
మోహన్‌రెడ్డి సోదరుడు, కుమారుడి వీరంగం
అక్రమవడ్డీ వ్యాపారాలకు పాల్పడ్డ కేసులో నిందితుడు ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు.
కరీంనగర్: అక్రమవడ్డీ వ్యాపారాలకు పాల్పడ్డ కేసులో నిందితుడు ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. మోహన్ రెడ్డి తనయుడు అక్షయ్‌రెడ్డి, సోదరుడు కలిసి అడ్వకేట్తో పాటు మీడియా ప్రతినిదిపై చేయి చేసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. జైలు శిక్ష అనుభవిస్తున్న మోహన్‌రెడ్డిని కరీంనగర్ ఏసీబీ పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.
పోలీసుల కథనం ప్రకారం... కోర్టులో హాజరు పరచడానికి తీసుకొచ్చిన ఎఎస్సై మోహన్రెడ్డిని ఫొటోలు తీస్తున్నారన్న కారణంగా ఎఎస్సై కుమారుడు, సోదరుడు కలిసి అడ్వకేట్తో పాటు మీడియా ప్రతినిదిపై దాడికి యత్నించి వారిపై చేయి చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన న్యాయవాదులు వారిని ప్రతిఘటించి ఎదురుదాడికి దిగారు. ఎస్సై అనుచరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆయనను తమ వాహనంలో పోలీసులు తిరిగి జైలుగు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.