karimnagar court
-
బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్..
సాక్షి కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు కరీంనగర్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా ఈ నెల 17 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. దీంతో ఆ ఐదుగురిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. మరో 11 మంది పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఉద్యోగ బదిలీలకు సంబంధించిన 317 జీవోను సవరించాలని ఆదివారం సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 10 గంటల తరువాత ఎంపీ కార్యాలయం బద్దలు కొట్టి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్ శివారులోని మానకొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆయన అక్కడే దీక్షకు దిగారు. సోమవారం ఉదయం అక్కడి నుంచి కరీంనగర్‌లోని కమిషనరేట్ కమాండ్ సెంటర్ (సీటీసీ)కు సంజయ్‌ను తరలించారు. మధ్యాహ్నం 1.45 తరువాత కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా సంజయ్‌పై గతంలోని కేసులను చూపించడాన్ని ఆయన తరఫు లాయర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాగా, సంజయ్ తరఫు న్యాయవాదులు నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. సీటీసీ దగ్గర ఉద్రిక్తత సంజయ్ సీటీసీలో ఉన్నారని తెలుసుకొని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టారు. కొందరిని అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్ హైవేపై కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. దగ్గరుండి పర్యవేక్షించిన ఐజీ నాగిరెడ్డి కోవిడ్ రూల్స్ ఉల్లంఘన, పోలీసులపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించినందుకే ఎంపీ సంజయ్‌తో కలిపి మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని మీడియాతో సీపీ సత్యనారాయణ చెప్పారు. ఏ పార్టీ వారైనా నిబంధనలు ఉల్లంఘిస్తే హైకోర్టు, కేంద్ర–రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, సంజయ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో ఆదివారం రాత్రి నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి కరీంనగర్ చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పరిణామాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. 16 మంది నిందితులు ఈ కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా చూపించారు. వీరిలో ఏ1గా ఎంపీ సంజయ్, ఏ3 పెద్దపల్లి జితేందర్, ఏ8 పుప్పాల రఘు, ఏ11 కచ్చు రవి కార్పొరేటర్, ఏ13 మర్రి సతీశ్లను జిల్లా జైలుకు తరలించారు. ఏ2 గంగాడి కృష్ణారెడ్డి, ఏ4 ఉప్పరపల్లి శ్రీనివాస్, ఏ5 వాసుదేవ్, ఏ6 రాపర్తి ప్రసాద్, ఏ7 అజ్మీరా హరినాయక్, ఏ9 శీలం శ్రీనివాస్, ఏ10 బొడిగె శోభ, ఏ12 బోయినపల్లి ప్రవీణ్‌రావు, ఏ14 దుబ్బాల శ్రీను, ఏ15 శ్రీకాంత్ నాయక్, ఏ16 కటకం లోకేశ్ పరారీలో ఉన్నారని రిమాండ్ షీట్లో తెలిపారు. బండిపై పెట్టిన సెక్షన్లు ఇవే! ఐపీసీ 147: అల్లర్లు చేసినందుకు (బెయిలబుల్), ఐపీసీ 188: విధులను అడ్డుకున్నందుకు (బెయిలబుల్), ఐపీసీ 341: విధులను అడ్డుకున్నందుకు (బెయిలబుల్), ఐపీసీ 149: అనధికారికంగా గుమిగూడినందుకు, ఐపీసీ 51(బి) డిజాస్టర్ మెనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కేసులు నమోదు చేశారు. సంజయ్‌పై 2012లో ఒకటి, 2017లో రెండు, 2018లో మూడు, 2019లో మూడు కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే? ‘కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న ఈ సమయంలో ర్యాలీలు, అనధికార, రాజకీయ, బహిరంగ సమావేశాలకు అనుమతి లేకున్నా చైతన్యపురిలోని ఎంపీ కార్యాయంలో సజయ్ దీక్షను చేపట్టారు. ఆయనకు మద్దతుగా వందలాది మంది కార్యకర్తలు వచ్చి గుమిగూడారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉండగా దీక్ష వద్దని సమాచారమిచ్చాం. అయితే సంజయ్ అనుచరుల్లో కొందరు పోలీసు వాహనాన్ని (టీఎస్ 09 పీఏ 3738)ను ధ్వంసం చేసి దాదాపు రూ. 20 వేలు నష్టం కలిగించారు. అరెస్టు సమయంలో పోలీసులను కొట్టి కుర్చీలతో దాడికి దిగారు’అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. -
అనుమానాస్పద మృతి: కోర్టు ఎదుట డ్రైనేజీలో..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని జిల్లా కోర్టు భవనాల సముదాయం ఎదుట డ్రైనేజీలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రితిరాజ్, కరీంనగర్ టౌన్ ఏసీపీ అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం లభ్యమైన చోట సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఉరి వేసి హత్య చేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. టూటౌన్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ వివరాలు తెలియకపోవడంతో ఫొటోలు, గుర్తులు సోషల్‌మీడియాలో పోస్టు చేసి ఆరా తీస్తున్నారు. ఘటనలో ఇద్దరి పాత్ర..? జిల్లా జడ్జి భవనం ప్రాంగణం ఎదుట గల సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5గంటల ప్రాంతంలో మృతురాలు రోడ్డుపై తిరిగినట్లు రికార్డయినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి బైక్‌పై మరోవ్యక్తిని దించి వెళ్లడం, ఆ వ్యక్తి మహిళ వద్దకు వెళ్లడం సీసీ పుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా మహిళ మృతిలో ఇద్దరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం కోర్టు ఎదురుగా ఉన్న దుకాణాల్లో సీసీ పుటేజీలను పరిశీలించారు. -
కరీంనగర్ కోర్టులో తుపాకీ కలకలం
కరీంనగర్ లీగల్: కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం తుపాకీ కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కోర్టు ఎస్కార్ట్ కానిస్టేబుల్ మహేష్ విధి నిర్వహణలో భాగంగా కరీంనగర్ జిల్లా కోర్టుకు హాజరయ్యాడు. అప్పటికే విరేచనాలతో బాధ పడుతున్న ఆయన మధ్యాహ్నం సమయంలో అవసరాలు తీర్చుకోవడానికి కోర్టు ఆవరణలోని పబ్లిక్ టాయిలెట్స్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న కిటికీపై తన సర్వీస్ తుపాకీని ఉంచాడు. అదే సమయంలో కోర్టు హాలు నుంచి పిలుపురావడంతో తుపాకీ తీసుకోవడం మరిచిపోయాడు. అదే సమయంలో టాయిలెట్‌కు వెళ్లిన టైపిస్ట్ సిరాజ్ తుపాకీని గమనించి.. న్యాయవాది అశోక్‌కుమార్‌కు విషయం చెప్పగా.. ఆయన 100కు డయల్ చేశాడు. వెంటనే టూటౌన్ పోలీసుల ఆదేశాల మేరకు కోర్టు డ్యూటీలో కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీని స్వాధీనం చేసుకున్నాడు. -
కరీంనగర్ కోర్టులో కోడెలకు చుక్కెదురు
-
కోడెల శివప్రసాద్‌కు చుక్కెదురు
సాక్షి, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. జూన్ 18న కోర్టుకు హాజరుకావాలని స్పెషల్ మొబైల్ కోర్టు కోడెలను ఆదేశించింది. 2014 ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని ఓ టీవి ఛానల్ ఇంటర్వూలో తెలిపారు. దీంతో ఎన్నికల నిబంధలనను ఉల్లంఘించిన కోడెలను అనర్హులుగా ప్రకటించాలని కరీంనగర్‌కు చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోడెలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అవ్వడంతో, 2017 మార్చి 7న కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే కోడెల హైకోర్టును ఆశ్రయించి.. కోర్టుకు స్వయంగా హాజరుకాలేనని స్టే ఆర్టర్ తెచ్చుకున్నారు. దీంతో స్టే ఆర్డర్‌ను సవాల్ చేస్తూ, ఇటీవల సుప్రీంకోర్డు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భాస్కర్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వాదోపవాదనల అనంతరం జూన్ 18న కోడెల స్వయంగా కరీంనగర్ కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి రాజు ఆదేశించారు. -
ప్రధానోపాధ్యాయుడికి అరెస్ట్ వారెంట్
గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని మైలారం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చీటింగ్ కేసుకు సంబంధించి కరీంనగర్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ రావడంలో ఆ పాఠశాలలో అలజడి నెలకొంది. వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడిగా 2009లో మైలారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈయనపై ఒక చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, వాయిదా ప్రకారం కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసిందని పోలీసులు తెలిపారు. ఈనెల 6తో గడువు ముగుస్తుండడంతో సోమవారం ఎస్సై వంశీకృష్ణ పాఠశాలకు వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో లేవపోవడంతో.. మండల ఇన్చార్జి విద్యాధికారి లక్ష్మణ్‌రావును ఎస్సై ఫోన్లో సంప్రదించగా పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిపై ఎంఈవో విచారణ చేపట్టారు. గత నెల 24 సాయంత్రం నుంచి 27 ఉదయం పూట పాఠశాలకు అధికారికంగా సెలవు తీసుకున్నారని తెలిపారు. సెలవులు ముగిసిన నుంచి తిరిగి పాఠశాలకు రావడం లేదని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, గ్రామస్తులు ఎంఈవోకు తెలిపారు. దీనిపై జిల్లా విద్యాధికారికి సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
కనిమొళిపై కేసు నమోదు చేయండి
సాక్షి, కరీంనగర్: తమిళనాడులోని డీఎంకే ఎంపీ కనిమొళిపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టు ఆదేశించింది. తిరుమల వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై 153ఏ, 153బి, 295ఏ, 298, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని త్రీ టౌన్ పోలీసులను అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. -
కోడెలకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుపై కరీంనగర్లో నమోదైన కేసులో హైకోర్టులో ఉపశమనం లభించింది. గతంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కరీంనగర్ స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు 2017 మార్చి8న సమన్లు జారీ చేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందని ఓ ప్రవేట్ టీవీ చానల్ ఇంటర్వ్యూలో కోడెల పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయేందుకు ఆయన ఏకంగా రూ.11.5 కోట్లు ఖర్చు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కరీంనగర్‌లోని వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి 2016 జూలై 11న కరీంనగర్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు హైకోర్టులో ఉపశమనం లభించింది. కోర్టు వాయిదా నేపద్యంలో కోడెల హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కరీంనగర్ కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోడెల కేసును కరీంనగర్ కోర్టు ఆగష్టు 22కు వాయిదా వేసింది. చదవండి: కోడెలకు కోర్టు సమన్లు -
‘వీణవంక’ కేసు: అనూహ్య తీర్పు
కరీంనగర్: తెలంగాణలో సంచలనం సృష్టించిన వీణవంక గ్యాంగ్ రేప్ కేసులో న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులు గొట్టె శ్రీనివాస్, ముద్దం అంజయ్యలకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగరాజు తీర్పు చెప్పారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు. మరో నిందితుడిని బాలనేరస్తుడిగా గుర్తించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై గతేడాది ఫిబ్రవరి 10న ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆకృత్యాన్ని సెల్ఫోన్లో వీడియో తీశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఫిబ్రవరి 24న పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీణవంక ఎస్సై కిరణ్, కానిస్టేబుల్ పరశురాములను అప్పట్లో సస్పెండ్ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ స్వయంగా జోక్యం చేసుకోవడంతో కేసు దర్యాప్తు వేగవంతంగా ముందుకు సాగింది. దోషులకు కోర్టు శిక్ష విధించడంతో బాధితురాలి తరపువారు హర్షం వ్యక్తం చేశారు. -
స్పీకర్ కోడెలకు కోర్టు సమన్లు
-
కోడెలకు కోర్టు సమన్లు
- ఏప్రిల్ 20న స్వయంగా హాజరుకండి - ఎన్నికల వ్యయం కేసులో కరీంనగర్ కోర్టు ఆదేశం కరీంనగర్, లీగల్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు కరీంనగర్ స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20న స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌లోని వావిలాలపల్లికి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి 2016 జూలై 11న కరీంనగర్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ‘‘2016 జూన్ 19న నేను ఒక తెలుగు టీవి న్యూస్ చానల్ చూస్తుండగా కోడెలకు సంబంధించిన కార్యక్రమం ప్రసారమైంది. అందులో భాగంగా ఎన్నికల్లో ఆయన ఖర్చుపెట్టిన వ్యయం గురించి ప్రస్తావన వచ్చింది. కోడెల మాట్లాడుతూ తాను 1983 మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రూ.30 వేలు మాత్రమే ఖర్చయిందని, ఆ మొత్తం కూడా గ్రామాల ప్రజల నుంచి చందాల రూపంలో వచ్చిందని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందని సదరు చానల్ ఇంటర్వూ్యలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయేందుకు ఆయన ఏకంగా రూ.11.5 కోట్లు ఎలా ఖర్చు చేశారు? ఎన్నికల సంఘం అనుమతించిన వ్యయ పరిమితి కంటే దాదాపు 40 రెట్లు ఎక్కువగా ఖర్చు చేశారు! ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలన్నింటినీ ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. మరి ఇలా ఇంత అధిక మొత్తంలో ఖర్చు చేశారంటే ఓటర్లను, అధికారులను ఆయన మభ్యపెట్టారా? ఈ అంశాన్ని దర్యాప్తు చేయాలి’’ అని భాస్కర్‌రెడ్డి తన ఫిర్యాదులో కోర్టును కోరారు. దీనిపై అంతకు ముందు ఆయన కరీంనగర్ త్రీ టౌన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన న్యాయస్థానానికి కేసును కోర్టు బదిలీ చేసింది. న్యాయపరిధిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో భాస్కర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు వివరాలను పరిశీలించిన హైకోర్టు, కేసును విచారించాలని చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ సీసీ నెంబరు 01/2017గా కేసు నమోదు చేసి ఎన్నికల వివాదాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరీంనగర్ స్పెషల్ జుడిషియల్ మేజిస్ట్రేట్ (మొబైల్ కోర్టు) కోర్టుకు కేసును బదిలీ చేసింది. -
స్పీకర్ కోడెలపై కరీంనగర్ కోర్టులో కేసు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. 2014 ఎన్నికల్లో తాను ఎన్నిక కావటానికి రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఇంత మొత్తం ఖర్చు చేయటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఈ విషయమై కోడెలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు న్యాయస్థానం భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలతో మంగళవారం స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ వివిధ సెక్షన్లు 171E, 171F, 171B, 171H, 171i, 200 IPCల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఏప్రిల్ 20న కరీంనగర్ కోర్టుకు హాజరుకావాలని కోడెల శివప్రసాదరావుకు సమన్లు జారీ చేశారు. -
కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు
-
కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు
కరీంనగర్ : అత్యాచారం, హత్య కేసులో కరీంనగర్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం అనంతరం హత్య చేసిన నిందితుడి జక్కు వెంకటస్వామికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. కాటారం మండలం దామరకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాటారం మండలం దామెరకుంటలో ఈ ఏడాది పిబ్రవరి 28న నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన జక్కుల వెంకటస్వామి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు అనంతరం చిన్నారి దారుణంగా హతమార్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టు ముందు హజరు పర్చారు. కేసు విచారణ పూర్తి కావడంతో...కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి సురేష్ నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడించారు. కరీంనగర్ కోర్టులో ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. -
వరకట్నం కేసులో భర్తకు జైలు
కమాన్‌చౌరస్తా : అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్ స్పెషల్ మేజిస్ట్రేట్(ఎక్సైజ్) శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన ప్రశాంతి వివాహం ఆగస్టు 6, 2009న చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన వేణుగోపాల్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ.2లక్షల నగదు, అనుకున్న ఇతర లాంఛనాల ప్రకారం వివాహం చేశారు. కొద్ది రోజుల తర్వాత అదనంగా రూ.3 లక్షలు కావాలని వేణుగోపాల్, సోదరులు, సోదరి, తల్లి వేధించసాగారు. వేణుగోపాల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నారని ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయితో పెళ్లి చేస్తామని వారు భయపెట్టసాగారు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా మంచిగా చూసుకుంటామని చెప్పినా.. వారిలో మార్పు రాలేదు. ఇంతలో ప్రశాంతికి కుమారుడు జన్మించగా.. ఆమెను పుట్టింటి నుంచి తీసుకురాలేదు. దీంతో ఆమె ఆగస్టు 20, 2011న కరీంనగర్ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ సువర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితుడైన వేణుగోపాల్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
మోహన్‌రెడ్డి బంధువుల వీరంగం
కరీంనగర్: అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో నిందితుడైన ఏఎస్సై మోహన్‌రెడ్డి కొడుకు, బంధువులు, అనుచరులు గురువారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో వీరంగం సృష్టించారు. వారించబోరుున న్యాయవాదులను దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. న్యాయవాదులంతా ఐక్యంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయి. మోహన్‌రెడ్డితోపాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న 11 మంది నిందితులను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. విషయం తెలిసిన అతని బంధువులు కోర్టు వద్దకు వచ్చారు. పైఅంతస్తులో ఎవరో ఫొటోలు తీస్తున్నారంటూ మోహన్‌రెడ్డి భార్య లతతోపాటు వారి బంధువులు గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న ఆయన కుమారుడు అక్షయ్‌రెడ్డి, తమ్ముడు మహేందర్‌రెడ్డి, అనుచరుడు బల్వీందర్‌సింగ్ ‘ఎవడురా.. ఇక్కడ పోటోలు తీసింది’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మొదటి అంతస్తులో ఉన్న న్యాయవాదులు పులియాల వేణుగోపాల్‌రెడ్డి, సిరికొండ శ్రీధర్‌రావు, గౌరు రాజిరెడ్డి, ఆవునూరి అశోక్‌కుమార్, సిహెచ్.ప్రదీప్కుమార్రాజు వారిని అడ్డుకొని ఎవరైనా ఫొటోలు తీస్తే న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని, విధులకు భంగం కలిగేలా కోర్టు భవనంలో వ్యవహరించరాదని సూచించారు. ఈ క్రమంలో న్యాయవాదులపై తీవ్రపదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించారు. దీంతో న్యాయవాదులకు, మోహన్‌రెడ్డి అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. కోర్టు అవరణలో అరగంటసేపు తీవ్రఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మోహన్‌రెడ్డి తరఫు వారిని బయటకు పంపించారు. ఈ దాడిలో న్యాయవాదుల విలువైన వస్తువులు, సెల్ఫోన్లు కింద పడి పగిలిపోయాయి. దీంతో న్యాయవాదులు నిరసనకు దిగారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.రఘునందన్‌రావు టూటౌన్ సీఐకి సమాచారం అందించగా వెంటనే వచ్చి ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఎస్కార్ట్ పోలీసుల ఉదాసీనత కోర్టుకు హాజరైన ప్రతిసారి ఎస్కార్ట్ పోలీసులు మోహన్‌రెడ్డి, అతడి అనుచరులు పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిందితుల బంధువులు, అనుచరులు ఎంతమంది వచ్చినా కోర్టు అనుమతి లేకుం డానే విచ్చలవిడిగా మాట్లాడుకోవడానికి స్వేచ్ఛనిస్తున్నారు. మోహన్‌రెడ్డి అనుచరులు కోర్టులోనే ఇంత వీరంగం చేస్తున్నారంటే బయట బాధితుల ఎలా ప్రవర్తిస్తున్నారోనని పలువురు చర్చించుకున్నారు. ఎస్పీతో మాట్లాడతా : జిల్లా జడ్జి నాగమారుతిశర్మ న్యాయవాదులపై జరిగిన దాడిగురించి బార్ అసోసియేషన్ అధ్వర్యంలో జిల్లా కోర్టులో ఉన్న జిల్లా జడ్జి నాగమారుతిశర్మకు వివరించారు. ఎస్పీతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూ స్తామని ఆయన న్యాయవాదులతో అన్నారు. కాగా, ఈ ఘటనపై న్యాయవాది ఘంటా సతీష్మోహన్కుమార్ టూటౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, మోహన్‌రెడ్డితో పాటు అతడి అనుచరుల రిమాండ్‌ను జడ్జీ ఈనెల 13 వరకు పొడగించారు. -
ఏఎస్ఐ సోదరుడు, కుమారుడి వీరంగం
-
మోహన్‌రెడ్డి సోదరుడు, కుమారుడి వీరంగం
కరీంనగర్: అక్రమవడ్డీ వ్యాపారాలకు పాల్పడ్డ కేసులో నిందితుడు ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. మోహన్ రెడ్డి తనయుడు అక్షయ్‌రెడ్డి, సోదరుడు కలిసి అడ్వకేట్‌తో పాటు మీడియా ప్రతినిదిపై చేయి చేసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. జైలు శిక్ష అనుభవిస్తున్న మోహన్‌రెడ్డిని కరీంనగర్ ఏసీబీ పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసుల కథనం ప్రకారం... కోర్టులో హాజరు పరచడానికి తీసుకొచ్చిన ఎఎస్సై మోహన్‌రెడ్డిని ఫొటోలు తీస్తున్నారన్న కారణంగా ఎఎస్సై కుమారుడు, సోదరుడు కలిసి అడ్వకేట్‌తో పాటు మీడియా ప్రతినిదిపై దాడికి యత్నించి వారిపై చేయి చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన న్యాయవాదులు వారిని ప్రతిఘటించి ఎదురుదాడికి దిగారు. ఎస్సై అనుచరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆయనను తమ వాహనంలో పోలీసులు తిరిగి జైలుగు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బెయిల్ తిరస్కరణ
కరీంనగర్ : ఏఎస్ఐ మోహన్ రెడ్డికి కరీంనగర్ జిల్లా కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కావాలంటూ ఏఎస్సై దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారణ చేసిన అనంతరం కరీంనగర్ జిల్లా కోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేస్తే మోహన్ రెడ్డి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు. వడ్డీ వ్యాపారిగా మారి సామాన్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఏఎస్సై ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. ఏఎస్సై మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులు పరశురాం గౌడ్, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వర్ల కోసం సీఐడీ బృందాలు గాలిస్తున్నాయి. సీఐడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది.