తరణలో ఎక్కవ మొక్కలు నాటాలి. త్వరలోనే నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు అందిస్తాం’ అని తెలిపారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారయణ రెడ్డి 89 వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లో సి.నా.రె సారస్వత సదనం ఆడిటోరియమ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నారాయణ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు.
Laid foundation for the construction of Dr. C. Naa. Re Saraswatha Sadanam Auditorium at Banjara Hills along with Hon’ble MA & UD Minister Sri @KTRTRS Garu, MLA Danam Nagender Garu & Others. pic.twitter.com/Gc9kIdapIX
— V Srinivas Goud (@VSrinivasGoud) July 29, 2020
ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ‘సనత్ నగర్ ఏరియాలో వాటర్ రిజర్వాయర్, ఇండోర్ స్టేడియం, మహాప్రస్థానం ఇక ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను కేటీఆర్ మంజూరు చేశారు. గతంలో ఉన్న ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణకు సహకరించారు. 30ఏళ్లలో ఇంత డైనమిక్ నేతను చూడలేదు. నగరంలో అనేక పనుల అభివృద్ధిలో కేటీఆర్ కృషి ఉంది’ అని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment