సాక్షి, కరీంనగర్: తమిళనాడులోని డీఎంకే ఎంపీ కనిమొళిపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టు ఆదేశించింది. తిరుమల వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై 153ఏ, 153బి, 295ఏ, 298, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని త్రీ టౌన్ పోలీసులను అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment