doury
-
అనుమానాస్పదంగా మమత మృతి.. ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఏమైంది?
మైసూరు: భర్త, అత్తమామల ధన దాహానికి నిండు ప్రాణం బలైంది. కోటి ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన యువతి అర్ధాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. ఈ దారుణం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని హుల్లహళ్ళి గ్రామంలో జరిగింది. మమత (20) అనే వివాహిత యువతి మెట్టినింట వేధింపులతో అనుమానాస్పద రీతిలో శవమైంది. డబ్బు తేవాలని వేధింపులు వివరాలు.. 2021 మార్చిలో మమతకు, ప్రేమచంద్ర నాయకతో పెద్దలు పెళ్లి చేశారు. 30 గ్రాముల బంగారం, రూ. 80 వేల నగదు కట్నంగా ఇవ్వడంతో పాటు పెళ్ళి ఘనంగా జరిపించారు. కొన్ని నెలల తరువాత మమతకు వేధింపులు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భర్త ఆమెను కొట్టేవాడు. అత్త మామ కూడా కొడుక్కే వంతపాడేవారు తప్ప సర్దిచెప్పలేదు. మమత గర్భం దాల్చిందని తెలిసి బలవంతంగా అబార్షన్ చేయించారు. చవితి రోజున ఘోరం విషయం తెలుసుకున్న మమత తల్లిదండ్రులు కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లారు. తరువాత తప్పయిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో భర్త వెంట వెళ్లింది. ఏం జరిగిందో కానీ వినాయక చవితి రోజున ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. వెంటనే భర్త, అత్తమామ, ఇద్దరు ఆడపడుచులు ఇంటి నుంచి పారిపోయారు. తరువాత తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. ఈ నేపథ్యంలో భర్త, అత్తమామలు తన కుమార్తెను హత్య చేశారని మమత తండ్రి శుక్రవారంరోజున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హుల్లహళ్ళి పోలీసులు ప్రేమచంద్ర నాయకతో పాటు అతని తండ్రి శంకరనాయక, యశోద, అనుజ, ప్రేమ అనేవారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
పెళ్లి మండపం నుంచి వరుడు పరార్..
ఐదు లక్షల రూపాయల ఖర్చుతో వివాహ నిశ్చితార్థం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి రిసెష్షన్ సైతం బంధువుల హడావుడి మధ్య వైభవంగా జరిగింది. పెద్దల దీవెనలు, ఫొటోలు, వీడియోలు, సహచరుల డాన్స్ తదితర వాటితో కల్యాణమండపం వద్ద అర్ధరాత్రి వరకు కోలాహలం నెలకొంది. ముహుర్తానికి సమయం దగ్గరపడడంతో మంగళ వాయిద్యాలు మొదలయ్యాయి. ఇంతలోనే పెద్ద షాక్ పెళ్లికొడుకుతో పాటు అతని తల్లిదండ్రులు సైతం మండపం నుంచి మాయమయ్యారు. పెళ్లి ఆగిపోయింది. పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో జరిగిన సంఘటన సర్వత్రా చర్చినీయాంశంగా మారింది. సాక్షి, చిత్తూరు: ముందుగా నిర్ణయించిన ప్రకారం 50 సవర్ల బంగారం ఇవ్వలేదన్న కారణంతో మండపం నుంచి వరుడు పరారయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన జానకీరామన్. ఇతను విదేశాల్లో పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె శోభాలక్ష్మి(25)కి, చెన్నై ఎగ్మోర్కు చెందిన ప్రభాకరన్ కుమారుడు శరణ్‌కుమార్‌తో గత సెప్టెంబర్‌లో కోలాహలంగా నిశ్చితార్థం నిర్వహించారు. వివాహ నిశ్చితార్థం సమయంలో 50 సవర్ల బంగారంతో పాటు లక్ష నగదు ఇతర వస్తువులను కట్నంగా ఇవ్వాలని పెళ్లి కుమారుడి తరఫున డిమాండ్ చేశారు. కట్నం ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అంగీకరించడంతో జనవరి 21న రిసెప్షన్, 22న ముహుర్తంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం మనవాలనగర్‌లోని ప్రయివేటు కల్యాణమండపంలో రిసెప్షన్ జరిగింది. ఈ స్థితిలో ఆదివారం అర్ధరాత్రి ఇరు కుటుంబాల మధ్య కట్నం ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. మొదట 50 సవర్ల బంగారం ఇస్తామని చెప్పి, తీరా పెళ్లి సమయంలో 40 సవర్ల బంగారం మాత్రమే ఇవ్వడంపై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. మరో రెండు నెలల్లో పది సవర్ల బంగారం ఇస్తామని వధువు తరపు వారు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అందుకు వరుడి తరపు వారు అంగీకరించలేదు. దీంతో పెళ్లికి నిరాకరించిన వరుడు, అతని బంధువులు సోమవారం ఉదయం మూడు గంటలకు మండపం నుంచి వెళ్లిపోయారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆవేదన చెందారు. పెళ్లి కొడుకు ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉండడంతో మనవాలనగర్ పోలీసులను ఆశ్రయించారు. కట్నం తగ్గిందన్న సాకుతో మండపం నుంచి వరుడు పరారయ్యాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
వరకట్నం కేసులో భర్తకు జైలు
కమాన్‌చౌరస్తా : అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్ స్పెషల్ మేజిస్ట్రేట్(ఎక్సైజ్) శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన ప్రశాంతి వివాహం ఆగస్టు 6, 2009న చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన వేణుగోపాల్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ.2లక్షల నగదు, అనుకున్న ఇతర లాంఛనాల ప్రకారం వివాహం చేశారు. కొద్ది రోజుల తర్వాత అదనంగా రూ.3 లక్షలు కావాలని వేణుగోపాల్, సోదరులు, సోదరి, తల్లి వేధించసాగారు. వేణుగోపాల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నారని ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయితో పెళ్లి చేస్తామని వారు భయపెట్టసాగారు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా మంచిగా చూసుకుంటామని చెప్పినా.. వారిలో మార్పు రాలేదు. ఇంతలో ప్రశాంతికి కుమారుడు జన్మించగా.. ఆమెను పుట్టింటి నుంచి తీసుకురాలేదు. దీంతో ఆమె ఆగస్టు 20, 2011న కరీంనగర్ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ సువర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితుడైన వేణుగోపాల్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
కట్నం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీచం..
సాక్షి, బెంగళూరు: కట్నం కోసం తను కట్టుకున్న భార్య నగ్న చిత్రాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడమే కాక ఆ చిత్రాలతో కూడిన సీడీని ఆమె తండ్రికి పంపించాడు సాఫ్ట్ వేర్ ఇంజరీగ్ గా పనిచేస్తోన్న ఓ నీచుడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. కాసరగోడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల కిందట అతనికి చేర్తళ(కేరళ)కు చెందిన 20 ఏళ్ల యువతితో ఫేస్బుక్ స్నేహం కుందిరింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఏడాది కిందట గురువాయూర్ దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది నెలలకే పుట్టింటినుంచి కట్నం తీసుకురావాలంటూ భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడా నీచుడు. వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో క్రూరంగా మారిపోయిన భర్త.. గతంలో భార్యకు తెలియకుండా తీసి భద్రపరుచుకున్న ఆమె నగ్న చిత్రాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంతేకాక ఆ ఫొటోల సీడీని యువతి తండ్రికి పంపాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాసరగోడు పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు.