jai samaikyandhra
-
ఈ నాయకులంతా ఏమయ్యారు
హైదరాబాద్: రెండేళ్ల కిందట ఈ నాయకులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. విభజనకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో నానా హడావిడి చేసిన కొందరు నాయకులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల నుంచి దాదాపుగా కనుమరుగయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ అప్పట్లో హడావిడి చేసిన నేతలెవరూ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఒకవైపు విభజన ఉద్యమం మరోవైపు సమైక్య ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ తెగ హడావిడి చేసిన నేతలు చేసేదేమీ లేక గడిచిన రెండేళ్లుగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా ఎంతో మంది నేతలు రాష్ట్ర విభజనకు ముందు ఎంతో హడావిడి చేశారు. విభజన జరగదని ఆనాడు గంటాపథంగా చెప్పారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన చట్టం చేయడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు కావడం జరిగిపోయాయి. ఈ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎన్నికల రంగంలో నిలిపారు. జర్మనీ నుంచి ఆయన మిత్రుడొకరు తెచ్చిన రాయిని చూపించి విడిపోయినా మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత అంతే... ఆయనెక్కడా కనిపించలేదు. తన సన్నిహితులకు చెందిన ఒకరిద్దరు నిర్వహించిన శుభకార్యాలకు హాజరు కావడం మినహాయిస్తే రాజకీయంగా ఆయన పూర్తిగా తెరమరుగైపోయారు. ఆయన బీజేపీలో చేరనున్నారని ఆ మధ్యన వార్తలొచ్చాయి. కానీ అదీ జరగలేదు. ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. తానూ హైదరబాదీనే అని చెప్పుకున్న కిరణ్ ఈ రెండేళ్లు దాదాపుగా హైదరబాద్ ఇంటికే పరిమితమయ్యారు. పాత మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడు రాజకీయాలపై ఆయన మక్కువ చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే, లగడపాటి రాజగోపాల్... సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నాటకీయ ఫక్కీలో నిమ్స్ ఆస్పత్రిలో చేరి హడావుడి చేసిన ఆయన రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు. అన్నట్టుగానే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయకపోగా, గడిచిన రెండేళ్లుగా ఏ వేదికపైనా కూడా ఆయన కనిపించలేదు. ఆయనతో పాటు విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి, మరో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులు కూడా ఏ వేదికలపైనా కనిపించడం లేదు. విభజన జరిగితే తమకు రాయల తెలంగాణ కావాలని నినదించిన మాజీ మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరుల హడావిడి కూడా లేదు. పేరుకు టీడీపీలో చేరినప్పటికీ ఆ పార్టీలో వారికి పెద్దగా పనిలేకుండా పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన శైలజానాథ్ ఆ తర్వాత కిరణ్ ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మధ్యలో టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు కూడా సాగినప్పటికీ ఫలించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన అప్పడుప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ ఆ తర్వాత తెరపైన పెద్దగా కనిపించడం లేదు. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే, సమైక్య ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీవో నేత అశోక్ బాబు రాష్ట్ర విభజన తర్వాత కాలంలో క్రియాశీలంగా లేకపోవడం గమనార్హం. -
ఆరడుగుల బుల్లెట్ మిస్ అయ్యిందా?
అశోక్ బాబు ఈ పేరు సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా తెగ వెలిగిపోయింది. ఇది ఆరడుగుల బుల్లెట్....ధైర్యం విసిరిన రాకెట్ అంటూ రాష్ట్ర విభజన సమయంలో తెగ హడావుడి చేసిన ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుకు పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది. ఆయనకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఓవైపు ఏపీ ఎన్జీవో గృహ నిర్మాణ సంఘానికి భూకేటాయింపులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తే, మరోవైపు ఏపీ ఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, డెరైక్టర్‌గా అశోక్‌బాబు నియామకం చెల్లదంటూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఒకప్పుడు తానే మోనార్క్ అంటూ, తెగ నోరు పారేసుకున్న అశోక్ బాబు ... రాజకీయాలు అంటేనే అసహ్యమేస్తుందన్న నోటితోనే... అవసరం అయితే రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సీల్డ్ కవర్ సీఎంతో సన్నిహితంగా మెలిగి ఉద్యమ బాటను అర్థాంతరంగా ముగించేసి, ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత అశోక్ బాబు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపినా అందుకు అవకాశం కలిసి రాలేదు. ఓ దశలో కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైన ఆయన ఆ తర్వాత వెనక్కి తగ్గారు. తీరా తాను నమ్ముకున్న నేత ఏకంగా పార్టీనే ముసేసుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా...'బాబు' మంత్రం ఫలించలేదు. అంతన్నాడు ఇంతన్నాడు.. అన్న చందంగా అశోక్ బాబు.... వేసిన బుల్లెట్ మిస్ అయ్యిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
‘చెప్పు’ తెగింది
* జై సమైక్యాంధ్ర అన్నా పడని ఓట్లు * సార్వత్రిక ఎన్నికల్లో పరువు దక్కని వైనం * అత్తెసరు ఓట్లకే జేఎస్పీ అభ్యర్థులు పరిమితం * సీపీఎం మిత్రపక్షంగా పోటీచేసినా ఫలితంలేదు మచిలీపట్నం : జై సమైక్యాంధ్ర అని నినదించిన ఆ పార్టీకి పరువు దక్కలేదు. అత్తెసరు ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ గుర్తుగా పెట్టుకున్న చెప్పులపై ఓట్లు పడక జేఎస్పీ అభ్యర్థులు అసెంబ్లీ దారిలో నడవలేకపోయారు. సమైక్యవాదినంటూ చివరి నిముషం వరకు సీఎం పదవిని ఎంజాయ్ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జనం నమ్మలేదనే విషయం రుజువయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ అభ్యర్థులకు పడిన ఓట్లు వారి పరువు తీసేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో 33 లక్షలకు పైగా ఓట్లు ఉన్నప్పటికీ విజయవాడ, మచిలీపట్నం ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు కనీసం 13 వేల ఓట్లు దాటలేదు. సీపీఎం అభ్యర్థులు పోటీ చేసిన చోట మినహా జిల్లాలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేఎస్సీ అభ్యర్థులు మొత్తానికి కేవలం పదివేల ఓట్లు లోపు మాత్రమే రావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు నామమాత్రపు ఓట్లుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో వారికంటే స్వతంత్ర అభ్యర్థులకే మెరుగైన ఓట్లు వచ్చాయి. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి చిన్నం ఐశ్యర్యకు 5,292 ఓట్లు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కమ్మిల శ్రీనివాస్‌కు 7,680 ఓట్లు వచ్చాయి. కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన జై సమైక్యాంధ్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు బొర్రా చలమయ్య 1,151 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన బి.సౌజన్య (గన్నవరం)కు 813, కోయిలపు రాము (గుడివాడ) 624, వాకా వాసుదేవరావు (పెడన)1,401, లంక కరుణాకర్దాసు (మైలవరం) 662, తంగిరాల మణిభూషణ్ (నందిగామ) 268, తాటిబందెల వెంకట్రావు (జగ్గయ్యపేట) 1,175, పాలడుగు డేవిడ్‌రాజు (పామర్రు) 886, గనిపిశెట్టి గోపాల్ (మచిలీపట్నం) 1,140 చొప్పున ఓట్లు సాధించారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ చెప్పు తెగిపోయిందని ఓటర్లు చాటి చెప్పారు. -
'సబ్బం హరి పిల్లి మొగ్గలు!'
విశాఖ : జై సమైక్యాంధ్ర పార్టీ కీలక నేత, విశాఖ ఎంపీ అభ్యర్థి సబ్బం హరి పిల్లి మొగ్గలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు లీకులు ఇస్తున్నారు. డిపాజిట్ కూడా రాదనే భయంతోనే సబ్బం హరి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా మాచర్ల, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాలకు బరిలోకి జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థులు పచ్చ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు సోమవారం టీడీపీలో చేరారు. అక్కడితో ఆగకుండా తమ పార్టీ ఓట్లు టీడీపీకి వేయిస్తామంటూ జేఎస్పీ అభ్యర్థులు ప్రకటించడం గమనార్హం. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సబ్బం హరి, జై సమైక్యాంధ్ర, విశాఖ ఎంపీ, జేఎస్పీ, కిరణ్ కుమార్ రెడ్డి, sabbam Hari, jai samaikyandhra, visakha mp condidate, JSP, kiran kumar reddy -
'చెప్పు'గుర్తు అభ్యర్థిపై టీఆర్ఎస్ రాళ్ల దాడి
ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్-జై సమైక్యాంధ్ర కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ బుధవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. జై సమైక్యాంధ్ర అంటూ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న ఎంపీ అభ్యర్థి చెరుకూరి నాగార్జునపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చెరుకూరి నాగార్జున సహా కార్యకర్తలు గాయపడ్డారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాగార్జునకు గాయాలు...కారు ధ్వంసం
-
చంద్రబాబువి మాయమాటలు
గుంటూరు: జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతోందని ఆ ప్రాంత ప్రజలకు, సీమాంధ్రను మరో సింగపూర్ చేస్తానంటూ సీమాంధ్ర ప్రజలను మాయ మాటలతో చంద్రబాబు మభ్యబెడుతున్నారని కిరణ్ మండిపడ్డారు. తెనాలిలో శుక్రవారం జరిగిన రోడ్డు షోలో కిరణ్ పాల్గొన్నారు. మాయమాటలు చెప్పే చంద్రబాబుకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని కిరణ్ ప్రశ్నించారు. -
రాష్ట్రమంతా జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ: ఉండవల్లి
సాక్షి, విజయవాడ: మూడు, నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రమంతా జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ ముఖ్యనేత ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనపై తాము న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన ఇంకా పూర్తి కాలేదని, తాము సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అడ్మిట్ చేసుకుని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందన్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం పార్లమెంట్ తొలి సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని, దాన్ని సీమాంధ్ర ప్రాంత ఎంపీలంతా అడ్డుకోవాలన్నారు. -
అలా రాసేవారికి సిగ్గుండాలి: కిరణ్
హైదరాబాద్: పార్టీ మారుతారని వచ్చిన వార్తలపై జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను పార్టీలు మారుతానని రాసేవారికి సిగ్గుండాలని అన్నారు. బీజేపీలోకి కిరణ్ చేరుతారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. జై సమైక్యాంధ్ర పార్టీ వెబ్‌సైట్‌ను శనివారం కిరణ్ ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు. తాను బీజేపీలో చేరుతాననడం హాస్యాస్పదమని, అలా అనుకుంటే కాంగ్రెస్‌ను వీడేవాడిని కాదుకదా అని కిరణ్ చెప్పారు. కిరణ్ పార్టీలో చేరుతారని భావించిన కొందరు సీనియర్లు చేయివ్వగా, సమైక్యాంధ్ర పార్టీ నాయకులు కొందరు పార్టీ మారుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్ స్పందించారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కిరణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. -
'నేను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలియదు'
-
నేను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలియదు
విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ....కేంద్రమంత్రి చిరంజీవిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిరంజీవి కమెడియన్లా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను సీఎం ఎప్పుడు అయ్యానో కూడా చిరంజీవికి తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. విభజనకు తానే కారణం అంటుంటే చిరంజీవి రాజకీయ పరిజ్ఞానంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. రాజకీయాలు తెలిసిన వారికైతే సమాధానాలు చెప్పవచ్చని కిరణ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు తానే కారణమని చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు. తెలుగు జాతి భవిష్యత్ కోసమే తాను పార్టీ పెట్టానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. విభజనపై అవలంభించిన తీరు అవమానకరంగా ఉందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని కిరణ్ పేర్కొన్నారు. విభజనను ఒప్పుకోనని కేంద్రానికి తాను ముందే చెప్పానని, ఎందుకు రాష్ట్రాన్ని విభజించకూడదో వివరణతో కూడిన పత్రాలను కేంద్రానికి పంపినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ఎలా ప్రవేశపెడతారని కిరణ్ ప్రశ్నించారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు అనుకూలమో, వ్యతిరేకమో ఇప్పటికీ అర్థం కావటం లేదని కిరణ్ వ్యాఖ్యలు చేశారు. -
వాహనాలెక్కని జనం!
పలాస,న్యూస్‌లైన్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్ షో కార్యక్రమానికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు జనం ఎక్కలేదు. రోడ్ షో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పలాస లక్ష్మీపురం టోల్‌గేటుకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుకోవాల్సి ఉంది. ఆ సందర్భంగా వాహనాలతో పెద్ద ర్యాలీతో స్వాగతం పలకాలని మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం ఇంట్లో కార్యకర్తల సమావేశమై నిర్ణయించారు. జన సమీకరణకు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలను రోడ్‌షో కార్యక్రమానికి తీసుకురావడం కోసం 50 టాటా మ్యాజిక్ వాహనాలను అద్దెకు తీసుకున్నారు. వీటిని ఉదయమే పలాస రైల్వే గ్రౌండ్లో సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత గ్రామాలకు పంపించారు. అయితే వెళ్లిన వాహనాలు ఖాళీగా తిరిగిరావడంతో వీటిలో 30 వాహనాలను రద్దు చేశారు. వీటిని రద్దు చేయడంతో వాహన డ్రైవర్లు తమకు అద్దెలు చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేశారు. మిగతా 20 వాహనాలు పలాస, నందిగాం, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లినప్పటికీ వాహనాల్లో ఇద్దరు, ముగ్గురు తప్పా ఎక్కువ రాలేదు. మందస మండలం వీరగున్నమ్మపురం, కుంటికోట గ్రామాలకు వెళ్లిన వాహనాలను అక్కడివారు ఖాళీగా పంపించేశారు. -
'ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో కలవం'
విశాఖ : ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో కలవమని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం విశాఖలో సమైక్యాంధ్ర జేఏసీ సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను పదవి కోసం పార్టీ పెట్టలేదని ... తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే పార్టీ పెట్టామన్నారు. రాష్ట్ర విభజన బిల్లు అక్రమమని పార్లమెంట్లో పలు పార్టీలు ఆందోళన చేశాయని కిరణ్ అన్నారు. బిల్లు అక్రమమని రాజ్యసభలో బీజేపీ చెప్పిందని ఈ సందర్బంగా కిరణ్ గుర్తు చేశారు. 371 డి వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురు అవుతాయని కిరణ్ పేర్కొన్నారు. -
నేడు పలాసలో కిరణ్ రోడ్డు షో
పలాస,న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం పలాసలో రోడ్డు షో నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ పర్యటన షెడ్యూల్ వి వరించారు. మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాకుళం జిల్లా సరిహద్దు గ్రామమైన పైడి భీమవరం వద్దకు కిరణ్ చేరుకుంటారు. అక్కడ నుంచి శ్రీకాకుళం, నరసన్నపేటలో కొద్ది నిమిషాలు ఉండి నేరుగా పలాస మండలం లక్ష్మీపు రం టోల్‌గేటు వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి మోటారు వాహనాల ర్యాలీతో పలాస కోసంగిపురం కూడలి వద్దకు 4.30 గంటలకు కాశీబుగ్గ బస్టాండు వద్ద గల మహాత్మగాంధీ విగ్రహం వద్దకు చేరుకొని ప్రచార రథంపై నుంచి ప్రసంగిస్తారు. అనంతరం శ్రీకాకుళం వైఎస్ఆర్ రోడ్ల కూడలి వద్దకు రాత్రి 7.30 గంట లకు చేరుకొని అక్కడ రోడ్డు షోలో పాల్గొని ప్రజలనుద్దేశించి కిరణ్ ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం పది గంటలకు ఆమదాలవలస రోడ్డు షోలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ మంత్రి సిగిలిపల్లి శ్యామలరావు కుటుం బాన్ని పరామర్శిస్తారన్నారు. సమావేశంలో సీనియర్ న్యాయవాది పైల రాజరత్నంనాయుడు, డాక్టరు దువ్వాడ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావ పాల్గొన్నారు. -
జై సమైక్యాంద్ర పార్టీ ఆవిర్బావ సభ తుస్.....
-
కాంతులీనని కిరణం
సాక్షి, రాజమండ్రి: ‘సమైక్య గర్జన’ వినిపిస్తుందనుకుంటే.. ‘పిల్లి కూత’ మాదిరి స్వరమే వినిపించింది. ‘కొత్త కాంతులు’ ప్రసరిస్తాయనుకుంటే.. కనీస భ్రాంతికి కూడా ఆస్కారం లేకపోయింది. ఆకట్టుకోని చొప్పదంటు ప్రసంగం, రక్తి కట్టని కృతకావేశ ప్రదర్శన.. జనం సభ ముగించేయాలని కేకలు పెట్టారు. రాజమండ్రిలోని జెమినీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం ఐదున్నరకు ప్రారంభమైన ‘జై సమైక్యాంధ్ర’ సభ 1.55 గంటల్లో ముగిసిపోయింది. పార్టీ అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం 35 నిముషాలకే ప్రసంగానికి స్వస్తి చెప్పారు. ‘తెలుగు ప్రజల ఆత్మగౌరవం’ పేరుతో ఆయన స్థాపించిన పార్టీ ఆవిర్భావ సభలో రాష్ట్ర విభజనను అడ్డుకునే కీలకమైన కార్యాచరణను ప్రకటిస్తారని కొసరు ఆశలు పెట్టుకున్న సమైక్యవాదులకు తీవ్ర ఆశాభంగం తప్పలేదు. సభలో సమైక్య నినాదం కన్నా కిరణ్ నామ జపమే మారుమోగింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా ప్రతినిధులు, నేతలు తరలి వస్తారని భావించిన నిర్వాహకులు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. అధికారంలో ఉండి ఊడపొడిచారా..? అధికారం ఇస్తే రాష్ట్రం ముక్కలు కానివ్వకుండా చేస్తామని కిరణ్ తన ప్రసంగంలో ఆవేశపడ్డారు. మూడున్నరేళ్లుగా అధికారంలో ఉండీ విభజనను అడ్డుకోలేని కిరణ్, రాష్ట్రపతి అపాయింటెడ్ డే కూడా ప్రకటించాక ఇంకెలా విభజనను అడ్డుకుంటారో తెలీక జనం విస్తుపోయారు. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆశలు పెట్టుకున్నామని చెబుతూనే 25 ఎంపీ సీట్లు గెలిపించినంత మాత్రాన విభజన ఎలా ఆపుతారని అయోమయానికి గురయ్యారు. ఇక.. తాను రాజకీయాల్లో ఉండనని వైరాగ్యం పలికిన ఉండవల్లి అరుణ్‌కుమార్ తన అధ్యక్షోపన్యాసంలో సింహభాగం కిరణ్‌ను కీర్తించడానికే కేటాయించారు. ఎంపీ హర్షకుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు కూడా ఆ తానులో ముక్కలమేననిపించారు. వారి భజన వినలేని జనం వెంటనే కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడాలంటూ గోల చేశారు. చేసేది లేక చాలా మంది ప్రసంగాలను రద్దుచేసి కిరణ్‌కు మైకు అందచేశారు. కాగా ఆయన మాట్లాడిన 35 నిముషాలు పాతపాటనే ఆలపించారు. కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర రాజకీయ పక్షాలపై దుమ్మెత్తి పోశారు. తానొక్కడినే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొనేందుకు తాపత్రయపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణా ప్రాంతం 11 లక్షల ఎకరాలకు సాగునీరు కోల్పోతుందని, 50 శాతం విద్యుత్తు నష్టపోతుందని పేర్కొన్నారు. సభలో ముందుగా మట్టిరంగులో నిలువు పట్టీ, పైన లేత ఆకు పచ్చ, కింద ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పార్టీ పతాకాన్ని కిరణ్ ఆవిష్కరించారు. వెనువెంటనే వేదిక వెనుక ఉన్న భారీ బ్యానర్‌ను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం గాలిలోకి బెలూన్లను వదిలారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళా బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. టంగుటూరి ప్రకాశం పంతులు మనుమడు హనుమంతరావు సభకు వచ్చి కిరణ్‌ను కలిశారు. నెపాలు వెతికిన నేతలు సభకు జనం పల్చగా రావడం.. నిర్వాహక నేతలు, కాంగ్రెస్ బహిషృ్కత ఎంపీలు ఉండవల్లి, హర్షకుమార్‌ను కలవర పరిచింది. ‘రోడ్డుపై జనం ఉండి పోయారు. లోపలికి రావా’లంటూ కొంతసేపు, ‘సభలోని జనం వారిని లోపలికి రానివ్వా’లంటూ కాసేపు, ‘జనం వచ్చే బస్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయని, వాటిని ఆపేశా’ రని కాసేపు మైకుల్లో బిగ్గరగా చెపుతూ.. సభ పేలవంగా ఉందన్న వాస్తవాన్ని కప్పి పుచ్చబోయారు. జనం అంతంతమాత్రంగానే వచ్చారన్న విషయం నుంచి కిరణ్‌కుమార్ దృష్టిని మరల్చేందుకు విఫల యత్నం చేశారు. సభాస్థలికి చేరువలోనే జరుగుతున్న బైబిలు మిషను మహాసభలకు తరలి వచ్చే జనాన్ని తమ సభకు వచ్చిన జనంగా చిత్రించడానికి చూశారు. సభలో ఎంపీలు సబ్బం హరి, లగడపాటి రాజ గోపాల్, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరి, పార్టీ అధికారప్రతినిధి తులసిరెడ్డి, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, ఎమ్మెల్సీలు బలశాలిఇందిర, రెడ్డప్పరెడ్డి, ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, కొర్లభారతి, రాష్ట్ర మాలమహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, సినీనటుడు నరసింహరాజు, మాజీఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, విద్యార్థి నాయకుడు కృష్ణాయాదవ్, పార్టీ నాయకులు ఆనం జయకుమార్‌రెడ్డి, వాసంశెట్టిసత్య, చిక్కాల ఉమామహేశ్వరరావు, డీసీఎంస్ చైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ మట్టా జయకర్, వరద రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లుబాబి, మందపాటిక ిరణ్, జి.వి.శ్రీరాజ్, రాజమండ్రి చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్, కొర్లశిరీష తదితరులు పాల్గొన్నారు. -
'ప్రజలను మోసం చేయడానికే కిరణ్ 'జై సమైక్యాంధ్ర''
విశాఖపట్నం : 'జై సమైక్యాంధ్ర' పేరుతో రాజకీయ పార్టీ ఆరంభించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు నిప్పులు చెరిగారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాడి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి కారణం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలను పాటించి.. రాష్ట్రాన్ని విడగొట్టడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని దాడి విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణమైన కిరణ్ మరోసారి ప్రజలను మోసం చేయడానికి జై సమైక్యాంధ్ర అంటూ సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కిరణ్ కు ప్రజలు బుద్ది చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దాడి వీరభద్రరావు సమక్షంలో 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘జై సమైక్యాంధ్ర..’ అనడమే నేరమా!
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం.. విద్యార్థు ల పాలిట శాపంగా మారనుందా..? జై సమైక్యాంధ్ర అని అనడమే వారు చేసిన నేరమా..? సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసులు ఉన్న విద్యార్థులకు.. ఆ సాకు చూపి ప్రభుత్వ ఉద్యోగాలను దూరం చేయనున్నారా..? అనే ప్రశ్నలకు అవున నే సమాధానం వస్తోంది. ఇటీవల కాలం లో పలువురు నిరుద్యోగ యువకులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే, వారు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేదని పోలీసుల నుంచి కాండక్ట్ సర్టిఫికెట్ తెస్తేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన యువకుడు ఆర్మీలో ఉద్యోగం పొందాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేనట్లుగా ఆ పరిధిలో ఉన్న పోలీసుస్టేషన్ నుంచి కండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఆర్మీ అధికారులు ఆ యువకుడికి సూచించారు. దీంతో ఆ విద్యార్థి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని.. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటాయని వేలాది మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టారు. విజయనగరం పట్టణంలో ఉద్యమం కాస్త తీవ్ర స్థాయికి చేరి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పీసీసీ చీఫ్ బొత్స ఇంటి, ఆస్తులు, అనుచరుల ఇళ్లపై సమైక్యాంధ్ర ఉద్యమకారు లు దాడులు చేశారు. దీంతో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైనా పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులు పీసీసీ చీఫ్ బొత్స ఆదేశాలకు అనుగుణంగానే జరిగాయన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. మంత్రి మెప్పుకోసం కేసులు పెట్టి... మంత్రి మెప్పుకోసం విద్యార్థులపైన, సమైక్యాంధ్ర ఉద్యమకారులపైన పోలీసులు కేసులు పెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగానే స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ప్రతిపక్ష పార్టీలకు చెంది న వారిపై ముఖ్యంగా కొరడా ఝులి పించారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను వెంటాడి.. వెంటాడి మరీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలో సుమారు 800 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు ఎత్తివేసినట్లు ప్రకటించలేదేం..? తెలంగాణ ఉద్యమంలో విధ్వంసాలకు పాల్పడిన విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పార్టీల కు అతీతంగా ఆ ప్రాంత ప్రజాప్రతి నిధులు, ఉద్యోగ సంఘాల నేతలు పోరాటాలు చేశారు. వారందరూ ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విన్నవించారు. దీంతో అక్కడి ఉద్యమకారులపై కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. సీమాంధ్రకు వచ్చేసరికి సమైక్యాంధ్రలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం శోచనీయం. మన ప్రజాప్రతినిధుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
లక్ష మందితో సమైక్య పరుగు
కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : జిల్లాలో లక్ష మందితో ‘సమైక్య 5కే రన్’ను ఏర్పాటు చేస్తున్నట్టు విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ తెలిపారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో ఉద్యోగ జేఏసీ నాయకులతోను, విద్యార్థి సంఘాలతోను, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, మున్సిపల్ జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సమైక్య 5కే రన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందితో కాకినాడ, అమలాపురం, రాజమండ్రిల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు, అక్కడి నుంచి తిరిగి సుబ్రహ్మణ్య మైదానానికి చేరుకుంటుందని వివరించారు. ఎన్జీఓ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు, వాకర్స్, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదుల జేఏసీ తదితర అన్ని సంఘాల వారు దీనిని విజయవంతం చేయాలన్నారు. తద్వారా సమైక్యాంధ్ర సెగ కేంద్రానికి తాకేలా చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎన్జీఓ జేఏసీ అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు, విద్యుత్ ఉద్యోగుల తరఫున పద్మనాభం, నర్శింహారావు, విద్యార్థి సంఘాల తరఫున అర్షద్, మున్సిపల్ జేఏసీ తరఫున శ్రీనివాసరావు, రమణారావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల 9న ‘సమైక్య’పరుగు
సాక్షి, ఏలూరు :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా జై సమైక్యాంధ్ర రన్‌ను నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఎంపీ, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. శనివారం సాయంత్రం ఏలూరు రెవెన్యూ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు నగరంలోనూ జై సమైక్యాంధ్ర రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దాదాపు లక్ష మందితో స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఇండోర్‌స్టేడియం వరకూ 3 కిలోమీటర్ల సమైక్యాంధ్ర రన్ జరపనున్నట్లు ఆయన వివరించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకూ అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. సమైక్య ఉద్యమంలో ఉద్యోగులు, మీడియా పాత్రను లగడపాటి ప్రశంసించారు. నిరుత్సాహ పడి పోరాటాన్ని ఆపాల్సిన అవసరం లేదని, ఈ నెల 21న విజయోత్సవం చేసుకోవచ్చని రాష్ట్రం ఖచ్చితంగా విడిపోదని అన్నారు. 2004లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నానని, అనివార్య కారణాల వల్ల విజయవాడ నుంచి పోటీ చేశానని గుర్తుచేశారు. ఇక ముందు కూడా విజయవాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన సీటు వేరొకరికి ఇచ్చినా రాష్ట్రం సమైక్యంగా ఉంచితే వారికి సహకరిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఎల్.సాగర్, జిల్లా కార్యదర్శి టి.యోగానందం, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బడేటి వెంకటరామయ్య, ఫ్లాష్ సంస్థ నిర్వాహకుడు యర్రంశెట్టి శ్రీనివాస్, ఏపీఎన్జీ సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, కె.రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
శ్రీహరీ.. ఇదేమి కిరికిరి!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ముందస్తు రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు చూస్తున్న జనానికి కొత్తగా అజ్ఞాత రాజకీయం తెరపైకి వచ్చింది. గత పదిరోజులుగా సమైక్యాంధ్ర పేరుతో వెలసిన హోర్డింగ్‌లు జిల్లాలో చర్చనీయాంశం కాగా ఇపుడు మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ విస్మయానికి గురి చేస్తోంది. క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగిన ఎన్నో ఏళ్లకు ఇపుడు కొత్తగా పార్టీ స్థాపించడం, సందర్భంగా వచ్చినపుడు అందరూ బయటకు వస్తారని వ్యాఖ్యానించడం చూస్తుంటే శ్రీహరి ఈ అజ్ఞాత రాజకీయం నడుపుతున్నదెవరి కోసం అన్న సందేహం కలుగుతోంది. జిల్లా నుంచి ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటయింది. దాదాపు 23 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరమైన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి అకస్మాత్తుగా తెరపైకి వచ్చి ఆ పార్టీని రిజిస్టర్ చేయించడం.. ఆ పార్టీ తరఫున సమైక్యాంధ్రలో ఉన్న అన్ని స్థానాలకూ పోటీ చేస్తామని చెబుతుండడం చూస్తుంటే పార్టీ ఏర్పాటు వెనుక ఎవరి హస్తం ఉందనే అంశం జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. నిన్న మొన్నటివరకూ ప్రతి ఒక్కరి నోటా వినిపించిన ‘జై సమైక్యాంద్ర’ నినాదమే పేరుగా పెట్టుకొని పార్టీ పురుడు పోసుకోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడ సహా రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర పేరుతో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఇటీవల కాలంలో ఏర్పాటయ్యాయి. వీటిని ఏర్పాటు చేసినవారు ఎవరై ఉంటారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్న పార్టీకి సమైక్యాంధ్ర హోర్డింగ్‌లను తొలివిడతగా తెరపైకి తీసుకువచ్చారనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఈ తరుణంలో జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో రాజకీయ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించారు. మూడు నెలల క్రితమే ‘జై సమైక్యాంధ్ర’ రిజిస్టర్ అయింది. పార్టీని రిజిష్టర్ చేసిన శ్రీహరి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలో జిల్లా నుంచి కింగ్‌మేకర్‌గా చలామణీ అయిన ఎస్ఆర్ఎంటీ అధినేత కేవీఆర్ చౌదరికి ఈయన స్వయానా అల్లుడు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం టీటీడీ బోర్డు డెరైక్టర్‌గా ఉన్న చిట్టూరి రవీంద్ర, శ్రీహరి స్వయానా తోడళ్లులు. శ్రీహరి 1984-89 మధ్య టీడీపీ హయాంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. 1989 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో మరోసారి రాజమండ్రి ఎంపీగా బరిలోకి దిగిన శ్రీహరి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత టీడీపీకి 1990లో రాజీనామా చేశారు. సుమారు 23 ఏళ్లు రాజకీయాలకు దూరమై తెరమరుగైన శ్రీహరి హఠాత్తుగా ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో రాజకీయపార్టీని రిజిష్టర్ చేసి రాజకీయాల్లో తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. 60 ఏళ్లు పైబడ్డ శ్రీహరి రాజకీయాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ కోసమే పార్టీని స్థాపించారా లేక మరో కారణమేమైనా ఉంటుందా అనే అంశం రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయాలంటే వెగటుపుట్టి ఇంతకాలం దూరంగా ఉంటున్నానని చెబుతోన్న శ్రీహరి హఠాత్తుగా పార్టీని రిజిష్టర్ చేయడమే కాకుండా సమైక్యాంధ్ర ముక్కలవుతుండడంతో మనసు కలతచెంది పార్టీ ఒకటి ఉండాలనే ఉద్ధేశంతో మూడు నెలల క్రితమే రిజిష్టర్ చేయించానని చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారని నర్మగర్భంగా చెప్పిన శ్రీహరి అంతరంగం ఏమిటో అంతుబట్టడం లేదు. అందరూ బయటకు వస్తారంటున్న శ్రీహరి మాటలు, పార్టీ ఏర్పాటు వెనుక ఎవరైనా పెద్దలున్నారా అనే దానికి బలం చేకూరుస్తున్నాయి. సందర్భం వచ్చినప్పుడు పార్టీ విధి, విధానాలు ఇతర విషయాలు తెలియచేస్తానని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన చెప్పుకొచ్చారు. 23 ఏళ్లుగా రాజకీయాలకు దాదాపు దూరమైన శ్రీహరికి జిల్లాలో ప్రస్తుత రాజకీయ నాయకులు, ఏ పార్టీ కేడర్తోను పెద్దగా సంబంధాలు లేవు. అటువంటప్పుడు ఏ ఉద్దేశంతో పార్టీని రిజిష్టర్ చేశారనే విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
కొల్లూరులో సమైక్య శంఖారావం
కొల్లూరు, న్యూస్‌లైన్: తమ అధినేత రాష్ట్ర విభజనకు అనుకూలమా లేక వ్యతిరేకమా స్పష్టం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబునాయుడిపై ఎందుకు వత్తిడి తీసుకురావడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజాగర్జన పేరుతో చంద్రబాబు యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని, ప్రజలు గర్జిస్తే ఆయన దిక్కులేకుండా పోతారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ మేరుగ నాగార్జున అధ్యక్షతన ఆదివారం రాత్రి మండలం కేంద్రం కొల్లూరులోని బస్టాండ్ సెంటరులో నిర్వహించిన సమైక్యశంఖారావం బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమైక్యం అనే మాట చంద్రబాబు నోట ఎందుకు రాదన్న విషయాన్ని సీమాంధ్ర ప్రాంత టీడీపీ నాయకులే ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సూటిగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో ఉన్న పార్టీ నాయకులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. నిధులెక్కడి నుంచి వస్తాయి.. పార్టీ విజయవాడ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు నిధులు లేవని చెబుతున్న అధికార పక్ష నాయకులు, రాష్ట్రం విడిపోతే వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జనంతో మమేకం అవగల నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమే అని, దీన్ని ఓర్చుకోలేకే చంద్రబాబు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నా అని చెప్పుకొంటున్న చంద్రబాబు దీక్షల పేరిట ఎవరి కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ వెళుతున్నారని ప్రశ్నించారు. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రధానమనే ఆలోచనతో జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని చెప్పారు. తెలంగాణలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అని నినదిస్తున్నారని, మరోవైపు టీడీపీ అధ్యక్షుడు మాత్రం తెలంగాణ కోసం నిరాహార దీక్షలు చేయిస్తున్నారని విమర్శించారు. సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుటుంబాలు ఉమ్మడిగా ఉండాలనేది తెలుగువారి సంస్కృతి అన్నారు. అలాంటిది రాష్ట్ర విభనకు ఇతర పార్టీలు ఎలా సహకారం అందిస్తున్నాయని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు ఒప్పుకోకపోయినా, ఆమె కోడలు సోనియా అందుకు పూనుకోవడం దారుణమన్నారు. తరలివచ్చిన నాయకులు సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, వాణిజ్య విభాగం రాష్ర్ట కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, వైఎస్సార్టీయూసీ కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ జానీభాషా, బీసీసెల్ కన్వీనర్ దేవళ్ళ రేవతి, జిల్లా మహిళ కన్వీనర్ దాది వెంకటలక్ష్మీరాజ్యం, జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు బండారు సాయిబాబు, హనుమంత్‌నాయక్, మైనారిటీ కన్వీనర్ మహబూబ్, తాడికొండ నియోజకవర్గ కన్వీనర్ కె.సురేష్‌కుమార్, తెనాలి నియోజకవర్గ కన్వీనర్ గుదిబండి చినవెంకటరెడ్డి, కృష్ణా జిల్లా నాయకుడు సింహాద్రి రమేష్ ప్రసంగించారు. చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల కన్వీనర్లు ఉయ్యూరు అప్పిరెడ్డి, చందోలు డేవిడ్ విజయ్‌కుమార్, రాపర్ల నరేంద్ర, తూము నాగేశ్వరరావు, పడమట వెంకటేశ్వరరావు, కొల్లూరు గ్రామ కన్వీనర్ బిట్రగుంట సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సెల్ సభ్యులు అంగిరేకుల ఆదిశేషు, పిడపర్తి క్రిష్ట్రోఫర్, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ చిలకా ప్రకాష్, యువజన విభాగ కన్వీనర్ కూచిపూడి మోషే, సీనియర్ నాయకులు నర్రా అప్పారావు, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తూర్పు గోదావరిలో జై సమైక్యాంద్ర
-
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి, తిరుమల : ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అర్చకులతో కలసి సీఎంకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారువాకిలి ద్వారా కులశేఖరపడి వద్దకు చేరుకున్నారు. పచ్చకర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్నారు. స్వామి పాదాల వద్ద ఉంచిన పట్టు శేషవస్త్రాన్ని సీఎంకు బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. స్వామి దర్శనం తర్వాత సీఎం ఆలయం వెలుపలకు రాగానే కొందరు భక్తులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. శ్రీవారి దర్శనం ముగించుకుని మధ్యాహ్న భోజనం తర్వాత 1.30 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. గొల్ల మంటపంపై సీఎం ఆరా శ్రీవారి ఆలయం సమీపంలోని పురాతన గొల్ల మంటపంపై సీఎం ఆరా తీశారు. దీనిని కూల్చకపోతే ప్రమాదమని ఇటీవల నిపుణులు హెచ్చరించారు. అయితే, తమ మనోభావాలతో ముడిపడి ఉన్న మంటపాన్ని కూల్చివేస్తే అడ్డుకుంటామని యాదవసంఘ నేతలు హెచ్చరించారు. టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఈ వివాదాన్ని ఆయనకు వివరించారు. ఎవరి మనోభావాలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని జేఈవోకు సీఎం సూచించినట్టు తెలిసింది. కాగా తిరుమల శ్రీవారి ట్రస్టులకు చెన్నైకి చెందిన టీబీ. రావు అనే భక్తుడు గురువారం రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. -
జనసీమ
రాజన్న తనయకు జిల్లా ఉద్యమాహ్వానం అవనిగడ్డలో అడుగడుగునా అశేష జనవాహిని సమైక్యస్ఫూర్తిని రగిలించిన షర్మిల ప్రసంగం దివిసీమ జనసీమైంది. ఎవడబ్బ సొమ్మురా ఈ గడ్డ చీల్చ.. ఈ కుట్రలు, కుతంత్రాలను దునుమాడగ..తెలుగువీరా లేవరా.. దీక్షబూని సాగరా..అంటూ జనచేతన పతాకై సమైక్య సమర శంఖం పూరించిన వైఎస్ షర్మిలకు అపూర్వస్వాగతం పలికింది. వర్షం వచ్చినా, ఆమె రాక ఆలస్యమైనా జనం ఉత్సాహం, ఉత్సుకతతో ఎదురుచూశారు. సమైక్యవాదుల కవాతుతో అవనిగడ్డ కడలికెరటమైంది. జైజగన్, జైసమైక్యాంధ్ర నినాదాలు దిక్కులు పిక్కటిల్లాయి. సాక్షి ప్రతినిధి, అవనిగడ్డ : దివిసీమ జనసునామితో పోటెత్తింది. అవనిగడ్డ జనసంద్రమైంది. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమైక్య శంఖం పూరించటానికి జిల్లాకు వచ్చిన వైఎస్ షర్మిలను చూసేందుకు జనం కడలి కెరటమై కదిలారు. అడుగడునా అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర బుధవారం రాత్రి 9గంటలకు జిల్లాలోకి ప్రవేశించింది. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్జీవోలు పెద్ద ఎత్తున పులిగడ్డ వారధి వద్దకు చేరుకుని ఆమెను జిల్లాలోకి సాదరంగా తోడ్కొనివచ్చారు. దారిపొడువునా గంటల తరబడి తన కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరికి అప్యాయంగా పలకరిస్తూ బస్సుయాత్ర ద్వారా షర్మిల అవనిగడ్డలోని బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. జన మే జనం షర్మిలకు స్వాగతం పలికేందుకు పులిగడ్డ- పెనుమూడి వారధి వద్దకు అనూహ్య సంఖ్యలో జనం తరలివచ్చారు. జైజగన్, జైసమైక్యాంధ్ర నినాదాల నడుమ షర్మిల బస్సు యాత్ర జిల్లాలో సాగింది. అడుగడుగునా ప్రజలు వెల్లువలా ఎదురేగి స్వాగతం పలకడంతో యాత్ర నిర్ణీత షెడ్యూల్ కన్నా నాలుగు గంటలు అలస్యంగా అవనిగడ్డకు చేరుకుంది. జోరు వర్షం కురుస్తున్నా జనం లెక్కచేయలేదు. షర్మిలను చూసేందుకు, అమె సమైక్య ప్రసంగాన్ని వినేందుకు అసక్తి చూపారు. ఆమె కూడా దారిపొడవునా ప్రతి ఒక్కరికీ ఆప్యాయంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆమె అవనిగడ్డ బస్టాండ్ సెంటర్ చేరుకోగానే జనం పెద్దపెట్టున నినాదాలు చేశారు. అశేష జనవాహినినుద్దేశించి తొలుత పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ప్రసంగించారు. మీ రాజన్న కూతురును.... మీరాజన్న కూతుర్ని... జగనన్న చెల్లెల్ని అంటూ షర్మిల ప్రజలకు అభివాదం చేసి తన ప్రసంగం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలి.. కోట్లాది మంది ప్రజలు ఎందుకు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు.. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలు ఏమిటి తదితర అంశాలను వివరిస్తూ తీవ్ర ఉద్వేగంగా ఆమె చేసిన ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది. తెలుగుజాతి ఒక్కటిగా నిలవాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తపించారని, ఆకాంక్షించారని ఆమె గుర్తుచేశారు. సమైక్య స్ఫూర్తి రెట్టించేలా షర్మిల ఎంతో భావోద్వేగంతో తన ప్రసంగం కొనసాగించిన తీరు అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేసింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అకాంక్షించే ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీనేనని ప్రజల హర్షధ్వానాల నుడుమ ఆమె సుస్పష్టంచేశారు. విభజన జరిగితే.. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని సారవంతమైన భూములు ఉప్పు కల్లాలుగా మారిపోతాయని వివరించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆమె దుయ్యబట్టారు. సీమాంధ్రకు కృష్ణా నది నీరు రాకపోతే కుప్పం నుంచి కృష్ణాజిల్లా వరకు సముద్రపు నీరే దిక్కు అవుతుందని అన్నారు. చంద్రబాబు అవినీతిపై సమగ్ర విచారణ జరిగితే ఎప్పుడో జైలుకు వెళ్లేవారని ఆమె పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడ్ని నిలదీయాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్, చంద్రబాబునాయుడుపై విమర్శలు ఎక్కుపెట్టిన క్రమంలో ప్రజలు చప్పట్ల మోత మోగించారు. దాదాపు 15 నిమిషాల పాటు షర్మిల ప్రసంగించారు. హాజరైన ముఖ్యనేతలు పార్టీ జిల్లా, నగర కన్వీనర్లు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్, అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్తలు సింహద్రి రమేష్‌బాబు, గుడివాక శివరావు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్నినాని, మేకాప్రతాప అప్పారావు, అంబటి రాంబాబు, సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, పెనమలూరు నియోజకవర్గ కన్వీనర్ తాతినేని పద్మావతి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ గౌతంరెడ్డి, పెడన నియోజకవర్గ కన్వీనర్ ఉప్పాల రాంప్రసాద్, ఉప్పాల రాము, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, పార్టీ నేతలు, వేల్పుల రవికుమార్, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తాం
-
రోజురోజుకూ రగులుతున్న నిరసనాంధ్ర
సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా సరిగ్గా నెలరోజుల కిందట ఎగసిన సమైక్య ఉద్యమం రోజురోజుకూ బలపడుతూ తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సీమాంధ్ర జిల్లాల్లో ప్రతినిత్యం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తెలుగు భాషా, క్రీడా దినోత్సవమైన గురువారంనాడు కూడా రోజూమాదిరిగానే ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న ఆందోళనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు దద్దరిల్లాయి. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ చేపట్టిన ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ విజయంతమైంది. జై సమైక్యాంధ్ర అంటూ లక్ష గొంతులు నినదించాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకులు, విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ యూత్ విభాగం ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో మునిసిపల్ కమిషనర్, గుంటూరు జిల్లా తెనాలి గాంధీచౌక్ సెంటర్లో మునిసిపల్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. గుంటూరులో భారీ మానవహారంగా ఉద్యమకారులు ఏర్పడ్డారు. రాజకీయ జేఏసీ నేతృత్వంలో ప్రైవేటు ఉపాధ్యాయుల రిలేదీక్షల శిబిరాన్ని వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ కార్మికులు శరీరానికి చెట్ల కొమ్మలు చుట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో ఐదుగురు విద్యుత్ కార్మికుల అరెస్టును నిరసిస్తూ రెండు వేల మందికి పైగా ఆర్టీపీపీ కార్మికులు, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, లింగారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి నేతృత్వంలో పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. దీంతో చేసేదేమి లేక పోలీసులు వారిని విడుదల చేశారు. రైల్వేకోడూరులో అర్ధ లక్ష గళ గర్జన పేరుతో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో వ్యవసాయశాఖ అనుబంధశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో గడ్డి తినే కార్యక్రమం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మూడురోడ్ల జంక్షన్లో ఉపాధ్యాయులు మోకాళ్లతో నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూరులంకలో రైతులు రోడ్డుపై పశువులను ఉంచి దిగ్బంధం చేశారు. స్పోర్ట్స్ డే సందర్భంగా కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో పీఈటీలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. కాకినాడలో ఉపాధ్యాయులు భారీ బైక్ ర్యాలీ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వికలాంగులు ర్యాలీ చేపట్టి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని గురువారం చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్‌తోపాటు పలువురు జేఏసీ నేతలు రోడ్డుపైనే క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు. శ్రీకాకుళంలో 500 మంది డ్వాక్రా సంఘాల మహిళలు నిండు బిందెలతో ర్యాలీగా వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. నరసన్నపేటలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 10 వేల మంది విద్యార్థులతో గళార్చన కార్యక్రమం జరిగింది. కృష్ణాజిల్లా బెజవాడ దుర్గమ్మ గుడి అర్చకులు, వేద పండితులు ప్రవచనాలు చెప్పి నిరసన తెలిపారు. గుడివాడలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 4 వేల మంది డ్వాక్రా మహిళలతో ర్యాలీ జరిపారు. తెలంగాణ-రాయలసీమ రహదారి దిగ్బంధం తెలంగాణ-రాయలసీమ సరిహద్దు గ్రామమైన శ్రీశైలం వద్ద సమైక్యవాదులు రహదారిని దిగ్బంధించారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ, విద్యార్థి జేఏసీ, శ్రీశైలం మండల జర్నలిస్ట్‌ల ఆసోసియేషన్ల ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేసీఆర్, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, న్యాయశాఖ మంత్రి ఏరాసుప్రతాపరెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ‘మెగా’ సినిమాలను అడ్డుకుంటాం: సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ సమైక్యాంధ్రకు కట్టుబడి కేంద్రమంత్రి చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే ఆయన కుటుంబ సభ్యుల సినిమాల విడుదలను అడ్డుకుంటామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు డి.అంజయ్య బుధవారం నెల్లూరులో హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు దిగ్బంధం.. విజయవంతం సమైక్యాంధ్ర జేఏసీల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు నగరాల్లో 48 గంటల పాటు చేపట్టిన దిగ్బంధనం విజయవంతంమైంది. బుధ, గురువారాలు రెండు రోజులు సమైక్యవాదులు ద్విచక్ర వాహనాలను మినహా ఏ వాహనాన్నీ తిరగనివ్వలేదు. ఫలితంగా తిరుపతి, చిత్తూరు శివారు ప్రాంతంలో తమిళనాడు, కర్ణాటక వైపు వెళ్లివచ్చే వాహనాలు కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిపోయాయి. మందుల షాపులు మినహా ఆసుపత్రులు, సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు తాళాలు వేశారు. కూరగాయల మార్కెట్లు కూడా మూసివేశారు. అరెస్టు చేస్తే కరెంట్ కట్ చేస్తాం: విద్యుత్ జేఏసీ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసే విద్యుత్ ఉద్యోగులను, జేఏసీ నేతలను అరెస్టుచేస్తే ఆయా పోలీసుస్టేషన్లు, ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలకు కరెంట్ తీసేస్తామని విద్యుత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కోలాకి శ్రీనివాసరావు గురువారం విశాఖలో హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని రాయలసీమ థర్మల్ పవర్స్టేషన్కి చెందిన పది మంది కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు గురువారం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 5 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఇంటర్ అధ్యాపకులు రానున్న సెప్టెంబర్ 5వ తేదీ గురుపూజోత్సవం అర్ధరాత్రి నుంచి ఇంటర్అధ్యాపకులంతా సమ్మెలోకి వెళ్లనున్నుట్టు ఇంటర్మీడియేట్ అధ్యాపక జేఏసీ కన్వీనర్ వి.రవి ప్రకటించారు. విజయవాడలో గురువారం అధ్యాపక జేఏసీ 13 జిల్లాల నాయకుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోస్తా, సీమ జిల్లాల్లోని 665 కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది సమ్మెలో పాల్గొంటూ నిరవధిక నిరాహారదీక్షలకు దిగనున్నట్టు చెప్పారు. ప్రైవేటు కళాశాలల అధ్యాపక సిబ్బంది కూడా తమతో కలిసివచ్చేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుండాలని ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోకాళ్లపై మెట్లెక్కి ఆలయంలో పూజలు చేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నేత కడియం రామాచారి పాల్గొన్నారు. -
హోరెత్తిన నిరసనలు
సాక్షి నెట్వర్క్: జై సమైక్యాంధ్ర.. జై తెలంగాణ..నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం రాజధానిలోని విద్యుత్‌సౌధ, ఇతర ప్రధాన ప్రభుత్వ విభాగాలు నిరసన కార్యక్రమాలతో హోరెత్తాయి. వివరాలు..సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు, ప్రత్యేక తెలంగాణను వెంటనే ప్రకటించాల తెలంగాణ ఉద్యోగుల ధర్నాలు, నినాదాలతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. సీమాంధ్ర ఉద్యోగులు- ‘కుర్చీని కాపాడుకోవడం ఎలా?’ అనే నాటికను ప్రదర్శించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తుతుందని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీవిద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. శాంతిభద్రతల్ని సాకుగా చూపుతూ సీఎం మాట్లాడడం సరికాదని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రఘు పేర్కొన్నారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కోఠి డీఎంహెచ్ఎస్లో ఏపీఎన్జీవోలు విధులు బహిష్కరించి డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైద్య విధాన పరిషత్, ఏపీసాక్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, డీహెచ్ తదితర కార్యాలయాల ఉద్యోగులు ర్యాలీలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ కార్యాలయంలోనూ ఏపీఎన్జీవోల ప్రదర్శనలు కొనసాగాయి. -
కర్నూలులో ‘ జై సమైక్యాంధ్ర’ అన్న లక్ష గొంతుకలు
తాడేపల్లిగూడెంలో నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న అనంతపురంలో న్యాయవాదుల 48 గంటల నిరశన శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులచే హైవే దిగ్బంధం రాజమండ్రిలో 33 మంది మున్సిపల్ కమిషనర్ల సమావేశం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర కోసం 23 వ రోజూ నిరసనలు, ర్యాలీలు, మావనహారాలతో సీమాంధ్ర జనసంద్రమైంది. లక్షల గొంతుకలు జై సమైక్యాంధ్ర అంటూ గళమెత్తి ఘోషించాయి. ఉద్యమంలో ఊపుతీసుకువచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలకు మద్దతుగా అనేకచోట్ల నిరాహారదీక్షలు నిర్వహిం చారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు రోడ్లపైకి వచ్చి మానవహారాలు జరిగాయి. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో కర్నూలు రాజ్‌విహార్ సెంటర్లో నిర్వహించిన ‘లక్షగళ ఘోష’ కార్యక్రమం విజయవంతమైంది. నగరం, శివారులకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో లక్ష గొంతుకలతో చేసిన సమైక్యాంధ్ర నినాదం మారుమోగింది. రాజ్‌విహార్ మూడురోడ్ల కూడలి ఎటూ చూసినా జనసంద్రమైంది. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి, సమైక్యాంధ్ర జెండాలు చేత బూనారు. విద్యుత్ ఉద్యోగులు కర్నూలు జాతీయరహదారిని రెండు గంటల పాటు దిగ్భందించారు. అనంతపురం కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయ జాక్టో,స్వర్ణకారుల సంఘం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేశారు. న్యాయవాదులు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. జెడ్పీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. ఎస్కే యూనివర్సిటీలో మంత్రులు శైలజానాథ్, రఘువీరా దిష్టిబొమ్మలు, కళ్యాణదుర్గంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా కడప జిల్లా వ్యాప్తంగా రిలేదీక్షలు సాగుతున్నాయి. ఉపాధ్యాయులు రోడ్లపైకి చేరి కదం తొక్కారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీని వాసులు దీక్ష ను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ బంద్‌ను పాటించారు. బద్వేలులో రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ తీయగా, రాయచోటిలో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. చిత్తూరులో ఉన్నతాధికారులు ఉద్యోగులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గాంధీవిగ్రహం వద్ద కోలాటాలు అడగా, మినీలారీ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. వీ కోటలో ఆస్పత్రి సిబ్బంది రోగులకు రోడ్డుపైనే చికిత్సలు చేసి నిరసన తెలిపారు. మదనపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాల విద్యార్థులకు రోడ్డుపైనే బోధనలు నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర గురువారం చంద్రగిరికి చేరుకుంది. తిరుపతిలో వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా కుప్పం లో వైఎస్ఆర్సీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. విజయవాడకు విశాలాంధ్ర మహాసభ యాత్ర విశాలాంధ్ర మహాసభ బృందం యాత్ర విజయవాడకు చేరిన సందర్భంగా భారీ సభ ఏర్పాటుచేశారు. న్యాయవాదులు, సిబ్బంది గురువారం కూడా కోర్టు గేట్లకు తాళాలు వేసిన నిరసన తెలిపారు. వెఎస్ విజయమ్మ చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు జరిగాయి. మైలవరంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీర్యాలీలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తెనాలిలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన చేయగా, రేపల్లెలో యోగాసనాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్లలో వైఎస్ఆర్ సీపీ రిలేదీక్షలు కొనసాగాయి. మంగళగిరిలో విద్యార్థి జేఏసీ సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ప్రకాశం జిల్లాలో అటెండర్ స్థాయి ఉద్యోగి నుంచి గెజిటెడ్ అధికారి వరకు అందరూ ఉద్యమ బాట పట్టారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 48 గంటల ఆమరణ దీక్షను విరమించారు. నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గం బోగ్యం వారిపల్లికి చెందిన యువకుల నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యార్థి జేఏసీ, ఎన్జీఓ అసోసియేషన్, గెజి టెడ్ ఆఫీసర్స్‌తోపాటు పలు రాజకీయపార్టీలు జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు, ర్యాలీ లు, రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న తాడేపల్లిగూడెంలో వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులు నాగళ్లు చేతబూని, ఎడ్లబండ్లతో ప్రదర్శన చేశారు. నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు కుమ్మర్లతో కలసి కుండలు తయారుచేసి నిరసన తెలిపారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు బుట్టాయిగూడెంలో ఒకరోజు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. చింతలపూడిలో కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్, చిన్నం సురేష్ ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఇన్చార్జి కలెక్టర్ తప్ప ఇతర ఉద్యోగులంతా రోడ్డెక్కారు. గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో వంటావార్పు, ైబె క్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో వేపగుంటలో బైక్ ర్యాలీ తీశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ ర్యాలీగా వెళ్లి మద్దిలపాలెం వద్ద వైఎస్సార్సీపీ ముస్లిం నేతలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపింది. జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయసంఘం ఆధ్వర్యంలో 11 మండలాల్లో ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టారు. శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజూ కొనసాగింది. శ్రీకాకుళంలో జాతీయ రహదారిని విద్యుత్‌శాఖ ఉద్యోగులు దిగ్భందించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం మానవహారం చేపట్టింది. సీమాంధ్రలోని 33 మునిసిపాలిటీల కమిషనర్లు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రాజమండ్రిలో సమావేశమయ్యారు. కాకినాడలో మహిళా సమాఖ్య సభ్యులు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ఎదుట జేఏసీ దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్సీలు చైతన్య రాజు, రవికిరణ్ వర్మ సంఘీభావం తెలిపారు. దిండి-చించినాడ వంతెనపై రామరాజులంక గ్రామస్తులు వంటావార్పుతో రాస్తారోకో చేసి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలను స్తంభింప చేశారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సు యాత్ర అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో సాగిం ది. పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీజిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో కొందరికి సోనియా, దిగ్విజయ్ సింగ్, బొత్స,కేసీఆర్ మాస్కులు ధరింపజేసి, వారిని చీపుళ్లు, చేటలతో కొడుతూ రోడ్లపై ఊరేగించారు. సాలూరులో మహిళలు జాతీయ రహదారిపై లలితా సహస్త్రనామ పారాయణం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి బొబ్బిలిలో నివసిస్తున్న ప్రవీణ్ అనే యువకుడికి... ఇరుప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కోరతూ పౌర సన్మానం చేశారు. విభజన వేదనతో ఐదుగురు మృతి న్యూస్‌లైన్ నెట్వర్క్ : విభజన చిచ్చుకు గురువారం ఐదుగురు బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కూసం నాగేంద్ర (50) హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఉపాధికి విఘాతం కలుగుతుందనే ఆందోళనతో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. లింగపాలెం మండలం కె.గోపవరం పరిధిలోని గణపవారిగూడెంకు చెందిన గద్దే ఆశీర్వాదం (32) టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన అరిగెల ప్రసన్న(23) గురువారం పరిటాల సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జై సమైక్యాంధ్ర అంటూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురంజిల్లా ముదిగుబ్బ మండల కేంద్రం లోని గేట్కొట్టాలకు చెందిన హైదర్‌వలి (55),ఓడీ చెరువు మండలం జంబులవాండ్లపల్లికి చెందిన జంబుల గంగిరెడ్డి (50) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. కాగా, పెద్దపంజాణి మండలం బొమ్మలకుంటకు చెందిన నడిమింటి ఈశ్వరయ్య (44) శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకోబోగా, ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. విభజన జరిగితే తనకు వికలాంగుల పింఛన్ రాదేమోనన్న బెంగతో చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన కొడమంచిలి శ్రీను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోడూరులో కరెళ్ల సత్యనారాయణ (30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం గుంటూరులోని సంగడికుంట ప్రాంతానికి చెందిన షేక్ అల్లాబక్షు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీక్షా శిబిరం ఎదురుగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ‘జగనన్న బయటకు రావాలి, ప్రజలకు న్యాయం చేయాలి’ అని నినాదాలు చేస్తూ నిప్పంటించుకోబోయాడు. పోలీసులు అప్రమత్తమై అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 26 నుంచి నేతల ఇళ్లకు సేవలు బంద్ మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రకటన తిరుపతి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల ఇళ్లకు తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి సేవలను ఈనెల 26నుంచి నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ తిరుపతిలో గురువారం ప్రకటించారు. ఈనెల 12 నుంచి సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఉద్యోగులు గురువారం ఒంటికాలిపై నిలుచుని నిరసన తెలిపారు. -
ఉప్పెనలా ఉద్యమం
సాక్షి, అనంతపురం : ఓ వీధిలో పది మంది కలుస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నారు. తమకొచ్చే ఆదాయం అంతంతమాత్రమే అయినా.. తలా వంద, రెండొందలు చందాలు వేసుకుంటున్నారు. ప్లకార్డులు లేదా బ్యానర్లు లేదా ఫ్లెక్సీలు తయారు చేయించుకుని... ఆటో, మైకు మాట్లాడుకుని ‘జై..సమైక్యాంధ్ర’ అంటూ రోడ్లపైకి వస్తున్నారు. ప్రతి వీధి నుంచి ఇలాగే స్వచ్ఛందంగా జనం రోడ్లపైకి వస్తుండడంతో ఆ పది మంది కాస్తా... వందలాది, వేలాది మంది అవుతున్నారు. వారి సమైక్య నినాదాలతో ‘అనంత’ మార్మోగుతోంది. ప్రస్తుతం ఉద్యమిస్తున్న వారిలో ఎవరూ నాయకులు కాదు. ఏ రోజూ మైకు పట్టుకుని మాట్లాడిన వారు కాదు. అయినా.. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఉద్యమ సెగను ప్రజ్వలింపజేస్తూ.. ఢిల్లీకి వినిపించేలా పొలికేక పెడుతున్నారు. 12వ రోజైన శనివారం కూడా జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాక్టో ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జాక్టో నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో నాన్పొలికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి.. నగరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రామ్‌నగర్ ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 200 ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. నగరంలోని 48వ డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమబాట పట్టారు. నగరమంతా ర్యాలీ చేశారు. వీరికి వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి మద్దతు ప్రకటించారు. లక్ష్మీ మహిళా కుట్టు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక నందిని హోటల్ ఎదురుగా ఉన్న వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అలాగే నగరంలోని ప్రధాన వీధులకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలు చేపట్టారు. స్థానిక సప్తగిరి, టవర్‌క్లాక్ సర్కిళ్లలో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎస్కేయూలో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రులు పురందేశ్వరి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్లంరాజు ఫొటోలను ఎనుములకు కట్టి ఊరేగించారు. వర్సిటీ ప్రధాన ద్వారం నుంచి న్యాయశాస్త్ర విభాగం గేటు వరకు ప్రదర్శన కొనసాగింది. ఎనుములను నమ్ముకుంటే పాలు ఇస్తాయని, ప్రజాప్రతినిధులు మాత్రం నమ్మించి నట్టేట ముంచారని విద్యార్థులు విమర్శించారు. వర్సిటీలో విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు పదకొండో రోజుకు చేరాయి. కళాకారులు జానపద గేయాలు, ఆటలతో అలరించారు. కాంగ్రెస్ పార్టీ చర్యలను నిరసిస్తూ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల జిల్లా బంద్ చేపడుతున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అన్ని వర్గాలు బంద్‌కు సహకరించి సమైక్యాంధ్ర వాణిని గట్టిగా వినిపించాలని పిలుపునిచ్చారు. ఊరూ వాడ నిరసనల హోరు ధర్మవరంలో కమ్మ సంఘం సభ్యులు, వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల నాయకులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో డీజిల్ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో దాదాపు 150 ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపైనే వంటా-వార్పు చేపట్టారు. గుత్తిలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జాక్టో దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. పామిడిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ చేపట్టారు. మునిసిపల్ ఉద్యోగులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఉద్యోగులు నడిరోడ్డుపై కబడ్డీ ఆడారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ చేశారు. లేపాక్షి, చిలమత్తూరు మండల్లాలో సమైక్య నినాదాలు మిన్నంటాయి. కదిరిలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌కో డీఈ వినాయక ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ కూడలిలో మానవహారం నిర్మించారు. వికలాంగుల ర్యాలీ, చెక్కభజనలతో పట్టణం మార్మోగింది. కళ్యాణదుర్గంలో వాల్మీకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. మడకశిరలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యవాదులు మడకశిర నుంచి పావగడ వరకు పాదయాత్ర చేపట్టారు. నల్లమాడలో దళితులు ర్యాలీ, వంటా వార్పు చేపట్టారు. రొద్దంలో యువకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఉద్యోగ, జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కణేకల్లులో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రాప్తాడు, సీకేపల్లి మండలాల్లో బంద్, రిలే దీక్షలు చేపట్టారు. శింగనమలలో సమైక్యాంధ్రపై కేజీబీవీ విద్యార్థుల నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. తాడిపత్రిలో పాత్రికేయులు రిలే దీక్షలు చేపట్టారు. యాడికిలో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో చేనేత కార్మికులు ర్యాలీ చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సోనియా, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బెళుగుప్పలో సమైక్యవాదులు భారీ ప్రదర్శన చేపట్టారు.