
'చెప్పు'గుర్తు అభ్యర్థిపై టీఆర్ఎస్ రాళ్ల దాడి
ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్-జై సమైక్యాంధ్ర కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ బుధవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. జై సమైక్యాంధ్ర అంటూ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న ఎంపీ అభ్యర్థి చెరుకూరి నాగార్జునపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చెరుకూరి నాగార్జున సహా కార్యకర్తలు గాయపడ్డారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.