స్పీకర్‌ కోడెలపై కరీంనగర్‌ కోర్టులో కేసు | case filed in karimnagar court against kodela sivaprasadarao | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ కోడెలపై కరీంనగర్‌ కోర్టులో కేసు

Published Tue, Mar 7 2017 4:26 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

స్పీకర్‌ కోడెలపై కరీంనగర్‌ కోర్టులో కేసు - Sakshi

స్పీకర్‌ కోడెలపై కరీంనగర్‌ కోర్టులో కేసు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. 2014 ఎన్నికల్లో తాను ఎన్నిక కావటానికి రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఇంత మొత్తం ఖర్చు చేయటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఈ విషయమై కోడెలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు.
 
ఈ మేరకు న్యాయస్థానం భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్‌ జుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలతో మంగళవారం స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ వివిధ సెక్షన్లు 171E, 171F, 171B, 171H, 171i, 200 IPCల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఏప్రిల్ 20న కరీంనగర్ కోర్టుకు హాజరుకావాలని కోడెల శివప్రసాదరావుకు సమన్లు జారీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement