JSP
-
AP: ఎన్నికలంటే విపక్షాలకెందుకు వణుకు?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? విపక్షాలన్నీ అధికారపక్షంపై ఎందుకు బురద జల్లుతున్నాయి? ప్రతిపక్షాలన్నీ ఏకమై ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వంపై తప్పుడు లేఖలు ఎందుకు రాస్తున్నాయి? స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవుతాయని ముందుగానే ప్రతిపక్షాలు ఊహిస్తున్నాయా? అమ్మో ఎన్నికలా? ఏపీలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పేరు వింటేనే ప్రతిపక్షాలు హడలిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏ విధంగా అయితే ఏకపక్షంగా విజయం సాధించారో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ అవుతుందని ఇప్పటికే వారికి అర్థమయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే విపక్షాలన్నీ ఏకమై అధికారపక్షంపై బురద జల్లే పనికి పూనుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అక్రమాలకు పాల్పడుతోందంటూ కొత్త ప్రచారానికి తెర లేపాయి. విపక్షాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఎన్నికల కమిషన్‌కు తప్పుడు లేఖలు రాస్తున్నాయి. కలెక్టర్‌కు వినతిపత్రాలు అందిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో ఫ్యాన్ హవా ఎన్నికలంటేనే విపక్షాల్లో అంతలా భయం కలగడానికి కారణమేంటి? ఎందుకు వైఎస్ఆర్సిపి అభ్యర్థులను చూసి ప్రతిపక్షాలు అంతలా వణికిపోతున్నాయి.? ఏడాది క్రితం జరిగిన మున్సిపల్, స్థానిక ఎన్నికలన్నిటా వైఎస్ఆర్సిపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన విపక్షాలు అప్పట్లో కూడా ప్రభుత్వంపై ఇటువంటి తప్పుడు ప్రచారానికి పూనుకున్నాయి. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డం పెట్టుకొని కొంతకాలం పాటు ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నాయి. తర్వాత ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయి. ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి ఎల్లో పార్టీ, చంద్రబాబు దత్తపుత్రుడు..వారి అనుబంధ మీడియా ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం వారికి చెంప చెళ్ళుమనిపించేలా తీర్పునిచ్చారు. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో సైతం టిడిపి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. రాష్ట్రంలో టిడిపి కంచుకోటలన్నీ బద్దలయ్యాయి. టిడిపి ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఓటమిని ఆ పార్టీ ఎన్నడూ చూడలేదు. జనసేన, బిజెపి, వామపక్షాలైతే కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయాయి. ఏడాది క్రితం ఓటమి ఇప్పటికీ ప్రతిపక్షాలను వెంటాడుతూనే ఉంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలంటే భయపడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతానుభవాలే పునరావృతం అవుతాయని ఊహిస్తున్నాయి.. కళ్లకు పచ్చ గంతలెందుకు? ఓటమి ఖాయమని గ్రహించిన విపక్షాలు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి. ఓటర్ల నమోదులో అవకతవకలు జరిగాయని..దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారని ప్రజలను మరోసారి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం కాదు...ఓటరుగా నమోదు చేయించుకోవడానికి టీడీపీ నేతలు ఓటరుకు వంద రూపాయాలు ఇస్తున్నారు. ప్రజలకు దూరమై తెలుగుదేశం పార్టీ ఇంత పతనావస్థకు చేరడమే గాక...ఎదురు అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రజలకు దగ్గరవ్వడం సాధ్యం కాదని తేలిపోవడంతో...ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైయస్సార్సీపి బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో పాటు.. ఐటితో పాటు ఎన్నో పరిశ్రమలు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుండటంతో పట్టభద్రులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు.. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
వాణిజ్య పోరు భారత్‌కు మేలే!
న్యూఢిల్లీ: అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని భారత్ తనకు అనుకూలంగా మల్చుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో రెండు దేశాలకు దుస్తులు, వ్యవసాయోత్పత్తులు, వాహనాలు, యంత్రాలు మొదలైన వాటిని ఎగుమతి చేసే అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుత వాణిజ్య యుద్ధంలో చైనా నుంచి దిగుమతయ్యే యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులను అమెరికా టార్గెట్ చేసింది. అలాగే అమెరికా నుంచి దిగుమతయ్యే సోయాబీన్ తదితర వ్యవసాయోత్పత్తులు, ఆటోమోటివ్ ఉత్పత్తులను చైనా లక్ష్యంగా చేసుకుని సుంకాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, చైనాలకు ఆయా ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకునే అవకాశాలు భారత్ పరిశీలించాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ప్రొఫెసర్ రాకేష్ మోహన్ జోషి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల డిమాండ్‌కు తగ్గ స్థాయిలో సరఫరా చేయగలిగే సత్తా చైనా తర్వాత భారత్‌కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 2018లో 11.2 శాతం, చైనాకు 31.4 శాతం పెరిగాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. వాణిజ్య యుద్ధాల వల్ల తమపై ప్రతికూల ప్రభావమేదీ లేదని ప్రజలకు చూపించుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నందున.. భారత సంస్థలకు మరిన్ని అవకాశాలు ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక, రెండు దేశాలకు వ్యవసాయోత్పత్తుల ఎగుమతి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు భారత్ ప్రయత్నించాలని అగ్రి ఎకనామిక్స్ నిపుణుడు చీరాల శంకరరావు చెప్పారు. 2017–18 గణాంకాల ప్రకారం చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 89.71 బిలియన్ డాలర్లుగా ఉండగా, అమెరికాతో 74.5 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ.. జీఎస్పీ ప్రయోజనాలు రద్దు చేస్తే చైనాకే లాభం చైనాతో అమెరికా కొనసాగిస్తున్న సుదీర్ఘ వాణిజ్య యుద్ధం వల్ల అమెరికన్ కంపెనీలు దిగుమతుల కోసం జీఎస్పీ హోదా ఉన్న దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది!!. ఒకవేళ భారత్‌కు గనక జీఎస్పీ హోదా రద్దు చేస్తే... అది అంతిమంగా చైనాకే లబ్ధి చేకూరుస్తుంది. జీఎస్పీ కూటమిలోని అమెరికన్ కంపెనీలు, వాణిజ్య సంఘాలు ఒక నివేదికలో ఈ హెచ్చరిక చేశాయి. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్‌కు (సాధారణ ప్రాధాన్య వ్యవస్థ) సంక్షిప్త రూపం జీఎస్పీ. ఈ హోదా ఉన్న దేశాల్లో భారత్, థాయిలాండ్, కంబోడియా, టర్కీ, ఇండోనేషియా వంటివి ఉన్నాయి. ‘‘జీఎస్పీ దేశాల నుంచి దిగుమతులు చేసుకోవటం వల్ల అమెరికన్ కంపెనీలు 2019 మార్చిలో 105 మిలియన్ డాలర్లు ఆదా చేయగలిగాయి. 2018 మార్చి నెలలో చూస్తే ఇది 77 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇక 2019 తొలి త్రైమాసికంలో అమెరికన్‌కంపెనీలు ఏకంగా 285 మిలియన్ డాలర్లు ఆదా చెయ్యగలిగాయి. ఇది 2018 తొలి త్రైమాసికంతో పోలిస్తే 63 మిలియన్ డాలర్లు అధికం’’ అని ఆ నివేదిక వెల్లడించింది. వేల రకాల వస్తువుల్ని సుంకాలు లేకుండా అమెరికాకు దిగుమతి చేసుకోవటానికి, తద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి అమెరికా ప్రభు త్వం ఈ జీఎస్పీని ప్రవేశపెట్టింది. అయితే, భారత జీఎస్పీ గుర్తింపును తొలగించాలని అనుకుంటున్న ట్టు ఈ ఏడాది మార్చి 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, అలా చేస్తే అది చైనాకే లాభమంటూ జీఎస్పీ కూటమి ఇచ్చిన నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
సొంత జిల్లాలో మాజీ సిఎం కిరణ్‌కు షాక్
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డికి సొంత జిల్లాలో షాక్ తగిలింది. జేఎస్పీ తరపున గుర్రంకొండ ఎంపీపీగా ఇటీవల ఎన్నికైన నట్టా చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల సమక్షంలో చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ దారుణంగా చతికిలపడిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. గెలిచిన ఒకరిద్దరూ కూడా పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో జేఎస్పీ సంకట స్థితిలో పడింది. -
మాజీ సీఎం కిరణ్ దుకాణం మూసేశాడు!
హైదరాబాద్ లో జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) దుకాణం మూసేసింది. ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత మాజీ సీఎం, ఆపార్టీ అధినేత ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితోపాటు ఇతర నాయకులు జేఎస్పీ కార్యాలయం రావడమే మానేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జైసమైక్యాంధ్ర ఉద్యమానికి, పార్టీకి కాలం చెల్లిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో దుకాణాన్ని మూసేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కూడా పార్టీ సమావేశాలు, భవిష్యత్ కార్యాచరణ కూడా ఏమి లేకపోవడంతో కిరణ్ కుమార్ కూడా జై సమైక్యాంధ్రపై ఎక్కడా మాట్లాడకపోవడం, జన జీవన స్రవంతిలో కనిపించడం మానేసిన సంగతి తెలిసిందే. జై సమైక్యాంద్ర పార్టీని స్థాపించిన మూడు నెలల తర్వాత మాదాపూర్ లో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేయడం గమనార్హం. మాదాపూర్ లోని కృతికా లేఅవుట్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న ఐదు అంతస్తుల భవనానికి ఉన్న పార్టీ పోస్టర్లు, బ్యానర్లను, జెండాలను రెండు రోజుల క్రితం తొలగించారు. దాంతో అద్దెకు తీసుకునేందుకు ఆ భవనానికి ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల తాకిడి ఎక్కవైనట్టు సమాచారం. జేఎస్పీ కార్యాలయాన్ని గుట్టు చప్పుడుకాకుండా మూసేసినట్టు ఆపార్టీకి చెందిన సీనియర్ నేతలకే తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు రోజుల క్రితమే కార్యాలయం నుంచి ఫర్నిచర్, స్టేషనరీని తరలించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్డడించింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ మీడియాలో వార్తలు రావడం, బీజేపీ నేత కిషన్ రెడ్డితో భేటి కావడం కూడా పార్టీకి మంగళం పెడుతున్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. జై సమైక్యాంధ్ర అంటూ ప్రజల్లోకి వెళ్లిన కిరణ్ .. రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీలోనే చేరడానికి ప్రయత్నించడం కొసమెరుపు. Follow @sakshinews -
మాజీ సీఎం కిరణ్ తో కిషన్ రెడ్డి భేటి!
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజకీయాలు మాట్లాడలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాకు వెళ్లడించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కిషన్ రెడ్డి సమావేశమవ్వడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్దిరోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర నామినేటెడ్ పోస్టుల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని త్వరలో పార్టీ నాయకత్వాన్ని కలుస్తామని ఓ ప్రశ్నకు జవాబిచ్చింది. మెదక్ ఎంపీ అభ్యర్థి విషయంలో రాష్ట్ర పార్టీ ఇంకా చర్చించలేదని కిషన్ రెడ్డి మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
'సబ్బం హరి రాజకీయంగా చచ్చినట్టే'
-
'సబ్బం హరి పిల్లి మొగ్గలు!'
విశాఖ : జై సమైక్యాంధ్ర పార్టీ కీలక నేత, విశాఖ ఎంపీ అభ్యర్థి సబ్బం హరి పిల్లి మొగ్గలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు లీకులు ఇస్తున్నారు. డిపాజిట్ కూడా రాదనే భయంతోనే సబ్బం హరి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా మాచర్ల, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాలకు బరిలోకి జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థులు పచ్చ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు సోమవారం టీడీపీలో చేరారు. అక్కడితో ఆగకుండా తమ పార్టీ ఓట్లు టీడీపీకి వేయిస్తామంటూ జేఎస్పీ అభ్యర్థులు ప్రకటించడం గమనార్హం. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సబ్బం హరి, జై సమైక్యాంధ్ర, విశాఖ ఎంపీ, జేఎస్పీ, కిరణ్ కుమార్ రెడ్డి, sabbam Hari, jai samaikyandhra, visakha mp condidate, JSP, kiran kumar reddy