వరకట్నం కేసులో భర్తకు జైలు | husband jail doury case | Sakshi
Sakshi News home page

వరకట్నం కేసులో భర్తకు జైలు

Published Fri, Aug 12 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

husband jail doury case

కమాన్‌చౌరస్తా : అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్‌ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌(ఎక్సైజ్‌) శ్రీనివాస్‌ శుక్రవారం తీర్పునిచ్చారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన ప్రశాంతి వివాహం ఆగస్టు 6, 2009న చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన వేణుగోపాల్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ.2లక్షల నగదు, అనుకున్న ఇతర లాంఛనాల ప్రకారం వివాహం చేశారు. కొద్ది రోజుల తర్వాత అదనంగా రూ.3 లక్షలు కావాలని వేణుగోపాల్, సోదరులు, సోదరి, తల్లి వేధించసాగారు. వేణుగోపాల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం చేస్తున్నారని ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయితో పెళ్లి చేస్తామని వారు భయపెట్టసాగారు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా మంచిగా చూసుకుంటామని చెప్పినా.. వారిలో మార్పు రాలేదు. ఇంతలో ప్రశాంతికి కుమారుడు జన్మించగా.. ఆమెను పుట్టింటి నుంచి తీసుకురాలేదు. దీంతో ఆమె ఆగస్టు 20, 2011న కరీంనగర్‌ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ సువర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనివాస్‌ నిందితుడైన వేణుగోపాల్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement