
'సబ్బం హరి పిల్లి మొగ్గలు!'
విశాఖ : జై సమైక్యాంధ్ర పార్టీ కీలక నేత, విశాఖ ఎంపీ అభ్యర్థి సబ్బం హరి పిల్లి మొగ్గలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు లీకులు ఇస్తున్నారు. డిపాజిట్ కూడా రాదనే భయంతోనే సబ్బం హరి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కాగా మాచర్ల, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాలకు బరిలోకి జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థులు పచ్చ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు సోమవారం టీడీపీలో చేరారు. అక్కడితో ఆగకుండా తమ పార్టీ ఓట్లు టీడీపీకి వేయిస్తామంటూ జేఎస్పీ అభ్యర్థులు ప్రకటించడం గమనార్హం. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
సబ్బం హరి, జై సమైక్యాంధ్ర, విశాఖ ఎంపీ, జేఎస్పీ, కిరణ్ కుమార్ రెడ్డి, sabbam Hari, jai samaikyandhra, visakha mp condidate, JSP, kiran kumar reddy