followers attack
-
YSRCP నేతలపై కత్తులతో దాడిచేసిన జేసీ వర్గీయులు
-
ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తల దాడి
-
పోలీసులపై టీఆర్ఎస్ జడ్పీటీసీ అనుచరుల దాడి
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం లింగాపూర్ గామంలో టీఆర్ఎస్ వర్గీయులు పోలీసులుపై అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడికి తెగపడ్డారు. కడెం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అన్న భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోస్టుమార్టం లేకుండానే ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఖననం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కడెం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త పెద్దది కావటంతో శ్రీనివాసరెడ్డి అనుచరులు ఏఎస్ఐ సహా హోంగార్డుపై దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డితో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: Hyderabad: హైటెక్స్‌లో రేపు 40 వేల మందికి టీకాలు -
జేసీ బ్రదర్స్ అనుచరులపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన జేసీ బ్రదర్స్ అనుచరులపై కేసు నమోదయ్యింది. నిన్న మద్యం మత్తులో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ వద్ద హంగామా సృష్టించిన జేసీ బ్రదర్స్ అనుచరులు.. ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. జేసీ అనుచరులు 26 మందిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాన్స్‌కో కార్యాలయంలో విందు పార్టీ ఏర్పాటు చేసి గొడవకు కారణమైన ఇద్దరు ఉద్యోగులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిన్న అసలేం జరిగిందంటే.. తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్‌కుమార్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్‌చైర్‌పర్సన్ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్‌కుమార్ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వెళ్లి మద్యం తాగారు. వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్ సబ్ స్టేషన్లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్‌కుమార్ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు. చదవండి: పాపం చిన్నారి.. ఊయలే ఉరితాడై .. భార్యపై అనుమానం.. తెల్లవారు జామునే నిద్రలేచి.. -
మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుల అరాచకాలు ఆగడం లేదు. నడిరోడ్డుపై ఎమ్మెల్యే అనుచరుడు చేసిన దాష్టీకాన్ని తట్టుకోలేక ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం విశాఖలో చోటు చేసుకుంది. బాధితురాలి కొడుకు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు. వివరాలు.. విశాఖలోని పెదవాల్తేరు ప్రాంతంలో ఎస్తేరు రాణి అనే మహిళ రోడ్డు పక్కన హోటల్ నడుపుతుంది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ అనే వ్యక్తి తరచూ సదరు బాధిత మహిళ హోటల్ వెళ్లేడమే కాకుండా.. అక్కడ హోటల్ కొనసాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని బెదిరించేవాడు. అంతేగాక తనతో సన్నిహితంగా ఉండకపోతే లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్టు ఎస్తేరు రాణి పై తప్పుడు కేసు పెడతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రం కూడా బాధితురాలిని తనతోనే ఉండాలని బెదిరించాడు. అంతేగాక నడి రోడ్డుపైనే ఆమెపై వచక్షణంగా దాడికి తెగబడ్డాడు. దీంతో జరిగిన ఈ అవమానం తట్టుకోలేక సదరు బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే కింగ్ జార్జీఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె భావనగర్ వార్డులో చికిత్స పొందుతోంది ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై బాధితురాలి కొడుకు నరేష్ తన తల్లిపై జరిగిన దౌర్జన్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన ఈగల సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నరేష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అంతు చూస్తాం: పయ్యావుల అనుచరులు
‘పంచాయతీ విభజన కావాలంటూ గ్రామ సభలో ఎవరైనా ఒప్పుకుంటే అంతుచూస్తాం... షావుకారికి వ్యతిరేకంగా మాట్లాడినా మీ ప్రాణాలు గాల్లో కలుస్తాయ్’ అంటూ రెండు రోజులుగా ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద కౌకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పంచాయతీ విభజనను అడ్డుకుంటూ ప్రజలు నోరు మెదపకుండా పయ్యావుల అనుచరులు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు పైబడినా.. ఇంకా ఈ ప్రాంతాలు భూస్వాముల కబంధహస్తాల్లోనే చిక్కుకున్నాయనేందుకు ఇంతకన్న నిదర్శనం ఏం కావాలి. ఇక్కడ వారు చెప్పిందే వేదం. వారి మాటను బేఖాతరు చేస్తే ఎంతటికైనా తెగిస్తారు. పయ్యావుల సోదరులు సాగిస్తున్న అరాచకాలతో కౌకుంట్ల పంచాయతీ ప్రజలు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద కౌకుంట్ల గ్రామానికి రక్త చరిత్రే ఉంది. ఇక్కడ భూస్వాములదే రాజ్యం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై అభిమానంతో పెద్ద కౌకుంట్ల పంచాయతీలోని వై.రాంపురం గ్రామంలో సూరయ్య అనే వ్యక్తి తన ఇంటిపై కాంగ్రెస్ జెండా కట్టాడు. ఈ విషయాన్ని పయ్యావుల సోదరులు అప్పట్లో జీర్ణించుకోలేకపోయారు. వారి కనుసన్నల్లోనే సూరయ్యను అత్యంత దారుణంగా పెట్రోలు పోసి సజీవ దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతోపాటు వైఎస్సార్ సీపీకి ఓటు వేశారన్న నెపంతో కౌకుంట్ల గ్రామంలోని దళితులపై విచక్షణారహితంగా పయ్యావుల అనుచరులు దాడులకు తెగబడ్డారు. దీని వెనుక కూడా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలోనే వారి కబంధ హస్తాల నుంచి విముక్తి కోరుకుంటూ పెద్ద కౌకుంట్ల పంచాయతీ విభజనకు ప్రజలు పట్టుబట్టారు. అడుగడుగునా అడ్డంకులు పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మొత్తంగా 7,118 జనాభా ఉంది. 5,500 మంది ఓటర్లు ఉన్నారు. భూస్వాముల అరాచకాలను భరించలేక పెద్ద కౌకుంట్ల పంచాయతీని విభజన చేయాలంటూ గత ఏడాది ప్రభుత్వాన్ని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు అప్పట్లో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాతపూర్వకంగా అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై 2019, సెప్టెంబర్ 30న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామ సభను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే కేశవ్ ప్రమేయంతో అనచరులు గందరగోళాన్ని సృష్టించి అభిప్రాయాలను వెల్లడించకుండా ప్రజలను అడ్డుకున్నారు. పంచాయతీ విభజనకు అనుకూలంగా ఎవరూ చేతులెత్తకుండా పయ్యావుల గుండాలు పహారా కాశారు. అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి, నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. దీనిపై విచారణ అనంతరం ఈ నెల 30న మరోసారి అభిప్రాయ సేకరణకు గ్రామసభ ఏర్పాటు చేయాలంటూ అధికారులను కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. పంచాయతీ విభజన జరిగితే తమ ఓటు బ్యాంక్‌కు దెబ్బపడడంతో పాటు, ఆయా గ్రామాల్లో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని భావించిన పయ్యావుల వర్గం మరోమారు గ్రామసభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రెండు రోజులుగా పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి చీరలు, మద్యం బాటిళ్లను బలవంతంగా అంటగట్టి విభజనకు అనుకూలంగా చేతులెత్తితే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చాలామంది ఊళ్లు వదులుతున్నారు పంచాయతీ విభజన జరగకుండా పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు అడ్డుపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి విభజనకు వ్యతిరేకంగా చేతులెత్తాలని భయపెడుతున్నారు. దీంతో చాలా మంది ఊళ్లు వదిలి వెళుతున్నారు. – సిద్దారెడ్డి, కౌకుంట్ల పంచాయతీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు గ్రామంలో ప్రజలను పయ్యావుల కేశవ్ అనుచరులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. డబ్బు, మందు బాటిళ్లు, చీరలు బలవంతంగా ప్రజలకు అంటగట్టి, పంచాయతీ విభజనకు వ్యతిరేకంగా చేతులు ఎత్తాలని చెబుతున్నారు. – వసంతమ్మ, కౌకుంట్ల ధైర్యంగా ముందుకు రండి కౌకుంట్ల భూస్వాముల అరాచక పాలనకు స్వస్తి పలకడానికి పంచాయతీ ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలి. పంచాయతీ విభజనకు సంబంధించి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్త పరచాలి. చీరలు, డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురికావద్దు. – అశోక్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాకెట్ల -
ఎమ్మెల్యే చెవిరెడ్డి హత్యకు టీడీపీ కుట్ర
-
నా హత్యకు టీడీపీ నేతల రెక్కీ!
తిరుపతి రూరల్: తన హత్యకు టీడీపీ నేతలు రెక్కీ నిర్వహించారని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. తిరుపతి తుమ్మలగుంటలో మంగళవారం సాయంత్రం ఆయన.. నిందితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాత్తు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి.. పులివర్తి నాని సహకారంతోనే ఇద్దరు రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఓటమి భయంతోనే తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నేరచరిత్ర కలిగిన ఆ ఇద్దరికి రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి డ్రైవర్ల ముసుగులో తమ వద్దకు పంపారని, నెల రోజులుగా వారు తనతో పాటు, తన కుటుంబ సభ్యుల కదలికలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పులివర్తి నానికి చేరవేస్తున్నారని చెప్పారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టి వారిని పట్టుకుని ఆరా తీయగా.. సుపారీ విషయాన్ని బయటపెట్టినట్టు చెవిరెడ్డి చెప్పారు. మొదటి దశలో ఇల్లు, ఆఫీసుకు సంబంధించి నిఘా పెట్టడంతో పాటు, తనను ఎవరెవరు కలుస్తున్నారు? మా కుటుంబ సభ్యులు ఎప్పుడు, ఎక్కడికి, ఏ దారిలో వెళ్తారు? ఎప్పుడొస్తారు? తదితర సమాచారాన్ని వారు సేకరిస్తున్నట్లు తెలిపారు. సమయాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో చెబుతామని నాని అనుచరులు తమకు ఆదేశాలిచ్చారని, నాని సహకారంతోనే తాము రెక్కీ నిర్వహించినట్టు నిందితులు.. చిత్తూరు పండ్రంపల్లికి చెందిన నాగభూషణం, సిసింద్రీలు మంగళవారం తుమ్మలగుంటలో మీడియాతో చెప్పారు. విద్వేషాలు, కక్షతో వ్యవహరించడం బాధాకరం శ్రీవారు కొలువైన తిరుపతిలో రెక్కీలు, హత్యలు వంటి సంస్కృతి లేదని చెవిరెడ్డి చెప్పారు. రాజకీయల్లో స్నేహపూర్వక పోటీ ఉండాలే తప్ప.. విద్వేషాలతో వ్యక్తిగత కక్షతో వ్యవహరించటం బాధకరమన్నారు. నిందితులను చెవిరెడ్డి అర్బన్ ఎస్పీకి అప్పగించి, తమకు రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. కాగా, తనకు భద్రతను పెంచాలని ఇటీవల పోలీసులకు చెవిరెడ్డి వినతిపత్రం ఇచ్చినా ఇప్పటికీ స్పందించక పోవడం గమనార్హం. ఇప్పటికైనా చెవిరెడ్డికి రక్షణ కల్పించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల దాష్టికం
-
మోహన్‌రెడ్డి బంధువుల వీరంగం
కరీంనగర్: అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో నిందితుడైన ఏఎస్సై మోహన్‌రెడ్డి కొడుకు, బంధువులు, అనుచరులు గురువారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో వీరంగం సృష్టించారు. వారించబోరుున న్యాయవాదులను దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. న్యాయవాదులంతా ఐక్యంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయి. మోహన్‌రెడ్డితోపాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న 11 మంది నిందితులను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. విషయం తెలిసిన అతని బంధువులు కోర్టు వద్దకు వచ్చారు. పైఅంతస్తులో ఎవరో ఫొటోలు తీస్తున్నారంటూ మోహన్‌రెడ్డి భార్య లతతోపాటు వారి బంధువులు గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న ఆయన కుమారుడు అక్షయ్‌రెడ్డి, తమ్ముడు మహేందర్‌రెడ్డి, అనుచరుడు బల్వీందర్‌సింగ్ ‘ఎవడురా.. ఇక్కడ పోటోలు తీసింది’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మొదటి అంతస్తులో ఉన్న న్యాయవాదులు పులియాల వేణుగోపాల్‌రెడ్డి, సిరికొండ శ్రీధర్‌రావు, గౌరు రాజిరెడ్డి, ఆవునూరి అశోక్‌కుమార్, సిహెచ్.ప్రదీప్కుమార్రాజు వారిని అడ్డుకొని ఎవరైనా ఫొటోలు తీస్తే న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని, విధులకు భంగం కలిగేలా కోర్టు భవనంలో వ్యవహరించరాదని సూచించారు. ఈ క్రమంలో న్యాయవాదులపై తీవ్రపదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించారు. దీంతో న్యాయవాదులకు, మోహన్‌రెడ్డి అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. కోర్టు అవరణలో అరగంటసేపు తీవ్రఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మోహన్‌రెడ్డి తరఫు వారిని బయటకు పంపించారు. ఈ దాడిలో న్యాయవాదుల విలువైన వస్తువులు, సెల్ఫోన్లు కింద పడి పగిలిపోయాయి. దీంతో న్యాయవాదులు నిరసనకు దిగారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.రఘునందన్‌రావు టూటౌన్ సీఐకి సమాచారం అందించగా వెంటనే వచ్చి ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఎస్కార్ట్ పోలీసుల ఉదాసీనత కోర్టుకు హాజరైన ప్రతిసారి ఎస్కార్ట్ పోలీసులు మోహన్‌రెడ్డి, అతడి అనుచరులు పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిందితుల బంధువులు, అనుచరులు ఎంతమంది వచ్చినా కోర్టు అనుమతి లేకుం డానే విచ్చలవిడిగా మాట్లాడుకోవడానికి స్వేచ్ఛనిస్తున్నారు. మోహన్‌రెడ్డి అనుచరులు కోర్టులోనే ఇంత వీరంగం చేస్తున్నారంటే బయట బాధితుల ఎలా ప్రవర్తిస్తున్నారోనని పలువురు చర్చించుకున్నారు. ఎస్పీతో మాట్లాడతా : జిల్లా జడ్జి నాగమారుతిశర్మ న్యాయవాదులపై జరిగిన దాడిగురించి బార్ అసోసియేషన్ అధ్వర్యంలో జిల్లా కోర్టులో ఉన్న జిల్లా జడ్జి నాగమారుతిశర్మకు వివరించారు. ఎస్పీతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూ స్తామని ఆయన న్యాయవాదులతో అన్నారు. కాగా, ఈ ఘటనపై న్యాయవాది ఘంటా సతీష్మోహన్కుమార్ టూటౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, మోహన్‌రెడ్డితో పాటు అతడి అనుచరుల రిమాండ్‌ను జడ్జీ ఈనెల 13 వరకు పొడగించారు. -
ఏఎస్ఐ సోదరుడు, కుమారుడి వీరంగం
-
మోహన్‌రెడ్డి సోదరుడు, కుమారుడి వీరంగం
కరీంనగర్: అక్రమవడ్డీ వ్యాపారాలకు పాల్పడ్డ కేసులో నిందితుడు ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. మోహన్ రెడ్డి తనయుడు అక్షయ్‌రెడ్డి, సోదరుడు కలిసి అడ్వకేట్‌తో పాటు మీడియా ప్రతినిదిపై చేయి చేసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. జైలు శిక్ష అనుభవిస్తున్న మోహన్‌రెడ్డిని కరీంనగర్ ఏసీబీ పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసుల కథనం ప్రకారం... కోర్టులో హాజరు పరచడానికి తీసుకొచ్చిన ఎఎస్సై మోహన్‌రెడ్డిని ఫొటోలు తీస్తున్నారన్న కారణంగా ఎఎస్సై కుమారుడు, సోదరుడు కలిసి అడ్వకేట్‌తో పాటు మీడియా ప్రతినిదిపై దాడికి యత్నించి వారిపై చేయి చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన న్యాయవాదులు వారిని ప్రతిఘటించి ఎదురుదాడికి దిగారు. ఎస్సై అనుచరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆయనను తమ వాహనంలో పోలీసులు తిరిగి జైలుగు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.