
టికెట్ కోసమే స్పీకర్ అలా చేసి ఉంటారు: సబ్బం హరి
పార్లమెంటులో స్పీకర్ మీరాకుమార్ వ్యవహరించిన తీరు విచారకరమని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు మళ్లీ టికెట్ ఇవ్వదనే భయంతోనే ఆమె అలా ప్రవర్తించి ఉంటారన్నారు.
తనపై వ్యూహాత్మకంగానే దాడి జరిగిందని సబ్బం హరి అన్నారు. లగడపాటి రాజగోపాల్ వెంటన ఎప్పుడూ పెప్పర్ స్ప్రే ఉంటుందని, అదేదో విషవాయువు అన్నట్లు, మారణాయుధం అన్నట్లు చిత్రీకరించడం తగదని తెలిపారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగమేనని, పార్లమెంటు సీసీ టీవీ ఫుటేజిని తాము త్వరలోనే మీడియా ముందు ఉంచుతామని సబ్బం హరి తెలిపారు.