ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసాని | Talasani srinivasa yadav slams tdp leaders | Sakshi
Sakshi News home page

ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసాని

Published Thu, Apr 23 2015 12:51 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసాని - Sakshi

ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసాని

హైదరాబాద్ :  తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎర్రబెల్లి దయాకరరావు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తో ఎర్రబెల్లి రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారో తెలపాలని తలసాని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసమే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు వద్ద డబ్బులు తీసుకుని పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను సనత్నగర్లో ఎమ్మెల్యే పోటీచేసి ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. కాగా టీడీపీ తరపున సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గత ఏడాది అక్టోబర్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement