పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? విపక్షాలన్నీ అధికారపక్షంపై ఎందుకు బురద జల్లుతున్నాయి? ప్రతిపక్షాలన్నీ ఏకమై ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వంపై తప్పుడు లేఖలు ఎందుకు రాస్తున్నాయి? స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవుతాయని ముందుగానే ప్రతిపక్షాలు ఊహిస్తున్నాయా?
అమ్మో ఎన్నికలా?
ఏపీలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పేరు వింటేనే ప్రతిపక్షాలు హడలిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏ విధంగా అయితే ఏకపక్షంగా విజయం సాధించారో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ అవుతుందని ఇప్పటికే వారికి అర్థమయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే విపక్షాలన్నీ ఏకమై అధికారపక్షంపై బురద జల్లే పనికి పూనుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అక్రమాలకు పాల్పడుతోందంటూ కొత్త ప్రచారానికి తెర లేపాయి. విపక్షాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఎన్నికల కమిషన్కు తప్పుడు లేఖలు రాస్తున్నాయి. కలెక్టర్కు వినతిపత్రాలు అందిస్తున్నాయి.
స్థానిక సంస్థల్లో ఫ్యాన్ హవా
ఎన్నికలంటేనే విపక్షాల్లో అంతలా భయం కలగడానికి కారణమేంటి? ఎందుకు వైఎస్ఆర్సిపి అభ్యర్థులను చూసి ప్రతిపక్షాలు అంతలా వణికిపోతున్నాయి.? ఏడాది క్రితం జరిగిన మున్సిపల్, స్థానిక ఎన్నికలన్నిటా వైఎస్ఆర్సిపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన విపక్షాలు అప్పట్లో కూడా ప్రభుత్వంపై ఇటువంటి తప్పుడు ప్రచారానికి పూనుకున్నాయి. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను అడ్డం పెట్టుకొని కొంతకాలం పాటు ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నాయి. తర్వాత ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయి.
ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి
ఎల్లో పార్టీ, చంద్రబాబు దత్తపుత్రుడు..వారి అనుబంధ మీడియా ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం వారికి చెంప చెళ్ళుమనిపించేలా తీర్పునిచ్చారు. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో సైతం టిడిపి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. రాష్ట్రంలో టిడిపి కంచుకోటలన్నీ బద్దలయ్యాయి. టిడిపి ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఓటమిని ఆ పార్టీ ఎన్నడూ చూడలేదు. జనసేన, బిజెపి, వామపక్షాలైతే కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయాయి. ఏడాది క్రితం ఓటమి ఇప్పటికీ ప్రతిపక్షాలను వెంటాడుతూనే ఉంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలంటే భయపడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతానుభవాలే పునరావృతం అవుతాయని ఊహిస్తున్నాయి..
కళ్లకు పచ్చ గంతలెందుకు?
ఓటమి ఖాయమని గ్రహించిన విపక్షాలు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి. ఓటర్ల నమోదులో అవకతవకలు జరిగాయని..దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారని ప్రజలను మరోసారి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం కాదు...ఓటరుగా నమోదు చేయించుకోవడానికి టీడీపీ నేతలు ఓటరుకు వంద రూపాయాలు ఇస్తున్నారు. ప్రజలకు దూరమై తెలుగుదేశం పార్టీ ఇంత పతనావస్థకు చేరడమే గాక...ఎదురు అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రజలకు దగ్గరవ్వడం సాధ్యం కాదని తేలిపోవడంతో...ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైయస్సార్సీపి బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో పాటు.. ఐటితో పాటు ఎన్నో పరిశ్రమలు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుండటంతో పట్టభద్రులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు..
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment