ruling
-
తెలుగు ప్రజలపై ప్రభుత్వాల పిడుగులు
-
ఏడాదిలోనే ఎన్నో చేశాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే ఎన్నో అంశాల్లో రికార్డులు నెలకొల్పిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎక్స్‌లో ఆయన ఆదివారం సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. ఏడాది పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. ‘మీ సొంత ప్ర భుత్వం ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేను నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను.మొదటి సంవత్సరం వ్యవసాయ రుణా ల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో మీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. మన మహిళా సంక్షేమ పథకాలు, కుల గణన, పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. తెలంగాణ ప్రజలందరి నమ్మకానికి నా కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి తన సందేశంలో పలు అంశాలను ప్రస్తావించారుమహిళా సంక్షేమం: ఉచిత బస్సు, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్. రైతులు⇒ 25 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, రూ. 21,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ. ⇒ సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్. ⇒ రైతులకు 24/7 ఉచిత విద్యుత్. హౌసింగ్⇒ నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. యువతకు ఉద్యోగాలు⇒ ఒక్క ఏడాదిలో యువతకు55,000లకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రైవేట్‌లో లక్షల ఉ ద్యోగాలను సృష్టించాం. గత 12 ఏళ్లలో నిరుద్యోగిత రేటును అత్యల్ప స్థాయికి తెచ్చాం. ⇒ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. ⇒ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం. ⇒ యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం స్థాపన. ఆర్థిక వృద్ధి / పట్టణాభివృద్ధి⇒ గత తొమ్మిది నెలల్లో రెట్టింపు ఎఫ్‌డిఐల సాధన. గత 11 నెలల్లో మొత్తం పెట్టుబడులు 200 శాతానికి పైగా పెరిగాయి. ⇒ వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కొనేందుకు అర్బన్ రీ ఇమాజినేషన్ ప్రోగ్రామ్‌ను చేపట్టేందుకు భారతదేశంలో హైదరాబాద్‌ను మొదటి నగరంగా మార్చడం. ⇒ భారీ వృద్ధితోపాటు అత్యంత నివాసయోగ్యంగా మార్చేందుకు ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, రేడియల్ రోడ్లు, మెట్రో రైల్ రెండో దశ, భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టాం. కులాల సర్వే⇒ దేశంలోనే మొట్టమొదటి సమగ్ర కుల సర్వే ద్వారా తెలంగాణ పౌరుల నుంచి వివరాల సేకరణ ఇతర అంశాలు⇒ ట్రాన్స్‌జెండర్ మార్షల్స్ ద్వారా ట్రాఫిక్‌ను ని యంత్రించే భారతదేశపు మొదటి నగరంగా హైదరాబాద్ త్వరలో అవతరించబోతోంది. ⇒ ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పునరుద్ధరణ. ⇒ డిసెంబర్ 9న (సోమవారం) సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. -
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఎంత మార్పు ?
-
యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇటీవల హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందారు. దీంతో హామాస్‌ను ఎవరు నడిపిస్తారనే అంశంపై చర్చ జరగుతోంది. అయితే చీఫ్ లేకుండా.. దోహ కేంద్రంగా పాలక కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు హమాస్ వర్గాలు తెలిపాయి. మార్చిలో జరగనున్న ఎన్నికల వరకు దివంగత చీఫ్ యాహ్యా సిన్వార్‌కు వారసుడిని నియమించకూడదని హమాస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టెహ్రాన్‌లో రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య అనంతరం ఆగస్టులో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ హమాస్ గ్రూప్ నాయకత్వాన్ని తీసుకుంది. ఇక.. సిన్వార్ మృతికి ముందు.. గాజాలో ఉన్న ఆయనతో కమ్యూనికేట్ కావటంలో తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హమాస్ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.2017లో హమాస్ గ్రూప్ గాజా చీఫ్‌గా నియమించబడిన సిన్వార్.. జూలైలో హనియే హత్య అనంతరం హమాస్ గ్రూప్ మొత్తానికి చీఫ్‌గా నియమితులయ్యారు. గాజాకు ఖలీల్ అల్-హయ్యా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబరిన్, విదేశాలలో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఖలీద్ మెషాల్ చెందిన ప్రతినిధులతో పాలక కమిటీని రూపొందించినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ పాలక కమిటీలో హమాస్ షూరా సలహా మండలి అధిపతి మహమ్మద్ దర్విష్, పొలిటికల్ బ్యూరో కార్యదర్శి కూడా ఉన్నారు. అయితే.. వీరిని భద్రతా కారణాల దృష్ట్యా గుర్తించకపోవటం గమనార్హం. కమిటీలోని ప్రస్తుత సభ్యులందరూ ఖతార్‌లో ఉన్నారు. యుద్ధం, అసాధారణమైన పరిస్థితులలో దాడులు, భవిష్యత్తు ప్రణాళికలను నిర్వహించటంపై ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పాలక కమిటీకి అధికారం ఉంటుంది.చదవండి: ఇజ్రాయెల్ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ -
చంద్రబాబు పాలనపై పబ్లిక్ టాక్
-
టీడీపీ 100 రోజల పాలనపై ప్రజల రియాక్షన్
-
చంద్రబాబు చేతులెత్తేశాడా?.. అదన్నమాట సంగతి!
ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంటే ఆయన సర్వజ్ఞుడు అనే ప్రచారం జరుగుతుంటుంది. ఆయనకు ప్రపంచంలోని అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంటుంది అనే అభిప్రాయం ప్రబలింది. అందులోను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటివారి విషయంలో ఇక చెప్పనవసరం లేదు.ఆయన సీఎం హోదాలో ఏమి పలికినా అదో అద్భుతం అని ప్రచారం చేసే మీడియా ఉండడం ప్లస్ పాయింట్. అదే నేత గతంలో ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు కదా అనే ఆలోచన రావడానికి వీలులేదు. సీఎం అయి ఉండి అసంబంద్దంగా మాట్లాడుతున్నట్లు ఉందే అని ఏ అధికారి నోరు తెరిచే పరిస్థితి ఉండదు. చంద్రబాబు అదే వరసలో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్లిపోతుంటారు.2024 శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఆయన అభిప్రాయాలు మారిపోయిన వైనం గమనిస్తే నేతలు ఇంతగా మాట మార్చివేస్తారా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఏపీలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగితే చంద్రబాబుది దాదాపు ఏకపాత్రాభినయమే అని వేరే చెప్పనవసరం లేదు. ఆయా శాఖలకు సంబంధించి ఏ అధికారి ఎలాంటి నివేదిక ఇస్తున్నా, మద్యలోనే జోక్యం చేసుకుని అన్నిటిమీద ఒపినీయన్ ఇచ్చేస్తుంటారు. అవసరమైతే ఆదేశాలు కూడా వెలువడిపోతుంటాయి.ఒకప్పుడు జిల్లా కలెక్టర్ల సమావేశం అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మంచి, చెడు విశ్లేషణ జరిగేది. అధికారులు చర్చలలో పాల్గొనేవారు. కొందరైతే తమ భావాలను నిర్మొహమాటంగా చెప్పేవారు. అసలు జిల్లా కలెక్టర్ల సమావేశం అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రారంభోపన్యాసం, ముగింపు సందేశం ఇవ్వడానికి వచ్చేవారు. మధ్యలో అధికారులు స్వేచ్చగా చర్చలు జరిపేవారు.ప్రభుత్వానికి అవసరమైన సిఫారస్లు చేసేవారు. వాటిలో సీఎం ఏవైనా మార్పులు చేస్తే చేయవచ్చు. మంత్రులు సలహాలు ఇస్తే ఇవ్వవచ్చు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ముప్పై ఏళ్ల క్రితమే ఈ ట్రెండ్ మార్చేశారు. అన్ని తానై వ్యవహరించడం ఆరంభించారు. ప్రతి విషయంలోను అదికారులు చెప్పి, చెప్పకముందే తన సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం అనేది ఆనవాయితీగా అలవరచుకున్నారు. అధికారులు సైతం తమకు ఎందుకులే.. ఆయన చెప్పేదేదో వినిపోతే పోలా అనే పరిస్థితికి వచ్చేశారు. దోమలపై యుద్దం అన్నా, డ్రోన్లతో దోమలను కనిపెడతామని చెప్పినా, అమరావతిలో ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గించాలని ఆదేశాలు ఇస్తున్నానని అన్నా ఎవరూ నోరు మెదపలేరు.ఒకప్పుడు మీడియా అయినా ప్రశ్నలు అడిగేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక 2014లో ఆయన కలెక్టర్ల సమావేశంలో తమ పార్టీవారు చెప్పినట్లు అధికారులు వినాలని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఐదేళ్లపాటు అదే ప్రకారం విభజిత ఏపీని పాలించారు. అప్పుడు కనీసం కొంతమందైనా సీనియర్ నేతలు మంత్రులుగా ఉండేవారు. కానీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అత్యధిక శాతం మంది ఆయన కుమారుడు లోకేష్ అనుచరులే మంత్రులుగా ఉన్నారన్న భావన ఉంది. చంద్రబాబు కన్నా లోకేషే పవర్‌పుల్ అనే అభిప్రాయం నెలకొంది. వీరి వెనుక ఇద్దరు మాజీ పోలీసు అధికారుల హల్చల్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆ సంగతి పక్కనబెడితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆయా సందర్భాలలో వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలు గమనిస్తే, ఏపీని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్నారు కాబోలు అనిపిస్తుంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిపిన కలెక్టర్ల సమావేశంలో ప్రజల సంక్షేమం విషయంలో ప్రాంతం, కులం, మతం, పార్టీ వంటివాటిని చూడకుండా సమానంగా అమలు చేయాలని చెప్పారు. అలాగే ఆయన స్కీములన్నీ అమలు చేస్తుంటే, టీడీపీ మీడియా ఈనాడు, జ్యోతి వంటివి ఏదో రకంగా వంకలు పెడుతూ, అసత్యాలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసేవి. ఎలాగైతేనే ప్రజలు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సూపర్ సిక్స్‌కు ఆకర్షితులై పాలిచ్చే పాడి గేదెను వదలుకున్నట్లుగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను కూడా ఓడించుకున్నారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసి లబోదిబో అంటున్నారు. అది వేరే విషయం.ఇంతకీ చంద్రబాబు కలెక్టర్లకు ఏమి చెబుతున్నారు. తమది రాజకీయ పాలన అని, ఆ విషయాన్ని అధికారులు గమనించాలని స్పష్టం చేశారు. అంటే ఏమిటి దీని అర్దం! 2014 లో ఉన్న చంద్రబాబుకు, ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నదానికి తేడా ఏమీ లేదని, ఆయనలో మార్పేమీ రాలేదని తేటతెల్లమవుతోంది కదా! విపక్షంలో ఉన్నప్పుడు ఏమి అనేవారు! ప్రజల ఇళ్లనుంచి చెత్త తీసుకువెళ్లడానికి పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వం అని వైఎస్సార్సీపీపై ధ్వజమెత్తేవారు. అదెంతయా అంటే ఇంటికి మహా అయితే ఏభై నుంచి వంద రూపాయలు. ఆయనతో పాటు పవన్ కల్యాణ్ కూడా యుగళగీతం పాడేవారు.సీన్ కట్ చేస్తే పవన్ కల్యాణ్ పిఠాపురంలో చెత్త తీసుకువెళ్లడానికి జనం నుంచి ఇంకా ఎక్కువే వసూలు చేయాలని చెప్పారట. మరి అప్పుడు చెత్త ప్రభుత్వం అన్నారు కదా అని ఎవరైనా అడిగితే అనే సదేహం రావచ్చు. వైఎస్సార్‌సీపీవారు విమర్శలు చేస్తే చేయవచ్చు. దానిని పట్టించుకోకపోతే సరి! తమ వద్దకు వచ్చేవారు ఎవరు వాటి గురించి నిలదీయరులే అనే ధీమా కావచ్చు. పట్టణాలలో అనేక సంస్కరణలకు తానే ఆద్యుడనని చెప్పుకునే చంద్రబాబు, ఏది ఉచితం కాదు అని అధికారంలో ఉన్నప్పుడు ధీరిని చెప్పే చంద్రబాబు విపక్షంలో ఉంటే మాత్రం అన్నీ ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. అధికారంలోకి రాగానే మొత్తం మారిపోయి, అంతకుముందు మాట్లాడిన విషయాలేవీ గుర్తు లేనట్లు వ్యవహరించడమే ఆయన స్పెషాలిటి.ఈ మద్య ఇండోర్ కమిషనర్‌గా పనిచేసిన ఒక అధికారి సోషల్ మీడియాలో చెప్పిన విషయాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కడ ఎవరూ బయట చెత్త వేయడానికి లేదు. ప్రతి ఒక్క ఇంటివారు 150 రూపాయలు చెల్లించి తమ వద్దకు వచ్చే బండివాడికే ఆ చెత్త అప్పగించాలి అందువల్ల ఇండోర్ అంత నీట్‌గా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో సైతం ప్రతి ఒక్క ఇంటి యజమాని చెత్తకు వంద రూపాయలు చెల్లించవలసిందే. మరి ఇప్పుడు ఏపీలో ఏమి చేస్తున్నది తెలియదు కానీ, చెత్త డబ్బులు వసూలు చేయని పట్టణాలలో దుర్గందం వ్యాపించిందని వార్తలు వచ్చాయి.పిఠాపురంలో చెత్త పన్నుకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కల్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చారట. ఇప్పుడు దానిని ఏ ప్రభుత్వం అనాలో తెలియదు. చెత్తపన్ను వేస్తేనే పెద్ద తప్పు అని అరచి గీపెట్టిన చంద్రబాబు ఇప్పుడు తన ప్రభుత్వం వేసే ప్రతి రోడ్డుకు టోల్ గేట్ పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే జాతీయ రహదారులపై గూబ గుయ్ అనేలా టోల్ పన్ను వసూలు చేస్తుంటే, ఏపీలో ఇక రాష్ట్రంలో వేసే కొత్త రహదారులు అన్నిటిపై టోల్ వేస్తారట. ఈ మేరకు నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ల సమావేశంలో అధికారులను సీఎం ఆదేశించారు. చెత్త పన్ను వేయడమే తప్పు అయితే మరి ఈ రోడ్డు పన్ను ఏమిటి అని ఈనాడు మీడియా రాయదు. పైగా పీపీపీ మోడల్లో రోడ్ల నిర్మాణం అని ఘనంగా రాసింది. అంటే రోడ్లను వెడల్పు చేసి, రోడ్లను వేసి, తదుపరి వాటి నిర్వహణ అంతా ప్రైవేటువారికే అప్పగిస్తారట.ఇక ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా నిరుత్సాహపరచవద్దని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్ లో ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో అభివృద్ది చేసి, అక్కడ చికిత్సలు సరిపోకపోతే అప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడానికి సిఫారస్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులను పెద్దగా పట్టించుకోబోవడం లేదని పరోక్షంగా చెప్పేశారా అనే ప్రశ్న వస్తోంది. గతంలో విద్యా వ్యవస్థకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లి చదువుకుంటే చాలు, అక్కడ అన్ని సదుపాయాల నిమిత్తం, మధ్యాహ్న భోజనం నిమిత్తం సిబ్బందిని పెట్టారు. మరి వాళ్లంతా ఏమి అయ్యారో కానీ, ఎర్రగొండపాలెం వద్ద ఒక గిరిజన స్కూల్లో అన్నీ పనులు విద్యార్దులే చేసుకోవలసి వస్తోందట.ఈ మార్పులు ఎందుకు వచ్చాయి? స్కూళ్ళను ఏమి చేయాలని అనుకుంటున్నారు. ప్రైవేటు స్కూళ్లకు విద్యార్ధులు వెళ్లేలా ముఖ్యమంత్రే మాట్లాడితే ప్రభుత్వ స్కూళ్లపై ఎవరికి నమ్మకం కలుగుతుంది. పిల్లలందరికి ఇస్తానన్న తల్లికి వందనం ఇవ్వలేదు. పైగా ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన చోట విద్యా వలంటీర్లను పెట్టుకోండని చంద్రబాబు సూచించారట. ఈ వార్తను కూడా ఈనాడు మీడియా గొప్ప విషయంగానే ప్రొజెక్టు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్ లో మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తే ఈనాడు మీడియాకు విధ్వంసంగా కనిపించింది. అదే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ విద్యా వలంటీర్లను పెడుతుంటే ఆహా, ఓహో అంటోంది. ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చే విదానాన్ని రద్దు చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఏమైందో తెలియదు.అమరావతిలో రాజధానిలో పేదలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన ఏభైవేల ఇళ్ల స్థలాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రతి నెల పదో తేదీన పేదలకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందట. మరి మిగిలిన రోజులు ఎవరి కోసం పనిచేస్తారన్న సందేహం రావచ్చు. పేదలు గురించి పైకి మాట్లాడుతూ, ధనికుల కోసం టీడీపీ పనిచేస్తుందని అనుకోవచ్చు. పేదల కోసం పదే, పదే పరితపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఘోరంగా జనం ఓడించిన తర్వాత చంద్రబాబు ఆలోచనే కరెక్టేమో! పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కు మంగళం పలికి, ధనవంతుల రియల్ ఎస్టేట్ కోసం పనిచేయడమే బెటర్ అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనుకుంటే తప్పు అవుతుందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రివర్స్ డైరెక్షన్ లో బాబు పాలన..
-
Big Question: నెలరోజుల నరకం బాబు పాలన.. వణుకుతున్న రాష్ట్రం
-
ఏపీలో మొదలైన ముసళ్ల పండగ
గతంలో ఒక ప్రచార ప్రకటన వచ్చేది. ఈ నగరానికి ఏమైంది.. ఎటు చూసిన పొగ, నుసి.. అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అది కాలుష్యానికి సంబంధించినది అయితే, ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కు కూడా ఆ ప్రకటన సూట్ అయ్యేలా ఉంది. ఏపీలో ఎటు చూసినా జరుగుతున్న విధ్వంసం, హింసాకాండ గమనించిన తర్వాత ఈ ప్రకటన మాదిరే ఏపీ తయారైందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేసేది. కోడ్ అమలులోకి రావడంంతోనే అన్నీ తలకిందులు అవడం ఆరంభమైంది. ప్రభుత్వాన్ని సజావుగా నడవనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అన్ని ప్రయత్నాలు చేసేవి. ఎన్నికల కమిషన్ కూడా ఆ కూటమికి తన వంతు సాయం అందించింది. వలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా వృద్దులు పెన్షన్ పొందడానికి నానా పాట్లు పడేలా చేశారు.అవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతోనే హింసాకాండ, విద్వంసం వంటివి రాజ్యమేలాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన అరాచక శక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాయి. ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వంటివారు వారిని ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ పరిణామాలపై స్పందించకుండా కథ నడుపుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పరస్పరం పొగుడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.మరో వైపు ఏపీ వ్యాప్తంగా పారిశుద్ద్యం కొరవడి డయారియా వంటి వ్యాధులు ప్రబలాయి. నీటి కాలుష్యం తోడవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటివి వస్తే వెంటనే వలంటీర్లు ఆరా తీసి తగు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వానికి సమాచారం అందించేవారు. కరోనా వంటి పెద్ద సంక్షోభాన్ని సైతం వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆ ప్రభుత్వం ఎదుర్కుంది. కానీ గత పది, పదిహేను రోజులుగా ఈ విషయాలను పట్టించుకున్నవారే ఉన్నట్లు లేరు. కాకినాడ, జగ్గయ్యపేట, నంద్యాల మొదలైన చోట్ల గ్రామాలలో అతిసార వ్యాపించి పది మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనేక మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు.అదొక్కటే సరిపోదు. గ్రామాలలో కలుషిత సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలించి చర్యలు చేపట్టాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి ఉండాలి. కానీ ఆయన ఇది తన శాఖకు సంబంధించింది కాదనుకున్నారో, ఏమో కానీ గ్రామాలలో పారిశుధ్ద్యంపై చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చి గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే పట్టణాలలో అయితే మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించి సిబ్బందితో పని చేయించాలి. లేకుంటే ఈ సమస్యమరింత ప్రబలుతుంది.ఇక్కడ మరో సంగతి చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ టైమ్ లో ఎక్కడైనా కలుషిత సమస్య వచ్చి ఒకరిద్దరు మరణించినా, కొంతమంది ఆస్పత్రిలో చేరినా దానిని బూతద్దంలో చూపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రస్తుతం తెలుగుదేశం ఏలుబడిలో మాత్రం ఇందుకు సంబంధించిన వార్తలను ప్రముఖంగా ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఇంకో వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్రానికి వందల కోట్ల ఆదాయం తీసుకువస్తే, ప్రస్తుతం అది అంతా అక్రమార్కుల పాలవుతున్నట్లుగా ఉంది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లో పోగుచేసిన ఇసుక గుట్టలు, గుట్టలుగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ ఇసుకను గతంలో ఒక సిస్టమ్ ప్రకారం విక్రయించేవారు. టీడీపీ కూటమి ఇసుకను ఉచితం చేస్తామని హామీ ఇచ్చింది. అది అక్రమార్కులకు వరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఆయా చోట్ల విజృంభించి అందుబాటులో ఉన్న ఇసుకను తమ ఇష్టారీతిన అమ్ముకుంటున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల ఇలా లారీ ఒక్కింటికి పదమూడు వేల రూపాయల నుంచి పదహారువేల రూపాయల వరకు వసూలు చేసుకుంటూ అక్రమ రవాణా చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం స్పందించినట్లు కనిపించలేదు. ఈసరికే సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఇసుక టీడీపీ, జనసేనలకు చెందిన నేతల పరమైందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం పనిచేస్తోందో, లేదో అన్నట్లుగా పరిస్థితి ఉంటే అది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు.ఇదిలా ఉంటే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం కూడా అంత తేలికకాదు. దాంతో ఆ అంశాలను డైవర్ట్ చేసే లక్ష్యంతో కూటమి పెద్దలు, వారికి సపోర్టు చేసే మీడియా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్సార్సీపీపైన పలు కథలు సృష్టించి జనం మీదకు వదలుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేసిన ఐదేళ్లు వీరు వెంటాడారు. ఓటమి తర్వాత కూడా అదే పనిచేస్తున్నారు. ఉన్నవి, లేనివి కలిపి అబద్దాలను వండి ప్రజలపై రుద్దుతున్నారు. వైఎస్సార్సీపీ ఆఫీస్ ల నిర్మాణంలో ఏవో అక్రమాలు జరిగాయని, అనుమతులు లేకుండా నిర్మించారంటూ స్టోరీలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ మాత్రమే ప్రభుత్వ స్థలాలు తీసుకున్నట్లు, తెలుగుదేశం అసలు తీసుకోనట్లు చిత్రీకరిస్తున్నారు.మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్య కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైఎస్సార్సీపీ ఆయా జిల్లాలలో నిర్మించిన భవనాలను పాలస్ లతో పోల్చుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. విశేషం ఏమిటంటే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీస్ లకు ఇవ్వడానికి అధిక చొరవ తీసుకున్నది చంద్రబాబు నాయుడే. 1997లో ఉమ్మడి ఏపీలో ఎన్.టి.ఆర్ ట్రస్ట్ పేరుతో హైదరాబాద్ లో కెబిఆర్ పార్కు ఎదుట అత్యంత ఖరీదైన హుడా భూమిని దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నది చంద్రబాబు నాయుడే. అందులో పార్టీ ఆఫీస్ ను నడిపింది ఆయనే. అది ఏమీ చిన్న ఇల్లు కాదు. ఒక భారీ భవంతి.ఆ రోజుల్లో విపక్ష నేతగా ఉన్న పి జనార్ధనరెడ్డి ప్రభుత్వ భూమిని టీడీపీ ఆఫీస్ కు కేటాయించుకోవడంపై పెద్ద పోరాటమే చేశారు. కానీ అదేమి ఫలించలేదు. బహుశా లోకేష్ కు ఈ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన అప్పటికి విద్యార్ధిగానే ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీలో పలు జిల్లాలలో ప్రభుత్వ భూములలో, కొన్నిచోట్ల అస్సైన్డ్ భూములలో కూడా పార్టీ ఆఫీస్ లు నిర్మించుకున్నారు. ఇందుకోసం జీఓలు కూడా ఇచ్చారు. అంతదాకా ఎందుకు!? పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లి వద్ద చెరువు, డొంక ప్రాంతం కూడా కొంత ఆక్రమించి నిర్మించారన్న అభియోగాలు ఉన్నాయి. తీసుకున్న అనుమతులు మించి అంతస్తులు కట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇది కానీ, జిల్లాలలో నిర్మించిన భవనాలు కూడా చిన్నవేమీ కాదు.లోకేష్ పరిభాష ప్రకారమే అయితే అవి కూడా పాలస్ లే అవుతాయి. రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలు నిర్మించుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాకాకుండా పొరపాట్లు చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. దీనిని బూతద్దంలో చూపుతూ టీడీపీ కథ నడుపుతోంది. అనేకమార్లు బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు తెచ్చే ప్రభుత్వాలు, ఇప్పుడు పార్టీ ఆఫీస్ లకు కొంత సమయం ఇచ్చి ఒకవేళ భవనాలకు అనుమతి లేనట్లయితే వాటిని రెగ్యులరైజ్ చేస్తే పద్దతిగా ఉంటుంది. ఎందుకంటే ఇవేమీ ఆక్రమిత స్థలాలు కావు. ఈ భవనాల నిర్మాణ సమయంలో అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారని తేలుతున్నందున ఆ బిల్డింగ్ లను క్రమబద్దం చేస్తే బెటర్. కాకపోతే గురివింద గింజ తన నలుపు తెలుసుకోలేదన్నట్లుగా, టీడీపీ వారు వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం.నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ భవనాన్ని కూల్చివేయడం ద్వారా తమ విధ్వంస పాలన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. పదిహేను రోజులుగా వైఎస్సార్సీపీ వారి ఆస్తులు, రైతు భరోస కేంద్రాలు, సచివాలయాల భవనాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు ప్రభుత్వపరంగా కూడా ధ్వంస రచన సాగించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లు తాము హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. ఏదో అరకొరగా చేసి జనాన్ని మభ్యపెట్టే ఆలోచనలే సాగిస్తున్నారన్న అనుమానం ప్రజలలో ఉంది. కొన్ని స్కీములను ఎలా వాయిదా వేయాలా? అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు.ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసే విషయం పరిశీలనకు మరో నెల పడుతుందని రవాణశాఖ మంత్రి రామ్ ప్రసాదరెడ్డి చెప్పారు. కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకటి, రెండు రోజులలోనే ఉచిత బస్ స్కీమ్ ను అమలు చేసింది. ఏపీలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. నిజానికి ఏపీలోనే ఈ స్కీము అమలు చేయడం తేలిక. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి మార్చడం ద్వారా ఆ సంస్థకు చాలా వెసులుబాటు కల్పించింది. అంటే జీతాల భారం తగ్గిందన్నమాట. అయినా ఈ స్కీమును అమలు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? అనేదానికి సరైన కారణం కనిపించదు.ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో ప్రభుత్వం తీరు అలాగే ఉంది. ప్రజలు నిజంగా గెలిపించారో, లేక ఈవిఎమ్ ల మాయ ఏమైన ఉందో తెలియదు కానీ, టీడీపీ ప్రభుత్వం ఇకనైనా ఈ విధ్వంసపాలన ఆపి ప్రజోపయోగ కార్యక్రమాలకు దిగితే మంచిది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జగన్ పరిపాలనపై ప్రశంసలు
-
ఏపీలో విప్లవాత్మక మార్పులు
-
KSR Live Show: విప్లవాత్మక మార్పులకు నేటితో ఐదేళ్లు..
-
సీఎం జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలనపై మల్లాది విష్ణు రియాక్షన్
-
నవరత్నాల నవశకానికి ఐదేళ్లు
-
మారుతున్న ఢిల్లీ రాజకీయాలు.. ఎల్జీ నిర్ణయంపై ఉత్కంఠ
దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అదీ అవినీతి ఆరోపణల మీద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. తద్వారా పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారాయన. అయితే ఆయన అరెస్ట్ నేపథ్యంలో.. ఢిల్లీకి నెక్ట్స్ సీఎం ఎవరనే చర్చ సాధారణంగానే తెరపైకి వచ్చింది. ఆప్ మాత్రం మరో మాట చెబుతోంది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కుట్ర. ఢిల్లీకి కేజ్రీవాలే ముఖ్యమంత్రి. ఆయనే మా పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతారు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు..’’ ఇది ఇప్పుడు ఆప్ కీలక నేతలు చెబుతున్న మాట. ఇప్పుడే కాదు.. గత నవంబర్‌లో లిక్కర్ స్కాంలో తొలిసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలోనూ ఆప్ ఒక్కటే ప్రకటన చేసింది. కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోరని.. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినా ఆయనే సీఎంగా పాలన కొనసాగిస్తారని. అంతేకాదు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే గనుక రాజీనామా చేయాలా? లేదంటే సీఎంగా కొనసాగొచ్చా? అంటూ.. ‘మై బీ కేజ్రీవాల్’ పేరుతో ఈ జనవరిలో ఏకంగా ఓ పబ్లిక్ సర్వేను సైతం చేపట్టింది ఆప్. అయితే.. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి హోదాలో జైలు నుంచే పాలన నడిపించేందుకు వీలుందా?అందుకు భారత రాజ్యాంగం అనుమతిస్తుందా? చట్టాలు ఏం చెబుతున్నాయి?.. రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులు మాత్రమే రాజ్యాంగం పరిధిలోని పోస్టింగులు. చట్టం ప్రకారం.. వీళ్లకు మాత్రమే అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. వాళ్ల పదవీకాలం ముగియడం లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసేదాకా వాళ్లకు ఊరట లభిస్తుంది. అప్పటిదాకా ఆర్టికల్ 361 ప్రకారం వాళ్లకు కల్పించిన రక్షణ ప్రకారం.. న్యాయస్థానాలకు వాళ్లు జవాబుదారీలుకారు. అయితే.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి పదవులకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదు. అందుకే ఢిల్లీ హైకోర్టు సైతం కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అలాగని కేవలం అరెస్ట్ అయినంత మాత్రానా వాళ్లు(పీఎం, సీఎంలాంటి పదవుల్లో ఉన్నవాళ్లు) ఆ పదవులకు అనర్హులైపోరు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం కచ్చితంగా శిక్ష పడితేనే పదవుల్ని కోల్పోతారు. కేజ్రీవాల్‌కు జైలుకెళ్తే.. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే.. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీని పాలించడాన్ని ఏ చట్టం అడ్డుకోదు. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే మాత్రం అనర్హతకు గురవుతారు. ఇప్పటివరకైతే ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి ఆయన పాలన కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగని జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన పనీ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకు జైలు అధికారులు ఆయనకు పలు సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అక్కడి జైళ్ల శాఖ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. స్వచ్ఛందంగా రాజీనామాను మినహాయిస్తే ఒక ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయేది అసెంబ్లీలో మెజారిటీని కోల్పోవడమో లేదంటే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్లనో. కేజ్రీవాల్‌కు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే.. ఇప్పటి వరకు ఆప్ మంత్రులు ఇద్దరు మనీశ్ సిసోడియా , సత్యేందర్ జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు. కానీ, కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన వద్ద ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేదు. లెఫ్టినెంట్ గవర్నర్దే నిర్ణయం? ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అయితే.. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుందన్నది తెలిసిందే. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి.. కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ఆయనతో కేజ్రీవాల్ సర్కార్‌కు అంత సత్సంబంధాలు కూడా ఏం లేవు. దీంతో.. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా?.. ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజధాని రీజియన్‌లోని ఢిల్లీకి మాత్రమే వర్తించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. కేజ్రీవాల్ జైలుకు వెళ్తే గనుక ఆయన్ని అధికారం నుంచి తొలగించమని ఎల్జీ రాష్ట్రపతిని కోరేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకు గనుక వెళ్లాల్సి వస్తే.. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయించొచ్చు. ఆర్టికల్ 239ఏబీ ప్రకారం ఎల్జీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. తద్వారా బలవంతంగా అయినా కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన కింద ఢిల్లీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. రిమాండ్ పిటిషన్‌పై తీర్పు, బెయిల్ ఏదో ఒకటి వచ్చేదాకా ఎదురుచూసే అవకాశం లేకపోలేదు. -
కోడ్‌ను ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవు! : భారత ఎన్నికల కమిషన్..
సాక్షి, ఆదిలాబాద్: 'అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నియమావళి విడుదల చేసింది. ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే స్థానిక ఎన్నికల పరిశీలకులను కలిసి లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా సీ–విజిల్ యాప్ ద్వారా ఉల్లంఘనులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి, ప్రత్యేక అధికారికి పంపించవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనల సంకలనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం నుంచి విడుదల చేశారు.' కోడ్ నియమావళి.. ► భిన్న, కుల, మత, భాష వర్గాల ప్రజల మధ్య విభేదాలు పెంపొందించే, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు. ► ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు కేవలం ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర చేసిన పనులకు పరిమితమై ఉండాలి. ► వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ధ్రువీకరణ జరుగని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా విమర్శలు చేయరాదు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ పోస్ట్ చేయరాదు. ► ఎన్నికల చట్టాల్లో నేరపూరిత చర్యలుగా పేర్కొన్న కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేయకూడదు. ► ఆధారాల్లేకుండా రూ.50 వేలకు మించి నగదు ఒకచోటి నుంచి మరో చోటికి తరలించకూడదు. ► ఓటరు స్థానంలో ఇతరులతో ఓటు వేయించడం, పోలింగ్ కేంద్రాలకు వందమీటర్ల దూరంలో ప్రచారం నిర్వహించడం, పోలింగ్‌కు 48 గంటల ముందు సభలు సమావేశాలు జరపడం, ఓట ర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించడం వంటివి చేయరాదు. ► ప్రతీ పౌరుడు తన ఇంట్లో ప్రశాంతంగా బతికేందుకు తమహక్కును గౌరవించాలి. వ్యక్తుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వారి ఇళ్లముందు నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టరాదు. ► యజమానుల అనుమతి లేకుండా వారి స్థలాలు, భవనాలు, ప్రహరీ గోడలకు జెండాలు, బ్యానర్లు కట్టడం, పోస్టర్లు అంటించడం, వాల్రై టింగ్ లాంటివి చేయరాదు. ► ఇతర పార్టీల సమావేశాలు, ఊరేగింపులకు తమ మద్దతుదారులు భంగం కలిగించకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక పార్టీ కార్యకర్తలు వేరే పార్టీల సమావేశం జరుగుతున్న ప్రాంతం మీదుగా ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒకపార్టీ అతికించిన పోస్టర్లను మరోపార్టీకి చెందిన కార్యకర్తలు తొలగించకూడదు. ► ఊరేగింపుల రూట్‌మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు లేదా పార్టీలు ఏకకాలంలో ఒకేరూట్లో ఊరేగింపు నిర్వహించే సమయంలో నిర్వాహకులు ముందుగా సంప్రదింపులు జరుపుకుని ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలి. ► ఊరేగింపులో తీసుకెళ్లే వస్తువుల విషయంలో పార్టీల అభ్యర్థులు నియంత్రణ పాటించాలి. అవి అసాంఘికశక్తుల చేతిలో దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పార్టీల నేతల దిష్టిబొమ్మలను ఊరేగించడం, బహిరంగంగా దహనం చేయడం వంటివి చేయరాదు. ► ఓటర్లు మినహా ఇతరులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పాస్ కలిగిన వారికి మినహాయింపు ఉంటుంది. ► శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతిపాదిత సభ సమయం, వేదికను ముందస్తుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. సభ ఉన్న ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే ముందుగానే దరఖాస్తు చేసుకుని సడలింపులు పొందాలి. సభలో లౌడ్ స్పీకర్, ఇతర సదుపాయాలను వినియోగించడానికి ముందు సంబంధిత అఽధికారి నుంచి అనుమతి పొందాలి. ► అభ్యర్థుల స్పీచ్‌లు ఓటు వేసేలా ఉండకూడదు. ► స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల అధికారులు సహకరించాలి. ► ఓటర్లకు పంపిణీ చేసే చిట్టీలపై గుర్తులు, పార్టీల పేర్లు ఉండరాదు. ► పోలింగ్‌కు 48 గంటలకు ముందు నుంచి మద్యం పంపిణీ చేయరాదు. ► పోలింగ్ బూత్ వద్ద పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే క్యాంపుల వద్ద పోస్టర్లు, జెండాలు, గుర్తులు ఇతర ప్రచార సామగ్రి ప్రదర్శించరాదు. ఆహార పదార్థాలు పంపిణీ చేయరాదు. ► పోలింగ్ రోజు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. పర్మిట్లు పొందిన వాహనాలకు స్టిక్కర్లు బాగా కానిపించే విధంగా అతికించాలి. ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసే హక్కు ప్రతీ భారతీయ పౌరునికి ఉంది. -
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై మల్లాడి కృష్ణ రావు ప్రశంశలు
-
పేదల పట్ల జగన్ తీరును దగ్గరగా చూసిన వ్యక్తి నేను
-
సీఎం జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో సుపరిపాలన
సాక్షి, పాత గుంటూరు: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం ఒకటో డివిజన్ తారకరామనగర్‌లోని 3వ సచివాలయ పరిధిలో నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. పింఛన్ ఒకటో తేదీనే అందుతుందా? అని వృద్ధుల్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యల్ని తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కాలనీలోని పలు వీధుల్లో ప్రజలు మురుగు సమస్య ఉందని చెప్పడంతో వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పలువురు వృద్ధులు పింఛన్ రాలేదని తెలపడంతో వెంటనే మంజూరు దిశగా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో పథకాల అమలులో వివక్ష చూపారని, ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. ఇంటి వద్దకే పథకాలు వచ్చే విధంగా సీఎం జగన్ వలంటీర్, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలువుతున్న తీరుపై రూపొందించిన కరపత్రాల్ని ప్రజలకు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ కోలా భవాని, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ షేక్ ముంతాజ్ బేగం, ఒకటో డివిజన్ కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు యాట్ల రవి, అంబేడ్కర్, దూపాటి వంశీబాబు, ఆబిద్ బాష, షేక్ మీరావలి, వైఎస్పార్ సీపీ నాయకులు కేసరి సుబ్బులు, రాచమంటి భాస్కర్, పోలవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు) -
అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా సీఎం జగన్ పాలన
-
సరికొత్త చరిత్ర ... ‘సీమ’కు సముద్రం
సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచడంతో సరికొత్త చరిత్ర నమోదవుతోంది. నూతన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాలివీ.. కరువు సీమకు కడలి ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది. తాజాగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి. ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది. రెండు గిరిజన జిల్లాలు ఇప్పటిదాకా రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. జిల్లాల పునర్ విభజన తర్వాత గిరిజనుల కోసం రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్లో మన్యం జిల్లాగా ప్రకటించగా స్థానికుల వినతిమేరకు పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలుండగా వీటికోసం సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు (ఐటీడీఏ) ఏర్పాటయ్యాయి. ఆంధ్ర కేసరితో ఆరంభం.. ప్రస్తుతం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, వైఎస్సార్ కడప జిల్లాలు ప్రముఖుల పేర్లతో ఉండగా జిల్లాల విభజనతో ఇది ఏడుకు పెరిగింది. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తిస్తూ 1972లో తొలిసారిగా ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు. బ్రిటీషు వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటైంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైంది. ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఐదు అత్యధిక వర్షపాత జిల్లాలు.. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా 1,400 మి.మీ సగటు వర్షపాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తిరుపతి జిల్లా 1,300 మి.మీ, కోనసీమ జిల్లా 1,200 మి.మీ, పార్వతీపురం మన్యం 1150 మి.మీ, విశాఖపట్నం 1,100 మి.మీ వరకు ఉన్నట్లు అంచనా. (చదవండి: కోవిడ్ తర్వాత ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపారం... రాష్ట్ర ప్రభుత్వం రికార్డు) -
మోసాలు చేసి పాలన చేయం... ప్రజా సంక్షేమం మా ద్యేయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. '' రేపటికి వైఎస్ జగన్ పరిపాలన ప్రారంభమై 2 ఏళ్ళు విజయవంతంగా పూర్తి అవుతుంది. ఈ రెండేళ్లలో ఇచ్చిన మాటకు కట్టుబడి 95 శాతం వాగ్దానాలను అమల్లోకి తెచ్చారు. రూ. 1.25 లక్షల కోట్లు ప్రజల ఖాతాలోకి అందించిన ఏకైక ప్రభుత్వం మాది. ఒక నాయకుడు మాట ఇస్తే ఇంతగా కట్టుబడి ఉంటాడా అన్నట్లు పాలన సాగింది. గత ప్రభుత్వాల్లా మేము మోసాలు చేసి పాలన చేయం... ప్రజల సంక్షేమమే మా ద్యేయం. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ప్రజల నుంచి నేరుగా సీఎం అయిన వ్యక్తి జగన్. నాయకుడు ఎలా ఉండాలో దేశమంతా జగన్ వైపు చూస్తుంటే.. నాయకుడంటే ఎలా ఉండకూడదు అనుకునే వాళ్ళు చంద్రబాబు వైపు చూస్తున్నారు . ఓటు వేయని వారుని కూడా ఈ రెండేళ్లలో తన వైపు తిప్పుకున్నారు. ఈ మధ్య ఏ ఎన్నిక జరిగినా విజయం వైఎస్సార్సీపీనే వరించింది. ప్రతిపక్షాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఇక టీడీపీకి మిగిలింది బూడిద, జూమ్ మాత్రమే. చంద్రబాబుది ముగిసిన చరిత్ర... ఆయన సినిమా అయిపోయింది. ఈ రెండేళ్లలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం.ఎన్నికల మేనిఫెస్టో అర్థమే మార్చాం. 129 వాగ్దానాలు ఇస్తే 107 పూర్తి చేసాం.. మిగిలినవి అమలు కాబోతున్నాయి . ఒక్క బటన్ తో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వ్యక్తి మా సీఎం. ఇలాంటివి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలి...కానీ ఇది సందర్భం కాదు . కోవిడ్ నేపథ్యంలో దానిపై అందరం కలసికట్టుగా పోరాడాలి . క్యాలెండర్ ఇచ్చి ముందుగా చెప్పి మరీ సంక్షేమం అందిస్తున్నారు.'' అని అంబటి తెలిపారు. -
మే 30, 2019న ప్రారంభమైన వైఎస్ జగన్ పాలన
-
చారిత్రాత్మకం నేతన్న నేస్తం
-
జగన్ అనే నేను..
-
నవ శకం!
-
100 రోజుల చరిత్ర
-
వంద రోజులు..వేల వెలుగులు
సాక్షి, విశాఖ సిటీ: ప్రజా సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే ప్రధానం.. ఇదే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నినాదం. రాజన్న రాజ్యం నిజంగా తిరిగి వచ్చిందన్న నమ్మకాన్ని.. ప్రతీ కుటుంబానికి నవరత్నాల వెలుగులు నింపుతానన్న భరోసాని కేవలం వంద రోజుల పాలనలోనే ఆయన కలిగించారు. ముఖ్యంగా జిల్లా పరంగా చూసుకుంటే ‘విశాఖ వికాసమే నా లక్ష్యం’ అన్నట్టుగా ఆయన జిల్లా వాసులపై వరాలు కురిపించారు. పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అనేక ప్రాజెక్ట్‌లను కేటాయించారు. దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. పరిశ్రమలకు చేయూతనిచ్చారు. మరెన్నో సంస్థలకు అండగా నిలిచారు. మొత్తంగా జిల్లా ప్రజలకు ‘నేనున్నా’అంటూ వరాల జల్లు కురిపించారు. తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి గిరిపుత్రులంటే వల్లమాలిన అభిమానం. ఆయన పంథాను కొనసాగిస్తూ గిరిబిడ్డల ఆరోగ్యమే ప్రధానంగా పాడేరు కేంద్రంగా గిరిజన మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. ఏజెన్సీ వాసులు జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసేందుకు, తమ జేబులు నింపుకునేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన బాక్సైట్ తవ్వకాల జీవో 97ను తక్షణమే రద్దు చేయించారు. సబ్బవరం కేంద్రంగా మూడు జిల్లాల జీవనాడి...మహానేత వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కమ్ముకున్న నీలినీడలను పటాపంచలు చేస్తూ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేశారు. దాదాపు 40 వేల కుటుంబాల జీవితాలను బాగుచేసే ఉద్దేశంతో రెండున్నర దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సింహచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశారు. అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ మొత్తం పెంచి..వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు. రోడ్డున పడ్డ దాదాపు వేలాది మంది కార్మిక కుటుంబాలను ఆదుకునే దిశగా భీమిలి సమీపంలోని చిట్టివలస జ్యూట్ మిల్లు కార్మికులను ఆదుకున్నారు. వారి సమస్యలను కేవలం 45 రోజుల్లో పరిష్కారించారు. ఇక నగరాభివృద్ధికి కేంద్ర బింధువైన విశాఖపట్నం మెట్రోరీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఎ)కు పునర్జీవం పోశారు. చైర్మన్, కమిషనర్లను తక్షణమే నియమించి సంస్థను గాడిలో పెట్టారు. నగరానికి మరిన్ని సొగబులు అద్దె దిశగా అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఇక రైతు, గిరిజన, మత్స్యకార, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కల నెరవేర్చారు. అంగన్వాడీ, ఆశ, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి వారి కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా వంద రోజుల పాలన ‘చరిత్ర’ సృష్టించింది అనడంలో అతిశయోక్తి లేదు. లక్షన్నర మంది మత్స్యకారులకు భరోసా.. సముద్రంలోకి వేటకు వెళితే బతుకులపై భరోసా లేదు. అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబాలకు దిక్కులేదు. ఆదుకునే నాథుడు లేడు. వేట నిషేధ సమయంలో పూట గడిచే పరిస్థితి లేదు. ఇలా మత్స్యకారుల జీవనం అగమ్యగోచరం. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వీరిని ఆదుకునేందుకు వరాలు కురిపించింది. నగరంలోని హార్బర్లో ప్రత్యక్షంగా..పరోక్షంగా జీవనం సాగిస్తున్న దాదాపు 20 వేల మందితో పాటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి వలస వచ్చి బతుకుతున్న దాదాపు 7 వేల మందికి, జిల్లాలో ముత్యాలమ్మపాలెం, పరవాడ, పూడిమడక, కొత్త జాలారిపేట, పెదజాలరిపేట, భీమిలి, చేపలుప్పాడ, బంగారమ్మపాలెం, రేవు పోలవరం, తీనార్ల, రాజయ్యపేట ప్రాంతాల్లోని వేలాది మంది మత్స్యకారుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైతే రూ.10లక్షల పరిహారం, వేట నిషేధ కాలంలో గతంలో ఉన్న రూ.4 వేలను రూ.10వేలకు పెంపు, డీజిల్‌పై రాయితీ గతంలో ఉన్న రూ.6.80 ని రూ.12.14 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 132 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతంలోని 63 మత్స్యకార గ్రామాల్లో నివాసం ఉంటున్న 1.50 లక్షల మంది ఫలం పొందుతారు. వేట నిషేధ సమయంలో దాదాపు 20 వేల మందికి పరిహారం అందనుంది. 40 వేల కుటుంబాలకు సాయం.. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్య పరిష్కారం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 40 వేల కుటుంబాలు మేలు పొందుతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం జూన్ మొదటివారంలో జరిగిన తొలి కేబినేట్ సమావేశంలో సీఎం మంత్రులతో చర్చించారు. అనంతరం జూలై 17 అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్ భూ సమస్య పరిష్కారం గురించి ప్రశ్న లేవనత్తగా.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. అదే నెల 26న సమస్య పరిష్కారం కోసం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని నియమించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ త్వరలో పని ప్రారంభిస్తుంది. పోలీసులకు వారాంతపు సంతోషం.. పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరితే కుటుంబంతో గడిపే అవకాశం లేనట్లే. వారాంతపు సంతోషాన్ని విడనాడాల్సిందే. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకు భిన్నంగా ఆలోచించారు. పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పోలీసు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లా/నగర వ్యాప్తంగా పోలీసులకు వారంతపు సెలవు అమలవుతుంది. తద్వారా జిల్లాలో 2,500 మంది, నగరంలో 3 వేల మంది పోలీసులు వారంలో ఒకరోజు పూర్తిగా కుటుంబంతో గడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1300 మంది హోంగార్డులకు ఈ సెలవు వర్తించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఆటోవాలాకు ఆనందం.. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు వెంటాడే ఆర్టీఏ కేసులు.. ఇంకోవైపు ఆటో మరమ్మతులు ఇలా ఆటో కార్మికుల కష్టాలకు కొదవలేదు. జిల్లాలో ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ఆటోకార్మికులు తమ గోడు చెప్పుకున్నారు. దీనిపై ఆలోచన చేసిన సీఎం ఆటో కార్మికులందరితో పాటు సొంత వాహనం కలిగిన ట్యాక్సీ కార్మికులకు కూడా ఏటా రూ.10 వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తద్వారా జిల్లాలోని దాదాపు 42 వేల మంది ఆటో కార్మికులు ఈ ప్రతిఫలం పొందనున్నారు. అలాగే మరో 6 వేల మంది ట్యాక్సీవాలాలు ఈ నగదు అందుకోనున్నారు. అందరికీ ఆరోగ్యం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్ష. అలాంటి దైన్యం నుంచి పేదలను విముక్తి చేసింది డాక్టర్ వైఎస్సార్ పాలన. మళ్లీ ఆ పాలన గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వంద రోజుల పాలనలో ఆరోగ్యశాఖపై ప్రత్యేక కసరత్తు చేశారు. ఆరోగ్యశ్రీకి ఊపిరి పోస్తూ రూ.1000 వైద్య ఖర్చు దాటితే ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొం దించారు. అదే సమయంలో వార్షికాదాయం రూ.40 కాకుండా రూ.5 లక్షలు ఉన్నవారిని ఈ పథకంలోకి ప్రవేశపెట్టారు. దీంతో జిల్లాలో 12,87,187 మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నారు. అంగన్వాడీలకు మరింత లబ్ధి.. అప్పుడు రూ.10,500 వేతనంతో అంగన్వాడీ కార్యకర్తలు పని చేస్తున్నారు. ఆ సమయంలో తమకు వేతనాలు పెంచాలని జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. వారి వినతిని పరిశీలించిన ఆయన అధికారంలోకి రాగానే.. అంగన్వాడీలందరికీ రూ.11,500 వేతనం చేస్తూ జీవో జారీ చేశారు. దీనివలన జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 4,952 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 4,786 మంది సిబ్బందికి మేలు జరిగింది. పారిశుధ్య కార్మికుల బతుకులు బాగు.. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. గత ప్రభుత్వాలు కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు. వారి ఆలోచనకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ కార్మికులను ఆదుకున్నారు. వారి బతుకుల బాగును కాంక్షిస్తూ హెల్త్ అలవెన్స్‌లను ఇవ్వడంతో పాటు వేతనాలను పెంచారు. అలవెన్స్ కింద రూ.6వేలు ఇవ్వడంతో పాటు వేతనాలను రూ.18 వేలకు పెంచారు. తద్వారా జీవీఎంసీ పరిధిలోని 5,130 మంది, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో 200 మంది కార్మికులకు లబ్ధి చేకూరింది. బాక్సైట్ ముప్పు తొలగింది.. టీడీపీ ప్రభుత్వం అక్రమార్జన కోసం జీవో నంబర్ 97 ద్వారా బాక్సైట్ తవ్వకాలకు తెరతీసే ప్రయత్నం చేసింది. అయితే గిరిజనులతో పాటు ప్రజాసంఘాలు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో అప్పటి ప్రభుత్వం తాత్కాలికంగా తవ్వకాల కుట్రకు బ్రేక్ వేసింది. కానీ జీవోను రద్దు చేయకుండా ఏజెన్సీ గుండెలపై భారాన్ని అలాగే ఉంచింది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ జీవోను రద్దు చేస్తూ బాక్సైట్ తవ్వకాల ఆలోచనే లేకుండా చేసి గిరిజనులకు భారీ ఊరట కలిగించారు. సుజల స్రవంతికి జీవం.. ఉత్తరాంధ్ర జిల్లాల భూములను సస్యశ్యామలం చేసే కలతో మహానేత డాక్టర్ వైఎస్సార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టారు. సబ్బవరం కేంద్రంగా నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆయన మరణానంతరం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలి బడ్జెట్లోనే ఈ ప్రాజెక్ట్‌కు ఊపిరి పోసే దిశగా రూ.170.06 కోట్లు కేటాయించారు. కుల వృత్తిదారులకు వెన్నుదన్ను.. సామాజిక న్యాయం చేస్తూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్ వివిధ కుల వృత్తిదారులకు ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచారు. దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఏటా రూ.10 వేలు అందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 76,667 మంది రజకులు, 38,472 మంది నాయీ బ్రాహ్మణులు, 22,584 మంది దర్జీలు లబ్ధి పొందనున్నారు. గంజాయి రవాణాకు చెక్.. రాష్ట్రంలోనే గంజాయి సాగుకు జిల్లాకు రాకూడని పేరుంది. టీడీపీ హయాంలో గత ఐదేళ్లు జిల్లాలోని ఓ మంత్రే స్వయంగా గంజాయి సాగుకు తనవంతు సహకారం అందించారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతంతో పండిన గంజాయి పంట నగరంలో గుప్పుమంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ వంద రోజుల్లో నేరుగా గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపింది. రవాణాపై ఎక్కడిక్కడ నిఘా పెట్టి స్మగ్లర్లకు చెక్ పెట్టారు. సాగు చేయకుండా గిరిజన ప్రాంతాల్లో వీధి నాటికలు, బుర్రకథలు, అవగాహన సదస్సుల ద్వారా చైతన్య పరుస్తున్నారు. తద్వారా గతంలో 10 వేల ఎకరాల్లో ఉన్న గం జాయి సాగును 4 వేల ఎకరాలకు పరిమితం చేశారు. అంతేకాకుం డా దాన్ని కూడా నాశనం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వైఎస్సార్ వైద్య కళాశాల.. మన్యానికి ప్రత్యేకం.. పాడేరు: విశాఖ మన్యంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం వైఎస్సార్ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వైద్య కళాశాల ఏర్పాటుతో గిరిజనుల వైద్యారోగ్య సేవలకు భరోసా లభించనుంది. మన్యానికి ఇప్పటి వరకు వైద్య నిపుణులు అందుబాటులో లేరు. ఏటా గిరిజనులను అనేకమైన ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రక్తహీనత వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించడం లేదు. వైద్యుడిని చూడని గిరిజన పల్లెలు ఎన్నో ఉన్నాయి. రహదారుల సౌకర్యం, రక్షిత మంచినీరు అందుబాటులో లేని వందలాది గిరిజనులు నాటు వైద్యం, సంచి డాక్టర్లపైనే వైద్య సేవలకు ఆధారపడుతున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేయనుండడంతో ఆదివాసీలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వైద్య కళాశాల ఏర్పాటుతో పాడేరు జిల్లా ఆస్పత్రికి అన్ని విభాగాల వైద్య నిపుణులు అందుబాటులోకి రానున్నారు. ఇక గిరిజనులు వైద్య సేవల కోసం కేజీహెచ్ వరకు పోవాల్సిన అవసరం ఉండదు. సీఎం వైఎస్ జగన్ పాలన అద్భుతం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వందరోజుల పాలన అద్భుతంగా ఉంది. పేద, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగుతోంది. 100 రోజుల్లోనే 4 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ముస్లిం మైనారిటీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులిచ్చి అన్ని కులాలకు సమన్యాయం చేశారు. ఆశ వర్కర్ల నుంచి పారిశుధ్య కార్మికుల వరకు జీతాలు పెంచి వారికి భరోసా కల్పించారు. ప్రజలంతా వందరోజుల్లో సుఖసంతోషాలతో ఉన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా వంద రోజుల పాలన సాగింది. – ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ, విశాఖపట్నం చక్కని పాలనతో ఆకట్టుకుంటున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన చక్కని పాలనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అవినీతి రహిత పాలన వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. నవరత్న పథకాల హామీలు నెరవేర్చేందుకు ఆయన నిధులు కేటాయించడంతో ప్రజలకు సంపూర్ణ నమ్మకం ఏర్పడింది. పేదలందరికీ ఏదో ఓ రూపంలో లబ్ధి చేకూర్చడం హర్షించదగ్గ విషయం. – ఎస్.చంద్రశేఖర్, అయ్యప్పనగర్ సంతృప్తినిచ్చిన వందరోజుల పాలన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అవినీతి లేని పాలనకు ప్రాధాన్యమిస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా దోపిడీని అరికట్టేందుకు ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఎంపీగా తాము పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. పార్లమెంట్లో ఎన్నో అంశాలపై మాట్లాడేందుకు అవకాశం దక్కింది. ముఖ్యంగా రైల్వే సమస్యలపై సంబంధిత శాఖామంత్రి స్పందించి కోరిన వినతులకు సానుకూలంగా సమాధానాలు పంపించారు. కీలకమైన బిల్లులపై చర్చించేందుకు అవకాశం వచ్చిందంటే అది సీఎం జగన్ చలవే. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలు ఇచ్చిన వినతులకు స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకుంటున్నాం. ఇచ్చే మాటకు కట్టుబడే వ్యక్తిగా సీఎం జగన్‌కు పేరుందని చెప్పేందుకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ఉదాహరణ. 100 రోజుల పాలనలో ప్రజలకు చేరువవడంతో సంతోషంగా ఉంది. – బి.సత్యవతి, ఎంపీ అనకాపల్లి బాక్సైట్ తవ్వకాల రద్దు..గిరిజనులకు మేలు గత ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిన 97 జీవోకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడి ఆదివాసీలకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దుకు నిర్ణయం తీసుకుని గిరిజనులకిచ్చిన హామీను వెంటనే నెరవేర్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వందరోజుల పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. – గొడ్డేటి మాధవి, ఎంపీ, అరకు -
‘ఆ ఉద్యోగాలకు వారు అనర్హులే’
చెన్నై : ఉద్యోగాలకు అవసరమైన అర్హతను మించి ఉన్నత విద్యార్హతలు ఉన్న వారిని ఆయా ఉద్యోగాల్లో నియమించరాదని మద్రాస్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఓవర్ క్వాలిఫికేషన్ పేరుతో చెన్నై మెట్రో తనకు ఉద్యోగం నిరాకరించడంతో ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్ధానం ఈ మేరుకు తీర్పు వెలువరించింది. 2013లో లక్ష్మీ ప్రభ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)లో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగానికి డిప్లమా అర్హత కాగా, లక్ష్మీ ప్రభ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావడం గమనార్హం. కాగా ఆమె దరఖాస్తును జులై 2013న సీఎంఆర్ఎల్ తిరస్కరించడంతో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నా తన హక్కులను సీఎంఆర్ఎల్ నిరాకరించిందన్న పిటిషనర్ వాదనను జస్టిస్ వైద్యనాధన్ తోసిపుచ్చారు. ఓవర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న ప్రస్తుత ఉద్యోగులనూ తొలగిస్తామని సంస్థ ప్రతినిధులు కోర్టుకు నివేదించారు. ఇక మరో కేసులో కనీస అర్హతలకు మించి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్ధులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు గరిష్ట విద్యార్హతలను నిర్ధారించాలని కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసిస్టెంట్ పోస్ట్‌లో నియామకానికి ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన అభ్యర్ధి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. గతంలో తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్లో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికుల పోస్టులకు సైతం ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకోవడం పత్రికల పతాకశీర్షికలకు ఎక్కింది. బీఈ, బీటెక్, ఎంటెక్ డిగ్రీలు కలిగిన పట్టభద్రులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ క్లర్కులు, అసిస్టెంట్ల పోస్టులకు సైతం పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీలు చేసిన అభ్యర్ధులు సైతం పోటీపడటం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో యూపీ పోలీస్‌లో పాఠశాల విద్యార్హత అవసరమైన 62 గుమాస్తా ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల్లో 81,700 మంది గ్రాడ్యుయేట్లు కాగా, వీరిలో 3700 మంది పీహెచ్‌డీలు ఉండటం గమనార్హం. -
ప్రధాన న్యాయమూర్తే సుప్రీం..
సాక్షి, న్యూఢిల్లీ : కేసులో కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తిదే తుది నిర్ణయమని, ఇందులో కొలీజియం జోక్యానికి తావులేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. కేసుల కేటాయింపులో ఇతరుల జోక్యం సర్వోన్నత న్యాయస్థానం రోజు వారీ విధులను సంక్లిష్టం చేస్తుందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ప్రజల మనసులో న్యాయవ్యవస్థ పట్ల గౌరవం సడలిపోవడం సర్వోన్నత న్యాయస్ధానం స్వతంత్రకు పెనుముప్పు వాటిల్లుతుందని జస్టిస్ ఏకే సిక్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులు వెలువరించినా కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తికే విచక్షణాధికారం ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ తన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా వ్యవహరించడాన్ని ప్రశ్నిస్తూ కేసుల కేటాయింపులో కొలీజియం లేదా పూర్తిస్ధాయి న్యాయస్ధానం కీలకంగా వ్యవహరించేలా ఆదేశించాలని కోరారు. అయితే సుప్రీం తీర్పుపై శాంతిభూషణ్ తరపున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్టు నేటి తీర్పులో స్పష్టం చేసిందని, అయితే కేసుల కేటాయింపులో సీజేఐ తీరును బాహాటంగా విమర్శిస్తూ ఇటీవల నలుగురు సుప్రీం న్యాయమూర్తులు చేసిన ప్రకటన నేపథ్యంలో కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రధాన న్యాయమూర్తి తన అధికారాలను దుర్వినియోగం చేయడంపై సుప్రీం కోర్టు ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో జస్టిస్ లోయా మృతి, మెడికల్ కాలేజ్ కుంభకోణం వంటి సున్నితమైన కేసుల కేటాయింపులో సీజేఐ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నలుగురు సుప్రీం న్యాయమూర్తులు బాహాటంగా విమర్శించిన విషయం తెలిసిందే. -
ప్రత్యామ్నాయంగా నిలిచే వ్యూహం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలను పూర్తిగా నిలువరించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సమయంలో.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను కట్టడి చేసేలా పావులు కదిపారు. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్షం పట్ల కటువుగా వ్యవహరించారు. తెలంగాణ జేఏసీ కార్యాచరణపైనా, కోదండరాంను కట్టడి చేయడంపైనా అదే నిర్బంధ వైఖరిని అమలు చేశారు. టీడీపీని పూర్తిగా ఖాళీ చేసే చర్యలూ కొనసాగించారు. మరోవైపు గతేడాది కాలంలో రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో ‘తెలంగాణ జన సమితి’పేరిట కొత్త పార్టీ ప్రారంభమైంది. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కేంద్రంతో పెరిగిన వైరం.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లపాటు సీఎం కేసీఆర్ రాజకీయపరంగా, ప్రభుత్వపరంగా కేంద్ర ప్రభుత్వంతో సానుకూల దృక్పథంతోనే వ్యవహరించారు. అయితే గతేడాదిగా మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ పర్యటన సందర్భంగా వైరం మొదలైంది. అమిత్‌షా టార్గెట్‌గా కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం పలు పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో దూరం పెరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, నియోజకవర్గాల పునర్విభజన, జోన్ల విభజన వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ మద్దతుకోసం కేసీఆర్ ప్రయత్నించారు. ఇందుకోసం పలుమార్లు ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ప్రధాని అపాయింట్మెంట్ లభించలేదు. ఇదే సమయంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం గౌరవించడం లేదని, ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని పేర్కొంటూ కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమికోసం పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆయన.. పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలతో సమావేశమై చర్చించారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌యాదవ్, కర్ణాటకలో జేడీఎస్ అధినేత దేవెగౌడ, కుమారస్వామి, పశ్చిమబెంగాల్లో తృణమూల్ సారథి మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే సారథి కరుణానిధి, స్టాలిన్, కనిమొళి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ తదితరులతో భేటీ అయ్యారు. త్వరలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు. అన్నివర్గాలనూ ఆకర్షించేలా.. రైతులను, యాదవ, ముదిరాజ్ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి కేసీఆర్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం ‘రైతు బంధు’పథకం, రైతు బీమా వంటి భారీ పథకాలతో రైతులను టీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, ముదిరాజ్, బెస్తవారికోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ వంటి పథకాలను అమలుచేశారు. వీటితోపాటు రాజకీయంగా గుర్తిస్తున్నామనే సంకేతాన్ని ఇవ్వడానికి యాదవ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందినవారికి రాజ్యసభ అవకాశం కల్పించడం గమనార్హం. ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికారంలో ఉన్న పార్టీపై దూకుడుగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు తామే ఆత్మరక్షణలో పడిపోయేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. పూర్తి మెజారిటీ లేకున్నా కేసీఆర్ పక్కా వ్యూహంతో టీఆర్ఎస్ మూడు స్థానాలనూ కైవసం చేసుకోవడం గమనార్హం. ఇదే సమయంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడం వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు విపక్ష కాంగ్రెస్ సభ్యులందరినీ బడ్జెట్ సమావేశాలు మొత్తంగా సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలను తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగ, రైతు, నిర్వాసితుల సమస్యలపై పోరాటాలు చేసిన తెలంగాణ జేఏసీపైనా నిర్బంధాన్ని ప్రయోగించారు. -
ఇద్దరూ... ఇద్దరే!
సాక్షిప్రతినిధి, విజయనగరం : ‘యధా రాజా..తధా ప్రజా’’అన్నది చిరకాల నానుడి. నాయకుడిని బట్టే సేవకులు, ప్రజలు ఉంటార నేది దీని సారాంశం. పాలనలో ఒక్కొక్కరికీ విధానం ఉంటుంది. కొన్ని విషయాల్లో కొందరు మంచిపేరు తెచ్చుకుంటారు. మరి కొందరు వ్యతిరేకతను మూటగట్టుకుంటారు. కానీ రెండు వేర్వేరు విభాగాల అధిపతులు ఒకేలా ఆలోచించడం, ఒకేలా ప్రవర్తించడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన వ్యక్తులు మన జిల్లాలోనే ఉండటం విశేషం. వారిలో ఒకరు జిల్లా పరిపాలనాధికారి కలెక్టర్ హరిజవహర్‌లాల్ కాగా, మరొకరు జిల్లా శాంతిభద్రతలు పరిరక్షించే ఎస్పీ జి.పాలరాజు. జిల్లాకు వస్తూనే తమ ప్రత్యేకతను చాటుకోవడానికి పరితపిస్తున్న వీరిద్దరి విధానాలూ ఒకేలా ఉండటం విశేషం. ఆరంభం నుంచే కొత్తదనం హరిజవహర్ ప్రత్యేకం మట్టి వాసన విలువేంటో తెలియజెప్పే వ్యవసాయ శాఖ నుంచి జిల్లా కలెక్టర్‌గా వచ్చిన హరిజవహర్‌లాల్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే కొత్తదనాన్ని చూపించడం మొదలుపెట్టారు. చిరునవ్వుతో మొదలుపెట్టి సీరియస్ వార్నింగ్‌లు ఇవ్వడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్లు ముందుగా కలెక్టరేట్ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. బూజుపట్టిన కలెక్టరేట్ గోడలను దులిపించి కొత్తగా విద్యుత్ కాంతులు రప్పించా రు. అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ తానేమిటో వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దగా ఉపయోగం లేదని ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని రద్దు చేసిన ఆయనే విజయనగరం పట్టణాన్ని బాగుచేసే బాధ్యతను తలకెత్తుకున్నారు. ఆకస్మిక పర్యటనతో మున్సిపల్ సిబ్బందిని హడలెత్తించిన మరుసటి రోజే అరగంట పాటు మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి సున్నితంగా హెచ్చరిం చారు. వెంటనే ‘పల్లెకు పోదాం’ అంటూ గ్రామాల్లో రాత్రి వేళ పర్యటనకు శ్రీకారం చుట్టారు. చిరునవ్వుతోనే చిక్కులు తీర్చే పాలరాజు ఇక ఎస్పీ పాలరాజు జిల్లాకు వచ్చింది మొదలు ఆయన ముఖంలో చిరునవ్వు చెరగనివ్వలేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అలవోకగా ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు జిల్లా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. జిల్లాలో మునుపెన్నడూ లేని చిత్ర విచిత్ర నేరాలు జరుగుతుంటే వాటిలో వాస్తవాలను, అసలు నేరస్తులను గంటల వ్యవధిలోనే బయటపెట్టి ఔరా అనిపించుకుంటున్నారు. ఓ యువతిపై హత్యాయత్నం, మరో యువతిపై అత్యాచారయత్నం, భర్తనే హత్య చేయించిన ఇం కో యువతి ... ఇలాంటి నేరాల్లో బాధితులమని చెప్పుకున్న యువతులే అసలు నేరస్తులని నిరూపించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నేరం జరిగిందని తెలియగానే అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఎంత దూరమైనా ఆలోచించకుండా సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశోధించడం ఆయన సక్సెస్‌కి కారణం. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటారు. వృద్ధులకు పోలీ సు సేవలందించడం, పోలీస్‌లకు మైత్రి సభ్యులకు మధ్య క్రీడలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. తప్పు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకుంటూ వారిలో ఒక రకమైన భయాన్ని కూడా సృష్టించిన ఆయనే బాగా పనిచేస్తున్నవారిని గుర్తించి ప్రోత్సాహకాలందిస్తున్నారు. ఒకరికి మించి ఒకరు ఇలా వీరిద్దరూ పరిపాలనలో తమతమ దారుల్లో ముందుకెళుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని సారూప్యాలున్నాయనే విషయం వారి చర్యలను బట్టి తెలుస్తోంది. ఇద్దరూ పని విషయంలో చండశాసనుల్లానే కనిపిస్తుంటారు. సిబ్బందిపై కోపాన్ని ప్రదర్శిస్తూ అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంటారు. కానీ ఆ సమయం దాటగానే వారిలో ఒకరిలా కలిసిపోతున్నారు. అరమరికలు మరచి కుటుంబ సభ్యుల్లా మసలుకుంటున్నారు. తారతమ్యాలు పక్కనపెట్టి తోటి వారితో గడుపుతున్నారు. అలాగే ఇద్దరిలో నూ మంచి గాయకులున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఏ దివిలో విరి సిన పారిజాతమో...’ అంటూ కలెక్టర్, ‘నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని...’ అంటూ ఎస్పీ తమ గళాన్ని సవరించి పాటలు పాడి విని పించారు. అంతేకాదు ఇద్దరూ వేరు వేరుగానూ, కలసికట్టుగానూ పాటలు పాడి జిల్లా అధికారులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచారు. విధి నిర్వహణలోనే కాదు వ్యక్తిగతంగానూ తాము విభిన్నమని చాటి చెప్పారు. జిల్లా అభివృద్ధి జరగాలంటే పరిపాలన, భద్రత రెండు ప్రధానమైనవే. వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ ఒకేలా నడుచుకోవడం జిల్లా ప్రజలకు శుభపరిణామమే. -
ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పింది: కేవీపీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో నగదు కొరత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏటీఎంలలో డబ్బుల్లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన చంద్రబాబు..సమస్యల పరిష్కార కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్న సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పంచాయతీ స్థాయి నుంచి సీఎం పేషీ వరకు అవినీతి తాండవిస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల్ని విస్మరించి రాజకీయ, అధికారిక సమావేశాలు, సమీక్షలకే చంద్రబాబు పరిమితం కావడం సరికాదన్నారు. -
వాజ్‌పేయిపై కుష్బూ ప్రశంసలు
సాక్షి, బెంగళూర్ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయిపై నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుష్టూ సుందర్ ప్రశంసలు గుప్పించారు. ఆయన ఓ గొప్ప నేతగానే కాదు.. మంచి పాలకుడు కూడా అందరికీ ఆదర్శమని ఆమె కొనియాడారు. బెంగళూర్‌లో శనివారం ‘కర్ణాటక పంచాయత్’ పేరిట ఇండియా టుడే నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ‘వాజ్‌పేయి గొప్ప విజన్ ఉన్న నేత. గొప్ప పాలకులలో ఆయన ఒకరని కాంగ్రెస్ కూడా భావిస్తుంది. సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తూ.. మతాన్ని ఆయన ఇంటి(బీజేపీ) నాలుగు గోడలకే పరిమితం చేశారు. ఆయన పాలనలో గో రక్ష పేరుతో హత్యలు జరగిన దాఖలాలు లేవు. పైగా ‘ఒక దేశం-ఒక మతం’ సిద్ధాంతాన్ని కూడా ప్రొత్సహించలేదు. అలాంటి వ్యక్తిని సొంత పార్టీలోని కొందరు వ్యక్తులే క్రియాశీల రాజకీయాలకు దూరం చేసేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక దేశం.. ఒక మతం పేరిట బీజేపీ చెలరేగిపోతోంది’ అని కుష్బూ పేర్కొన్నారు. ఇక కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ‘నాగరికత, సభ్యత అంటే హిందూయిజం’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని.. దానికి ఏ ఇజం కూడా ప్రత్యేకం కాదని ఆమె పేర్కొన్నారు. -
నాలుగేళ్లలో ఏం చేశారు?
మిర్యాలగూడ : టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా? ఒక్క పరిశ్రమ కట్టారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదని, వారికి ఇతర పార్టీల నాయకుల గురించి అపహాస్యంగా మాట్లాడటమే తెలుసని అన్నారు. నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మిస్తే కాలువకు నీళ్లిచ్చి గతంలో ఎన్నడూ నీళ్లు రానట్లుగా తామే ఇచ్చామనేవిధంగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాలుగేళ్లలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో తమ హయాంలో నిధులు మంజూరు చేసి నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించి తాము నిర్మించినట్లు చెబుతున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికైనా కొత్తగా మంచినీటి సదుపాయం కల్పించారా? పట్టణంలోని ఆడిటోరియం నిర్మించారా? అని జానారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్‌నాయక్, పట్టణ అధ్యక్షుడు కరీం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేష్, కార్యదర్శి బండారు కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముజ్జు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
కనిమొళిపై కేసు నమోదు చేయండి
సాక్షి, కరీంనగర్: తమిళనాడులోని డీఎంకే ఎంపీ కనిమొళిపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టు ఆదేశించింది. తిరుమల వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై 153ఏ, 153బి, 295ఏ, 298, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని త్రీ టౌన్ పోలీసులను అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. -
చేతకాకపోతే తప్పుకోండి
సాక్షి, విజయవాడ: రైతులకు న్యాయం చేయలేకపోతే గద్దె దిగండి.. మీకంటే చక్కగా పాలించే వారు చాలామంది ఉన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతును రాష్ట్రానికి రాజుగా చేద్దామని నినాదాలు చేస్తున్నారు.. నిజానికి రైతులను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారన్నారు. రూ.5వేల కోట్ల తో ధరల స్థిరీకరణ అన్నారు.. రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. నాలుగేళ్లు గడుస్తున్నా రూ.12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ అన్నారు.. కనీసం అవికూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు రైతులను రుణగ్రస్తులను చేశారని, సహకార సొసైటీలను తెలుగు తమ్ముళ్లు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. రైతుల పేరుతో మిల్లులకు ధాన్యం అమ్మినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారని, కోట్ల రూపాయల మేర మిల్లర్లతో కలిసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని మిల్లర్లు రీసైకిల్ చేసి తిరిగి ప్రభుత్వానికే లెవీగా ఇస్తున్నారన్నారు. ఈ అక్రమార్కులకు మంత్రులే అండగా నిలుస్తున్నారని, కృష్ణాజిల్లా ముస్తాబాద్ సొసైటీలో జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనమని పార్థసారథి అన్నారు. -
మోడీ పాలనలో దేశం మునిగిపోతోంది
-
పట్టు తప్పుతున్న పాలన
రెగ్యులర్ ఈఓ లేక అనిశ్చితి చైర్మన్ రోహిత్ అనుభవరాహిత్యం ఇన్చార్జి ఈఓ మెతకతనం సత్యదేవుని ఆలయంలో రాజ్యమేలుతున్న వివాదాలు అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని ఆలయంలో పరిపాలన అధికారుల పట్టు జారుతోంది. ఈఓ కె.నాగేశ్వరరావును బదిలీ చేసి దాదాపు 40 రోజులైనా రెగ్యులర్ ఈఓను నియమించలేదు. ఇన్చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు మెతక వైఖరి, ఆయన హోదా తాత్కాలికమే కావడంతో సిబ్బంది ఆయనను ఖాతరు చేయడం లేదు. దీంతో ఆలయ పాలనలో అనిశ్చితి నెలకొంది. దేవస్థానంలో సుమారు 30 ఏళ్ల పైబడి ఉద్యోగం చేస్తున్న జగన్నాథరావు ఈఓలు మారినప్పుడు, కొత్త ఈఓ రావడానికి మధ్య కాలంలో ఇన్చార్జి ఈఓగా సుమారు ఏడు పర్యాయాలు చేశారు. ఆ సమయంలో అప్పటి చైర్మన్ ఐవీ రామ్‌కుమార్ అండదండలు ఉండడంతో పాలన సజావుగా సాగించేవారు. అనుభవ రాహిత్యంలో చైర్మన్ రోహిత్ : రామ్‌కుమార్ ఆకస్మికమృతితో చైర్మన్‌గా వచ్చిన ఆయన కుమారుడు ఐవీ రోహిత్ అనుభవ రాహిత్యం వల్ల దేవస్థానంలోని వ్యవహరాలు పూర్తిగా అర్ధం కావడం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో తెలియక చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీనిని అలుసుగా తీసుకుని కొంతమంది ఉద్యోగులు చిన్న వివాదాన్ని కూడా పెద్దదిగా చిత్రీకరించి ఆయనను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఐవీ రామ్‌కుమార్‌కు రాజకీయ నాయకులతో కొంత పరిచయం ఉండేది. రోహిత్‌కు అటువంటి పరిచయాలేవీ లేకపోవడం కూడా ఆయనకు ప్రతిబంధకంగా మారింది. వీటికితోడు పాత ఈఓ నాగేశ్వరరావు అనుసరించిన విధానాలే కరెక్ట్ అనే అభిప్రాయంతో ఉండడం కూడా సిబ్బందికి ఆయనకు మధ్య దూరం పెంచుతోంది. సిబ్బందిలో లోపించిన క్రమశిక్షణ: పాత ఈఓ నాగేశ్వరరావు అనుసరించిన విధానాలపై పలు విమర్శలున్నా సిబ్బందిలో భయముండేది. ఆ భయం వల్ల క్రమశిక్షణతో ఉండేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సిబ్బందిలో కొంతమంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెడితే బయోమెట్రిక్ అటెండెన్స్ సమయానికే మళ్లీ కొండమీదకు వస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్ రాజకీయం: భక్తులకు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురైతే ఫొటోలు తీసి తనకు వాట్సఫ్లో పెట్టాలని పాత ఈఓ కే నాగేశ్వరరావు చెప్పేవారు. అయితే భక్తులు అలా వాట్సప్‌లో పెట్టినది తక్కువ. అయితే ప్రస్తుతం సిబ్బంది మాత్రం సీసీటీవీ పూటేజ్‌లను తిలకిస్తూ తమకు గిట్టని వారి గురించి ఆ సీసీటీవీ పూటేజ్‌లతో ఛైర్మన్, ఈఓ లకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడం కూడా వివాదాస్పదమవుతోంది. దీంతో సిబ్బంది వర్గాలుగా చీలిపోతున్నారు. ఇదే అదనుగా కొంతమంది తమ పబ్బం గడుపుకునేందుకు సిబ్బందిని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికితోడు అంతర్గత బదిలీలు కూడా ఏకపక్షంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. రెగ్యులర్ ఈఓ లేకపోతే మరంత ఇబ్బంది: రూ.వంద కోట్లు పైబడిన ఆదాయం కలిగిన అన్నవరం దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమించకుండా నెలల తరబడి కాలయాపన చేయడం కూడా సరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈఓగా సీనియర్ ఆర్జేసీ, గతంలో ఇక్కడ పనిచేసిన ఎం.రఘునా«ద్ నియామకం ఖరారైందన్న వార్త నెల రోజులుగా చక్కర్లు కొడుతున్నా ఆదేశాలు మాత్రం వెలువడలేదు. ఆయనను ఈఓగా నియమించవద్దని దేవస్థానం ఉద్యోగుల సంఘం పేరుతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ఇక్కడ నెలకొన్న పరిస్థితికి తార్కాణం. అయితే ఆ ఫిర్యాదుతో తమకు సంబంధం లేదని ఆ నేతలు చెప్పడం గమనార్హం. దేవస్థానంలో నెలకొన్న పరిస్థితి ఇంకా ముదరకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రఘునా«థ్ కాకపోతే మరో సమర్థుడైన అధికారిని ఈఓగా ఇక్కడ నియమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రపంచానికే నా పాలన మోడల్
-
టీడీపీ పాలనపై సర్వత్రా అసంతృప్తి
- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం - టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరిక గుమ్మనూరు(చిప్పగిరి) : తెలుగుదేశం పార్టీ పాలనపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. హొళగుంద ఒకటోవార్డు బీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు అడివప్ప, ఉలిగేష్, హనుమప్ప, వీరభద్ర, రాముడుతో పాటు మరో 30 మంది కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీ మండల నాయకులు కుమారస్వామి, రామకృష్ణ, వైస్ సర్పంచు శేఖన్న ఆధ్వర్యంలో ఆదివారం గుమ్మనూరు వెళ్లి ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఈ కారణంగా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం మద్దతు పెరుగుతోందన్నారు. కాటసాని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యక్తలు సంజామల మండలంలోని అక్కంపల్లె గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి సమక్షంలో గ్రామానికి చెందిన మల్లేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, చంద్రమౌళి, ప్రసాదరెడ్డిలతో పాటు 50 కుటుం»êబాలు పార్టీలో చేరారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి వచ్చిన కాటసాని వీరందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఇటీవల పార్టీలో చేరిన నాయకున్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. నమ్మి ఓట్లేస్తే మోసం చేశారని..కార్యకర్తలను విస్మరించారని ఆరోపించారు. నమ్మించి మోసం చేసిన వారిని వచ్చే ఎన్నికలలో భూస్థాపితం చేస్తామని ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఓట్లేసి గెలిపించిన కార్యకర్తలనే కాపాడుకోలేని వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. ఇలాంటి చేతకాని వ్యక్తి ఎమ్మెల్యే పదవికి అర్హుడన్నారు. డబ్బుతో ఏదైనా సాధిస్తానని ఎమ్మెల్యే అనుకుంటున్నారని.. ప్రజల విశ్వాసం పొందలేని వ్యక్తి రాజకీయాల్లో రాణించలేరని అన్నారు. గ్రామంలో ప్రజలకోసం పని చేసిన తమ కార్యకర్త అన్నయ్య మరణించడం తనను బాధిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం వెంకట సూర్యప్రకాష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్ష వర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చిన్నబాబు, పార్టీ నపాయకులు మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గాధంశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అమ్మ హయాంలోనే ఆ రంగాల అభివృద్ధి కూడా..
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత చేపట్టిన అభివృద్ధి పథకాలు ఏమిటంటే అమ్మ క్యాంటీన్, అమ్మ మందులు, అమ్మ ఉప్పు, అమ్మ పప్పు, అమ్మ టీవీలు అంటూ ప్రజాకర్షక పథకాల పేర్లను అనర్గళంగా చెప్పేస్తారు. అది ఒక పార్శం మాత్రమే. ఆరోగ్య, పారిశ్రామిక, సామాజిక, విద్యా రంగాల్లో, నేరాలను అరికట్టడంలో ఆమె ఎంతో పురోభివృద్ధి సాధించారు. దేశంలోకెల్లానే కాకుండా ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, బెల్జీయం దేశాలకన్నా శిశు మరణాలు తమిళనాడులోనే తక్కువంటే ఆశ్చర్యం వేస్తోంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు కూడా దేశంలోకెల్లా తమిళనాడులోనే తక్కువ. జయలలిత హయాంలో తమిళనాడులో పారిశ్రామికాభివృద్ధి పెరిగి ఎన్నో కొత్త ఫ్యాక్టరీలు వచ్చాయని, ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయని, ఆమె అధికారంలోవున్న 15 ఏళ్లలోనే విద్యారంగం కూడా ఎంతో పురోభివృద్ధి చెందిందని ‘ఇండియాస్పెండ్’ సంస్థ డేటా విశ్లేషనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆమె చేపట్టిన ఉచిత జనరంజక పథకాల వల్ల 2015, డిసెంబర్ 31నాటికి గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రం అప్పులు 92శాతం పెరిగాయి. విద్యారంగ పురోభివృద్ధి సూచికలు జాతీయ సరాసరి కన్నా ఎప్పుడూ తమిళనాడులో ఎక్కువగానే ఉన్పప్పటికీ ఆమె 15 ఏళ్ల పరిపాలన కాలంలో కూడా చెప్పుకోతగ్గ అభివృద్ధి జరిగింది. భారత్ లోని ఏ రాష్ట్రంలో లేనన్ని ఫ్యాక్టరీలు ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఉండడం మరో విశేషం. 2013-2014లో విడుదల చేసిన పారిశ్రామిక వార్షిక సర్వే ప్రకారం 37,378 ఫ్యాక్టరీలు ఉన్నాయి. రెండో స్థానాన్ని ఆక్రమించిన మహారాష్ట్రలో 29,123 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 22,876 ఫ్యాక్టరీలతో గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. అత్యధికంగా కార్మికులు, అంటే 24లక్షల మంది తమిళనాడులో పనిచేస్తున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 18 లక్షల మంది, గుజరాత్లో 13 లక్షల మంది పనిచేస్తున్నారు. దేశంలో సరాసరి సగటు ఆదాయం ఎక్కువున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. జనాకర్షక ఉచిత పథకాలు.. ప్రజల సంక్షేమం కోసం ఉచిత పథకాలను తమిళనాడులో ప్రవేశపెట్టడం జయలలిత ద్వారానే ప్రారంభంకాలేదుగానీ ఆమె హయాంలో విస్తృతం అయ్యాయి. 2011లో ఎన్నికల సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వంద యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తానని, ప్రతి 11,12 తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ ట్యాప్‌లను ఇస్తానని, ప్రతి పెళ్లికి గ్రాము బంగారం ఉచితమని, దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి నాలుగు మేకలు లేదా గొర్రెలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక అమ్మ క్యాంటీన్, అమ్మ మెడికల్స్ గురించి చెప్పక్కర్లేదు. వీటన్నింటిని అమలు చేయడం ద్వారా తమిళనాడు రాష్ట్రం అప్పులు అతివేగంగా అంటే 92శాతం ఈ ఐదేళ్లకాలంలో పెరిగాయి. అయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 20 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే అప్పులను అధిగమించే స్థాయిలో రాష్ట్రం పురోభివృద్ధి కొనసాగుతోంది. ఈ అప్పుల శాతం 50 శాతానికి పెరిగే వరకు తమిళనాడుకు వచ్చే నష్టమేమీ లేదు. -
జిమ్మిక్కులు మాని పాలనపై దృష్టి పెట్టాలి
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి వరంగల్: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ప్రతిసారి ఎదో ఒక సమస్యను సృష్టించి ప్రజల దృష్టి మరల్చిన సీఎం కేసీఆర్ ఈ జిమ్మిక్కులను మాని రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. తెలంగాణ వస్తే అందరి కష్టాలు, సమస్యలు తీరుతాయని భావించిన ప్రజలు కేసీఆర్ మాయమాటలతో ప్రజలు మోసపోయారని అన్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. నరహంతకుడు నయీంను ఎన్కౌంటర్ చేయించడంతో చేసిన ఘోరాలు బయటపడ్డాయని, అయితే అందులోని హత్యలు, కిడ్నాప్లతో టీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నందునే చర్యలు తీసుకోవడానికి సీఎం జంకుతున్నాడని రేవూరి విమర్శించారు. కేంద్రం నిధులపై ఫ్రీజింగ్... రాష్ట్ర ప్రభుత్వం ని«ధులు ఇవ్వకపోగా కేంద్రం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులపై ఫ్రీజింగ్ పెట్టడంతో గ్రామాల్లో పనులు పడకేశాయని జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఇప్పటికే బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని, ఇందిరమ్మ బిల్లుల రాక ఇప్పటికీ లబ్ధిదారుల ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేరన్నారు. సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, పుల్లూరు అశోక్‌కుమార్, జయపాల్, మార్గం సారంగం, సంతోష్‌కుమార్, హన్మకొండ సాంబయ్య, బైరపాక ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ---------------------- 02డబ్ల్యూజీఎల్257: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి -
స్విస్ ఛాలంజ్పై నేడు హైకోర్టు ఉత్తర్వులు
-
నయీం ప్రతి కదలిక వెనుక ఫర్హానా పాత్ర
-
బీసీలు రాజ్యాధికారాన్ని సాధించాలి: అరుణ్రిషి
నల్లగొండ టౌన్: బీసీలు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ఉద్యమాలను నిర్వహించాలని బీసీ యువజన, విధ్యార్థి జాతీయ సంఘం సమన్వయకర్త డాక్టర్ అరుణ్రిషి పిలుపునిచ్చారు. మంగళవారం బీసీ చైతన్యయాత్ర మేల్కోలుపులో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేవలం రెండు , మూడు కులాలు మాత్రమే రాజ్యాధికారం సా«గించాయన్నారు. బీసీలు అన్ని రంగాలలో నేటికి వెనుకబడి ఉన్నారని, రాజ్యాధికార సాధనతోనే అన్ని రంగాలలో అబివృద్ధి సాద్యమవుతుందన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రా సాధనలో బీసీల పాత్ర కీలకమైందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దుడుకు లక్ష్మినారాయణ, రమేష్, అరవింద్, అంజయ్య, వెంకన్నగౌడ్, మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడో రేపో ‘రెండు’!
సైబరాబాద్ కమిషనరేట్ విభజన ప్రక్రియ కొలిక్కి సిబ్బందితో పాటు సామగ్రి కూడా విభజన సీఎం వద్ద దస్త్రం, త్వరలో ఉత్తర్వులు సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజింజే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు రీ ఆర్గనైజింగ్ వింగ్ పంపిన ప్రతిపాదనలపై ఈ నెలాఖరు లోపే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. విభజన నేపథ్యంలో సిబ్బందితో పాటు కుర్చీల దగ్గరి నుంచి చివరకు పోలీసు జాగిలాల దాకా...ఇలా ప్రతిదీ నిర్ణీత నిష్ఫత్తిలో పంపిణీ చేశారు. అన్ని ఠాణాలతో కూడిన జోన్లతో పాటు నేరగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగే స్నిఫర్ డాగ్స్‌ను కూడా విభజించారు. సైబరాబాద్ పోలీసుల చేతుల్లో ఉన్న 12 డాగ్స్‌ను ఒక్కో కమిషనరేట్‌కు ఆరు చొప్పున కేటాయించారు. దాదాపు 1,300కు పైగా వాహనాలను రెండు కమిషనరేట్లకు సగం చొప్పున పంపిణీ చేయాలని లెక్కలతో సహా చూపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆయుధాలతో పాటు కమ్యూనికేషన్ ఉపకరణాలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఫర్నీచర్, కేబుల్, ఇతర మెటీరియల్ ఇలా ప్రతిదీ రెండిటికీ పరిధిని బట్టి కేటాయించారు. సిబ్బంది విభజించిన లెక్కలివీ... ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మినిస్టీరియల్ సిబ్బంది 40 మంది వరకు ఉన్నారు. సీసీఆర్బీలో 20 మంది, కంట్రోల్ రూమ్‌లో 50 మంది, అకౌంట్ సెక్షన్ 10 మంది వరకు ఉన్నారు. వీరందరినీ రెండు కమిషనరేట్లకు చెరి సగం చొప్పున కేటాయించారు. ఆర్మ్డ్ రిజర్వులో 1200, స్పెషల్ బ్రాంచ్‌లో 60, సైబర్‌క్రైమ్, సీఎస్ఎల్, సీటీసీలో ఉన్న 100 మందిని కూడా విభజించిన పోలీసు ఉన్నతాధికారులు వారికిష్టమున్న కమిషనరేట్‌ను ఎంచుకునే అప్షన్‌ను ఇప్పటికే కల్పించారు. నేరాల దర్యాప్తునకు ఎటువంటి ఆటంకం కలిగించొద్దనే ఉద్దేశంతో శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న 3,500 మందిని యథాతథా స్థానంలో కొనసాగిస్తే బాగుం టుందని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో రీ ఆర్గనైజింగ్ వింగ్ పేర్కొంది. అలాగే ట్రాఫిక్‌లోని 500 మంది, హోంగార్డులు 2,000 మంది ఎక్కడున్నవారు అక్కడి స్థానాల్లో కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లతో ఈస్ట్ కమిషనరేట్, శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో వెస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ రీ ఆర్గనైజింగ్ వింగ్ పంపిన ప్రతిపాదన సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఈ నెల 27 వరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని మూడు, నాలుగు అంతస్తులను పూర్తిచేయాలని ఇప్పటికే డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దాదాపు పనులు పూర్తి కావొచ్చాయి. ఆలోపు సైబరాబాద్ విభజనపై ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశముందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిషనరేట్ల స్వరూపమిదే... ప్రస్తుతమున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు జోన్లు ఉన్నాయి. అయితే విభజన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో రెండు కమిషనరేట్లలో మూడు జోన్లు ఉండాలనే ఉద్దేశంతో ఈస్ట్ కమిషనరేట్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లతో కొత్తగా భువనగిరి జోన్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో వెస్ట్ కమిషనరేట్ ఏర్పాటుచేయాలన్న రీ ఆర్గనైజింగ్ వింగ్ అధికారులు శంషాబాద్ జోన్లో షాద్‌నగర్ డివిజన్‌ను, మాదాపూర్ జోన్లో మియాపూర్ డివిజన్లను కొత్తగా చేర్చారు. ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 12 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉండగా...విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగు ట్రాఫిక్ ఠాణాలు ఏర్పాటుచేయనున్నారు. ఈస్ట్ కమిషనరేట్‌లో భువనగిరి, చౌటుప్పల్, వెస్ట్ కమిషనరేట్‌లో షాద్‌నగర్, చేవేళ్ల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. విభజన ప్రభావంతో రెండు కమిషనరేట్లలో వం దల సంఖ్యలో సిబ్బంది అవసరం కానుంది. ఈ మేరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
‘పది’ మూల్యాంకనం ప్రారంభం
* పర్యవేక్షించిన జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మిబాయి * తొలిరోజు 14,500 పత్రాల మూల్యాంకనం మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం శనివారం ప్రారంభమైంది. ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి పర్యవేక్షించారు. జూలైలో బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్పాట్‌కు సంబంధించిన ఉత్తర్వులు గతంలో పనిచేసిన పాఠశాలలకు వెళ్లడంతో కొంత ఇబ్బందులు తలెత్తాయి. చివరికి విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయుల ప్రత్యేక చొరవతో ఉత్తర్వులు అందజేశారు. పంచవటి విద్యాలయంలో మూల్యాం కనం ఏర్పాటు చేశారు. మొత్తం 5,87,289 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు 20 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు, 200 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 1450 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 500 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ఎసీఓలకు ప్రతి రోజూ రూ.260, సీఈలకు రూ.240, ఏఈలకు ఒక్కో పేపర్‌కు రూ.11ల చొప్పున, స్పెషల్ అసిస్టెంట్లకు ప్రతిరోజు రూ.150 చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఏసీఓలకు, సీఈఓలకు, ఏఈలకు డీఏ రోజుకు రూ.300 చొప్పున అందజేయనున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు పది నుంచి 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయగా తొలిరోజు 14,500 పూర్తయ్యాయి. మూల్యాంకన కేంద్రాన్ని క్యాంపు అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా జవాబుపత్రాలు మూల్యాంకనం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరుగకుండా మూల్యాంకనం చేయాలని సూచించారు. టీఎస్‌ఎస్‌ఓ పీఓ గోవిందరాజులు, డిప్యూటీ ఈఓలు మీరాజుల్లాఖాన్, రవీందర్‌గౌడ్ మూల్యాంకన కేంద్రంలో పర్యవేక్షించారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హరీశ్ విందు
125 మంది అధికార, విపక్ష నేతల హాజరు సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం మొదటి దశ పనులు విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విందు ఏర్పాటు చేశారు. నగరంలోని ఓ హోటల్లో సోమవారం రాత్రి జరిగిన ఈ విందుకు స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలతోపాటు, 125 మంది అధికార టీఆర్ఎస్, విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యా రు. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల తరహాలోనే.. రెండో విడత పనులు కూడా వేగం గా పూర్తయ్యేందుకు సహకరించాల్సిందిగా హరీశ్ కోరారు. పనులు మంజూరైన చోట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీక్షలు నిర్వహిస్తూ.. లోటుపాట్లకు తావులేకుండా.. నాణ్యతతో జరిగేలా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు సహకరిస్తేనే పనులు వేగం గా జరుగుతాయన్నారు. ఏప్రిల్ 1 నుంచి మిషన్ కాకతీయ వారోత్సవాలు నిర్వహించాలని ప్రజా ప్రతినిధులను హరీశ్ కోరారు. ఏఈఈలకు పోస్టింగ్ ఆర్డర్లు... టీఎస్పీఎస్సీ ద్వారా ఇటీవల నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 128 మందికి మంత్రి హరీశ్‌రావు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. నీటి పారుదలశాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్యోగులందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని, బంగారు తెలంగాణ సాధనలో నూతనంగా ఎంపికైన ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని హరీశ్ కోరారు. -
ట్విట్టర్, ఫేస్ బుక్ లో వదంతులకు మరణశిక్షే..!
ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇక్కడైతే ఏమో గానీ సౌదీ అరేబియాలో అయితే మాత్రం మరణశిక్ష విధిస్తారట. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సౌదీ సర్కారు తాజా ప్రకటన సామాన్య ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ ప్రకటన వెనుక.. మొత్తం సోషల్ మీడియానే ఆ దేశంలో నిషేధించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. కొత్తరాజు సల్మాన్ పాలనలో ఈ మరణ శిక్షల జోరు పెరిగిపోతోంది. సౌదీ రాజు కొత్త నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యిమంది వరకూ చనిపోవడం... దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో... ఆగ్రహానికి గురైన ప్రభత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చిన్నపాటి తప్పులు చేసినవారికి.. ఖైదు, ప్రయాణ నిషేధం, గృహ నిర్బంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని, ఇప్పుడు ఓ సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయమూర్తి అంటున్నారు. ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాన్ని కొన్ని వారాల క్రితం వచ్చిన సౌదీ రాజు ప్రకటించారు. 79 ఏళ్లు కొత్త రాజు సల్మాన్, అతడి కుమారుడు 30 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశ పెట్టిన ఈ ప్రకటనకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. -
ఛలో విజయవాడ అంటున్నచంద్రబాబు
-
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పాలన
- ప్రణబ్‌కు వైఎస్సార్సీపీ అధినేత వినతిపత్రం - పట్టిసీమలో 21శాతం ఎక్సెస్ వేసిన వారికే పనులిచ్చారు - భారీ ముడుపులు తీసుకుని డిస్టిలరీలకు అనుమతులిచ్చారు - బెరైటీస్ కనీసధరను తగ్గించడంవల్ల ఖజానాకు భారీ నష్టం - ఇసుక రీచ్‌లతో టీడీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారు - సంక్రాంతి పండుగ నిత్యావసరాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు - వీటన్నింటిపై విచారణ జరిపించండి... ఏపీ ప్రజలకు న్యాయం చేయండి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతితో భేటీ సందర్భంగా రెండు వినతిపత్రాలు ఇచ్చారు. అందులో అవినీతిపై ఇచ్చిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ.. - ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి అత్యున్నత స్థాయి లో నిరాటంకంగా కొనసాగుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారం తమ బాస్ చంద్రబాబు సూచనల మేరకే చేస్తున్నానని పదేపదే చెప్పడం వీడియో టేపుల్లో రికార్డయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు నేరుగా మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చిన చంద్రబాబును ఏ-1గా చేర్చాలి. లంచం ఇవ్వజూపిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలి. ఈ డబ్బంతా ఏడాదికాలంగా ఏపీలో పాల్పడిన అవినీతినుంచే తీసుకొచ్చారు. ఉదాహరణకు... - పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు తమవారికే దక్కేలా వ్యవహరించారు. 21.9 శాతానికి ఎక్సెస్ వేసినా టెండర్‌ను ఆమోదించారు. - ఈపీసీ కోడ్‌లో లేని మెటీరియల్‌కు కూడా ధరలు పెంచుకునే నిబంధన పొందుపరుస్తూ జీవో నెంబరు 22 జారీచేశారు. - భారీగా ముడుపులు తీసుకుని ఎంపిక చేసిన డిస్టిలరీలకు అదనపు మద్యం ఉత్పత్తి చేసేందుకు వీలుగా అనుమతి ఇచ్చారు. - రాష్ట్రంలో పలు పరిశ్రమలు పారిశ్రామిక రాయితీల కోసం ఎదురుచూస్తుండగా.. అడగని పరిశ్రమలకు రాయితీలు విడుదల చేశారు. - వైఎస్సార్ జిల్లాలోని దాదాపు 200 బెరైటీస్ యూనిట్లకు ఖనిజం ఇవ్వడం ఆపివేసి 40 వేల మంది పొట్టగొట్టారు. పైగా కనీస బేసిక్ ధరను తగ్గిస్తూ టెండర్లను పిలిచారు. దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. - టీడీపీ నేతల బినామీలకు ఇసుక రీచ్‌లు కేటాయించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. దీంతో ఇసుక ధరలు 3 నుంచి 5 రెట్లు పెరిగిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. - రాజధాని అభివృద్ధి కోసమంటూ స్విస్ చాలెంజ్ పద్ధతిని ఎంచుకుని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారుతున్నాయి. - విద్యుదుత్పత్తి దారులకు మేలు చేకూర్చేలా కొనుగోలు నిబంధనలు మార్చారు. విద్యుత్తు తీసుకోని పక్షంలో పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. విద్యుత్తు కొనుగోలుకు రేట్లను కూడా అధికంగా పొందుపరిచారు. - అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తగ్గినప్పటికీ గడిచిన ఏడాదిగా కొంతమంది బొగ్గు సరఫరాదారులకు మేలు చేకూర్చేలా అధిక రేట్లకు బొగ్గును కొనుగోలు చేస్తున్నారు. - సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు ఇచ్చిన పథకంలో కూ డా అవినీతి చోటు చేసుకుంది. టెండర్లు పిలవకుండా, తమకు నచ్చినవారికి అధిక రేట్లు చె ల్లించి నాసిరకం సరుకులు కొనుగోలు చేశారు. - రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందనడానికి ఇవి కొన్ని ఉదంతాలు మాత్రమే. అందువల్ల చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చి, అవినీతిపై సంబంధిత అధికారులను దర్యాప్తు జరపాలని ఆదేశించండి. ఏపీ ప్రజలకు న్యాయం చేయండి. -
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పాలన
- ప్రణబ్‌కు వైఎస్సార్సీపీ అధినేత వినతిపత్రం - పట్టిసీమలో 21శాతం ఎక్సెస్ వేసిన వారికే పనులిచ్చారు - భారీ ముడుపులు తీసుకుని డిస్టిలరీలకు అనుమతులిచ్చారు - బెరైటీస్ కనీసధరను తగ్గించడంవల్ల ఖజానాకు భారీ నష్టం - ఇసుక రీచ్‌లతో టీడీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారు - సంక్రాంతి పండుగ నిత్యావసరాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు - వీటన్నింటిపై విచారణ జరిపించండి... ఏపీ ప్రజలకు న్యాయం చేయండి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతితో భేటీ సందర్భంగా రెండు వినతిపత్రాలు ఇచ్చారు. అందులో అవినీతిపై ఇచ్చిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ.. - ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి అత్యున్నత స్థాయి లో నిరాటంకంగా కొనసాగుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారం తమ బాస్ చంద్రబాబు సూచనల మేరకే చేస్తున్నానని పదేపదే చెప్పడం వీడియో టేపుల్లో రికార్డయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు నేరుగా మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చిన చంద్రబాబును ఏ-1గా చేర్చాలి. లంచం ఇవ్వజూపిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలి. ఈ డబ్బంతా ఏడాదికాలంగా ఏపీలో పాల్పడిన అవినీతినుంచే తీసుకొచ్చారు. ఉదాహరణకు... - పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు తమవారికే దక్కేలా వ్యవహరించారు. 21.9 శాతానికి ఎక్సెస్ వేసినా టెండర్‌ను ఆమోదించారు. - ఈపీసీ కోడ్‌లో లేని మెటీరియల్‌కు కూడా ధరలు పెంచుకునే నిబంధన పొందుపరుస్తూ జీవో నెంబరు 22 జారీచేశారు. - భారీగా ముడుపులు తీసుకుని ఎంపిక చేసిన డిస్టిలరీలకు అదనపు మద్యం ఉత్పత్తి చేసేందుకు వీలుగా అనుమతి ఇచ్చారు. - రాష్ట్రంలో పలు పరిశ్రమలు పారిశ్రామిక రాయితీల కోసం ఎదురుచూస్తుండగా.. అడగని పరిశ్రమలకు రాయితీలు విడుదల చేశారు. - వైఎస్సార్ జిల్లాలోని దాదాపు 200 బెరైటీస్ యూనిట్లకు ఖనిజం ఇవ్వడం ఆపివేసి 40 వేల మంది పొట్టగొట్టారు. పైగా కనీస బేసిక్ ధరను తగ్గిస్తూ టెండర్లను పిలిచారు. దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. - టీడీపీ నేతల బినామీలకు ఇసుక రీచ్‌లు కేటాయించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. దీంతో ఇసుక ధరలు 3 నుంచి 5 రెట్లు పెరిగిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. - రాజధాని అభివృద్ధి కోసమంటూ స్విస్ చాలెంజ్ పద్ధతిని ఎంచుకుని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారుతున్నాయి. - విద్యుదుత్పత్తి దారులకు మేలు చేకూర్చేలా కొనుగోలు నిబంధనలు మార్చారు. విద్యుత్తు తీసుకోని పక్షంలో పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. విద్యుత్తు కొనుగోలుకు రేట్లను కూడా అధికంగా పొందుపరిచారు. - అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తగ్గినప్పటికీ గడిచిన ఏడాదిగా కొంతమంది బొగ్గు సరఫరాదారులకు మేలు చేకూర్చేలా అధిక రేట్లకు బొగ్గును కొనుగోలు చేస్తున్నారు. - సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు ఇచ్చిన పథకంలో కూ డా అవినీతి చోటు చేసుకుంది. టెండర్లు పిలవకుండా, తమకు నచ్చినవారికి అధిక రేట్లు చె ల్లించి నాసిరకం సరుకులు కొనుగోలు చేశారు. - రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందనడానికి ఇవి కొన్ని ఉదంతాలు మాత్రమే. అందువల్ల చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చి, అవినీతిపై సంబంధిత అధికారులను దర్యాప్తు జరపాలని ఆదేశించండి. ఏపీ ప్రజలకు న్యాయం చేయండి. -
ప్రత్యర్థుల అణచివేతే ల క్ష్యం
సాక్షి, హైదరాబాద్: తన అక్రమాలను ప్రశ్నించే వ్యక్తులను, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేసీఆర్ ఏడాది పాలన సాగిందని టీటీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను ఊహల్లో ఊరేగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అధికార బలంతో కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
పోలీస్ బాస్‌లు మారారు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీస్ శాఖలో భారీ మార్పులు జరిగాయి. వరంగల్ అర్బన్, రూరల్ ఎస్పీలు, వరంగల్ రేంజ్ ఐజీ, డీఐజీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లో వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. తాత్కాలికంగా కూడా ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. వరంగల్ రూరల్ ఎస్పీగా అంబర్ కిశోర్‌ఝా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం మన జిల్లాలోనే ఓఎస్డీగా పనిచేస్తున్నారు. రూరల్ ఎస్పీగా ఉన్న ఎల్‌కేవీ.రంగారావు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బి.మల్లారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా ఉన్నారు. వరంగల్ రేంజ్ డీఐజీగా ఉన్న ఎం.కాంతారావు డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. వరంగల్ రేంజ్ ఐజీగా వి.నవీన్‌చంద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న రవి గుప్తాను హోంగార్డ్స్ ఐజీగా బదిలీ చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల మార్పుల నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో డీఎస్సీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలు జరగనున్నాయని తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
షరియా కోర్టులకు చట్టప్రతిపత్తిలేదు: సుప్రీం
* ఫత్వాల అమలు తప్పనిసరికాదు * ఉభయపక్షాల సామరస్య పరిష్కారానికే షరియా కోర్టులని ధర్మాసనం స్పష్టం న్యూఢిల్లీ: ముస్లిమ్ మత గురువులు ఆధ్వర్యంలో నడిచే షరియా కోర్టులకు ఎలాంటి చట్టబద్ధత లేదని, షరియా కోర్టుల నిర్ణయాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరంలేదని సుప్రీంకోర్టు సోమవారం రూలింగ్ ఇచ్చింది. ఫత్వాలపేరుతో అమాయకులను శిక్షించేందుకు వీలులేదని, మౌలికమైన మానవహక్కులకే అది భంగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అమాయకులను శిక్షించాలని ఇస్లాం మతంతోపాటు ఏ మతమూ చెప్పదని పేర్కొంది. షరి యా కోర్టుల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ న్యాయవాది విశ్వలోచన్ మాదం దాఖలు చేసిన ప్రజాశ్రేయో వ్యాజ్యంపై విచారణ సందర్బంగా కోర్టు రూలింగ్ ఇచ్చింది. జస్టిస్ సీకే ప్రసాద్, జస్టిస్ పినాకి చంద్రఘోష్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘దార్-ఉల్-ఖాజా’ వంటి సంస్థలు తీర్పులు చెప్పడం, ఫత్వాలు జారీచేయడంపై ఆంక్షలు విధించింది. ఎవరూ అడగకపోయినా ఓ వ్యక్తిపై, వ్యక్తులపై ఫత్వాల జారీ సరికాదని స్పష్టం చేసింది. అయితే, ’దార్-ఉల్-ఖాజాల’ ఫత్వాలు జారీ చట్టవిరుద్ధమని ప్రకటించడానికి సుప్రీం నిరాకరించింది. షరియా కోర్టులు,.. రెండు పక్షాల మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఏర్పాటైన సంస్థలని, వాటి నిర్ణయాలను అంగీకరించడం, తిరస్కరించడం సంబంధిత వ్యక్తుల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉందని పేర్కొంది. వ్యక్తులకు చట్టం ప్రకారం ధఖలుపడిన హక్కులకు భంగం కలగనంతవరకూ ఫత్వాల జారీలో ఎలాంటి తప్పూలేదని, అయితే, తన సమక్షంలో లేని వ్యక్తిపై ఫత్వా జారీ చేయరాదని సుప్రీంకోర్టు దార్-ఉల్-ఖాజాలను హెచ్చరించింది. ఫత్వాకు చట్టబద్ధత ఉండబోదని, ఫత్వాలను బలవంతంగా అమలుచేయడం కుదరదని ధర్మాసనం తన 20 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై ముస్లిం మతగురువులు తీవ్రంగా స్పందించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకారం పనిచేయడానికి, తగినచర్యలు తీసుకోవడానికి రాజ్యాంగమే తమకు అనుమతినిచ్చిందని వారన్నారు. న్యాయవ్యవస్థకు సమాంతరంగా తా ము ఎలాంటి పనీ చేయట్లేదని, ఒక ఖాజా జారీచేసే ఉత్తర్వులను అంతా తప్పనిసరిగా పాటించాలని తాము చెప్పలేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు జఫర్యాబ్ అన్నారు. రాజ్యాంగ పరిధిలో ముస్లిం పర్సనల్ లా బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే హక్కు ముస్లింలకు ఉందని మరో మతగురువు ఖాలిద్ రషీద్ ఫరంగీ అభిప్రాయపడ్డారు. కాగా, సుప్రీం తీర్పును పాట్నాకు చెందిన ఇమారత్ షరియా సంస్థ సభ్యుడు మౌలానా అనీస్ ఉర్ రెహమాన్ సమర్థించారు. ఈ తీర్పుతో షరియా కోర్టు పనికి భంగకరం కాబోదన్నారు. -
రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్ నవాబుపేట, న్యూస్‌లైన్: రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బార్క కృష్ణయాదవ్ అన్నారు. పలువురు బీసీ సంఘం నాయకులతో కలిసి గురువారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం బీసీలున్నా రాజ్యాధికారానికి మాత్రం నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నాయన్నారు. బీసీలంతా ఈవిషయాన్ని గమనించి రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగి బీసీలనంతా ఏకం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు మాట్లాడుతూ.. శుక్రవారం నవాబుపేట మండల శాఖను ఎన్నుకోవడం జరుగుతుందని, మండలంలోని అన్ని గ్రామాల బీసీలు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు రమేష్‌యాదవ్, షాబాద్ మండల అధ్యక్షుడు రాచ రాములు, ఎం.వెంకటస్వామి, ఖలీల్, మాజీ సర్పంచ్ కోదండం, కిష్టయ్య, ప్రభు, గోవర్దన్, రవి తదితరులు పాల్గొన్నారు.