
సాక్షి, విశాఖపట్నం: 24 గంటల్లో నేనేంటో చూపిస్తా... ఒక్కొక్కరి తాట తీస్తా... నేనంటే ఏమిటో అందరికీ తెలిసేలా చేస్తా.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మేయర్ సబ్బం హరి శనివారం ఉదయం.. అలా మొదలు పెట్టి నోటికొచ్చినట్టు పేట్రేగిపోయి అన్న మాటలివి... 24 గంటల తర్వాత ఆదివారం నాడు అదే సబ్బం హరి... నేను ఆ రోజు సహనం కోల్పోయి మాట్లాడాను. ఆవేశంలో అన్న మాటలకు మన్నించమని కోరుతున్నాను.. అని క్షమాపణ కోరారు. (ఎవరిపైనా కక్షలేదు)
జీవీఎంసీకి చెందిన పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాన్ని నిబంధనల మేరకు కూల్చివేసిన అధికారులతో పాటు ఏకంగా పాలకులపై కూడా సబ్బం హరి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. తనకు తాను ఎక్కువ ఊహించుకు ని మీడియా ముందు రెచ్చిపోయారు. 24 గంటల్లో తానేంటో చూపిస్తానని సవాల్ వేశారు. కానీ అదే సబ్బం హరి మరుసటి రోజే.. ఎప్పటి మాదిరిగానే తనదైన శైలిలో నాలుగు గోడల మధ్య కుర్చీలో కూర్చుని అందరికీ క్షమాపణ చెప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment