speaker Meira Kumar
-
టికెట్ కోసమే స్పీకర్ అలా చేసి ఉంటారు: సబ్బం హరి
పార్లమెంటులో స్పీకర్ మీరాకుమార్ వ్యవహరించిన తీరు విచారకరమని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు మళ్లీ టికెట్ ఇవ్వదనే భయంతోనే ఆమె అలా ప్రవర్తించి ఉంటారన్నారు. తనపై వ్యూహాత్మకంగానే దాడి జరిగిందని సబ్బం హరి అన్నారు. లగడపాటి రాజగోపాల్ వెంటన ఎప్పుడూ పెప్పర్ స్ప్రే ఉంటుందని, అదేదో విషవాయువు అన్నట్లు, మారణాయుధం అన్నట్లు చిత్రీకరించడం తగదని తెలిపారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగమేనని, పార్లమెంటు సీసీ టీవీ ఫుటేజిని తాము త్వరలోనే మీడియా ముందు ఉంచుతామని సబ్బం హరి తెలిపారు. -
మీరాకుమార్‌కు వైఎస్ జగన్ లేఖ
లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. సమయాభావం వల్ల తాను వ్యక్తిగతంగా పార్లమెంటులో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాలేకపోతున్నానని, తాను రాస్తున్న ఈ లేఖనే పార్టీ వైఖరిగా పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టద్దని, ఆ బిల్లును ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం నైతికంగా సరికాదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని, అసలు విభజన అప్రజాస్వామికమని ఆయన అన్నారు. బిల్లు విషయంలో రాజ్యాంగ విలువలను పాటించాలని కోరారు. పార్లమెంటు సహా అన్ని వేదికలపైనా తాము విభజనను వ్యతిరేకించామని, ఇకపై కూడా వ్యతిరేకిస్తూనే ఉంటామని ఆయన స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. కాగా, బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెళ్లి ఆయన రాష్ట్రపతిని కలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనను ఆమోదించవద్దని ప్రణబ్ ముఖర్జీని వైఎస్ జగన్ కోరే అవకాశముంది. -
లోక్‌సభ స్పీకర్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మానం!
న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా 2జీ కేసులో జేపీసీ నివేదికపై, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అంశం తప్ప ఏ అంశానికి అయినా మద్దతు ఇచ్చేందుకు ఆపార్టీ నేతలు నిర్ణయించారు. -
స్పీకర్ మీరాకుమార్ను కలవనున్న లగడపాటి
న్యూఢిల్లీ : విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేడు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన తన రాజీనామా లేఖను మరోసారి స్పీకర్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే స్పీకర్ ...లగడపాటితో పాటు మరో 12మంది ఎంపీలు రాజీనామాలు తిరస్కరించిన విషయం తెలిసిందే. భావోద్వేగాల వల్ల రాజీనామా చేశామనే కారణంతో స్పీకర్ తమ రాజీనామాలను తిరస్కరించారని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదం పొందాక రాష్ట్ర విభజనకు కారకులైన వారి జాతకాలు బయటపెడతానని గతంలో హెచ్చరించారు. ఇక రెండు నెలల క్రితం తాను చేసిన రాజీనామాను ఆమోదించేలా ఆదేశించాలంటూ లగడపాటి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
రాజీనామా ఆమోదించాలని స్పీకర్‌ను కోరాం
-
''స్పీకర్ పదవికి మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు'
న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌పై టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మీరా కుమార్ ...స్పీకర్ పదవికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినందువల్లే స్పీకర్ సీమాంధ్ర నేతల రాజీనామాలను ఆమోదించటం లేదని మోదుగుల ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆపి చిత్తశుద్ధితో పోరాటాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల అపాయింట్ మెంట్ ను స్పీకర్ మీరాకుమార్ చివరి నిముషంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పీకర్ పాట్నా పర్యటనలో ఉన్నారు. దాంతో ఈనెల 28న కలవాలని సూచించారు. -
'నాతోపాటు జగన్ రాజీనామాను ఆమోదించండి'
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామాను ఆమోదించవలసింది ఆయన ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరనున్నారు. సమన్యాయం చేయాలంటూ వైఎస్ జగన్ ఆగస్ట్ 10న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ అయిదును స్పీకర్ ఫార్మాట్లోనే ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపినట్లు మేకపాటి తెలిపారు. నిర్బంధంలో ఉండి కూడా వైఎస్ జగన్ తన రాజీనామాను ఫాక్స్ చేశారన్నారు. అన్ని రోజులుగా స్పీకర్ మీరాకుమార్ స్పందిస్తారని అనుకున్నామని... అయితే వారు స్పందించనందునే...తాను స్పీకర్ వద్దకు వెళుతున్నానన్నారు. రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరుతామని తెలిపారు. స్పీకర్ అపాయింట్మెంట్ అడిగామని, సాయంత్రంలోగా ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. విభనపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మేకపాటి వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పడుతోందని...విభజనపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని, ఒక పద్ధతి, ఒక విధానం లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారన్నారు. తనను గెలిపించిన ప్రజలకు బాబు ద్రోహం తలపెట్టారని, ఆయనలాంటి వ్యక్తుల మానసిక స్థితిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఓటింగులో అధికారపక్షం పొరపాటు...
న్యూఢిల్లీ: ఆహార భద్రత బిల్లుపై సోమవారం సుష్మా స్వరాజ్ ప్రవేశపెట్టిన సవరణపై జరిగిన ఓటింగులో గందరగోళానికి గురైన అధికారపక్షం తప్పులో కాలేసింది. బిల్లులోని ఎనిమిదో అధ్యాయంలో ఒకవేళ పూర్తి కోటా తిండిగింజలను ప్రభుత్వం సరఫరా చేయలేకపోతే, తిండిగింజలకు సమానమైన నగదును లబ్ధిదారులకు చెల్లించాలనే నిబంధన ఉంది. తిండి గింజలకు బదులు నగదు చెల్లిస్తే, కుటుంబాల్లోని పురుషులు ఆ డబ్బును నేరుగా మద్యం దుకాణాల పాలు చేస్తారని, ఫలితంగా ఇళ్లలోని మహిళలు, పిల్లలు ఆకలితో అలమటిస్తారని సుష్మా స్వరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లులోని ఎనిమిదో అధ్యాయంపై స్పీకర్ మీరా కుమార్ ఓటింగు నిర్వహించారు. అయితే, అధికార పక్ష సభ్యులు సుష్మా ప్రతిపాదించిన సవరణపై ఓటింగు నిర్వహిస్తున్నారని భావించి, వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితంగా ఎనిమిదో అధ్యాయానికి వ్యతిరేకంగా 261 ఓట్లు, అనుకూలంగా 101 ఓట్లు పడ్డాయి. దీంతో అధికారపక్షం సభ్యులు నాలుక కరుచుకున్నారు. జరిగిన గందరగోళాన్ని ఆర్థిక మంత్రి చిదంబరం స్పీకర్‌కు వివరించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఈ అంశంపై సెక్రటరీ జనరల్ టీకే విశ్వనాథన్‌తో చర్చలు జరిపారు. స్లిప్పులు ఉపయోగించి మరోసారి ఓట్లు వేయాల్సిందిగా చిదంబరం అధికార పక్షం సభ్యులను కోరారు. మరోసారి ఓటింగు కోసం సుష్మా స్వరాజ్, అద్వానీలకు కమల్‌నాథ్ విజ్ఞప్తి చేయడంతో వారు అంగీకరించారు. మళ్లీ నిర్వహించిన ఓటింగుతో బిల్లులోని ఎనిమిదో అధ్యాయం ఆమోదం పొందింది. -
సమైక్య నినాదాలతో లోక్‌సభ వాయిదా
-
సమైక్య నినాదాలతో లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ : లోక్‌సభలో రాష్ట్ర విభజన ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం అయిన అయిదు నిమిషాలకే గంటపాటు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సమావేశాలను సజావుగా నడిపేందుకు సహకరించాలని స్పీకర్ మీరాకుమార్ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతోగందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. అంతకు ముందు పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు స్పీకర్ కార్యాయలంలో మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అసంతృప్తిగానే ముగిసింది. తెలంగాణ అంశం, కోల్‌స్కాం సహా ఇతరత్రా అంశాలపై నిత్యం సభలో గందరగోళం నెలకొంటున్న విషయం తెలిసిందే. ఉభయసభలు ఏ అంశంపై చర్చ జరగకుండానే వాయిదా పడుతున్నాయి. దీంతో మిగిలిన కొద్దిరోజులైనా సభను సజావుగా నడిపేందుకు అన్ని పార్టీల నేతలతో స్పీకర్ మీరాకుమార్ చర్చలు జరిపినా ఫలితం లేకపోవటంతో అఖిలపక్షం మరోసారి భేటీ కానుంది.