
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం లింగాపూర్ గామంలో టీఆర్‌ఎస్ వర్గీయులు పోలీసులుపై అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడికి తెగపడ్డారు. కడెం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అన్న భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోస్టుమార్టం లేకుండానే ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఖననం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, కడెం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త పెద్దది కావటంతో శ్రీనివాసరెడ్డి అనుచరులు ఏఎస్‌ఐ సహా హోంగార్డుపై దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డితో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: Hyderabad: హైటెక్స్‌లో రేపు 40 వేల మందికి టీకాలు
Comments
Please login to add a commentAdd a comment