ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు కరీంనగర్ స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20న స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌లోని వావిలాలపల్లికి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి 2016 జూలై 11న కరీంనగర్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు.