
మీ కళ్లు బైర్లు కమ్మాయా?: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్:'కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసిన ప్రతి తప్పులో మీరు భాగస్వాములు కాదా?, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని నిలవదీయలేని మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారా?, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్, విజయమ్మలు చేసిన దీక్షలు మీకు కనిపించలేదా?, కళ్లు బైర్లు కమ్మాయా?, కాంగ్రెస్ విసిరే కుక్క బిస్కెట్లకు ఎగబడే మీరా?మమ్ముల్ని విమర్శించేది' అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సీమాంధ్ర ఎంపీలపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర సమైక్యత కోసం ఆ ప్రాంత ఎంపీ హోదాలో ఉన్న సబ్బం హరి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
అసలు వైఎస్ జగన్ కు సలహాలు ఇచ్చే అర్హత ఉందా?అని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి తప్పులో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భాగస్వాములేనని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచడం కోసం వైఎస్ జగన్, విజయమ్మ చేసిన దీక్షలు కనబడలేదా?అని ఆమె ప్రశ్నించారు.