సాక్షి, విజయవాడ: మూడు, నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రమంతా జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ ముఖ్యనేత ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనపై తాము న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన ఇంకా పూర్తి కాలేదని, తాము సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అడ్మిట్ చేసుకుని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందన్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం పార్లమెంట్ తొలి సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని, దాన్ని సీమాంధ్ర ప్రాంత ఎంపీలంతా అడ్డుకోవాలన్నారు.