సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎంపీ సబ్బంహరి వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేసి టాయిలెట్‌ను నిర్మించారు. 12 అడుగుల పార్క్‌స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారు. ఈ విషయం కాస్తా స్థానిక అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణన్ని తొలగించాలని నోటీసులు జారీచేశారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. అయితే అక్కడి చేరుకున్న అధికారులపై సబ్బం హరి నోరుపారేసుకున్నారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు.
తాజా వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ.. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారు. రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వంది. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాము. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశాము. సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసాము. నోటీసుకు సబ్బం హరి స్పందించలేదు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము.’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment