కాంగ్రెస్‌ను ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్‌ | YS Jagan Mohan reddy One and Only Leader for Andhra Pradesh: sabbam hari | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్‌

Published Tue, Sep 17 2013 3:05 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

కాంగ్రెస్‌ను ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్‌ - Sakshi

కాంగ్రెస్‌ను ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్‌

కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్‌ అని అనకాపల్లి ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ :  కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్‌ అని .. అందుకే రాష్ట్ర ప్రజలంతా జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అనకాపల్లి ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు.  మంగళవారం ఆయన  చంచల్‌గూడ జైల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

తాను మూడున్నరేళ్లుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే ఉన్నానని సబ్బం హరి  స్పష్టం చేశారు.  వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్‌ఆర్‌సీపీ తరపున పోటీ చేస్తానని ఆయన  తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలన్న నాయకుడు కేవలం జగన్‌ మాత్రమేనని సబ్బం హరి స్పష్టం చేశారు.  రాష్ట్రం సమైక్యంగా ఉండాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జగన్కు త్వరలోనే బెయిల్ వస్తుందని సబ్బం హరి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement