''స్పీకర్ పదవికి మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు' | Modugula Venugopala Reddy allegations against Speaker meira kumar | Sakshi
Sakshi News home page

''స్పీకర్ పదవికి మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు'

Published Tue, Sep 24 2013 1:58 PM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

Modugula Venugopala Reddy allegations against Speaker meira kumar

న్యూఢిల్లీ : లోక్సభ స్పీకర్ మీరాకుమార్పై టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మీరా కుమార్ ...స్పీకర్ పదవికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినందువల్లే స్పీకర్ సీమాంధ్ర నేతల రాజీనామాలను ఆమోదించటం లేదని మోదుగుల ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆపి చిత్తశుద్ధితో పోరాటాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల అపాయింట్ మెంట్ ను స్పీకర్ మీరాకుమార్ చివరి నిముషంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పీకర్ పాట్నా పర్యటనలో ఉన్నారు. దాంతో ఈనెల 28న కలవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement