- నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి
జిమ్మిక్కులు మాని పాలనపై దృష్టి పెట్టాలి
Published Mon, Oct 3 2016 12:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
వరంగల్: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ప్రతిసారి ఎదో ఒక సమస్యను సృష్టించి ప్రజల దృష్టి మరల్చిన సీఎం కేసీఆర్ ఈ జిమ్మిక్కులను మాని రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు.
హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. తెలంగాణ వస్తే అందరి కష్టాలు, సమస్యలు తీరుతాయని భావించిన ప్రజలు కేసీఆర్ మాయమాటలతో ప్రజలు మోసపోయారని అన్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. నరహంతకుడు నయీంను ఎన్‌కౌంటర్ చేయించడంతో చేసిన ఘోరాలు బయటపడ్డాయని, అయితే అందులోని హత్యలు, కిడ్నాప్‌లతో టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నందునే చర్యలు తీసుకోవడానికి సీఎం జంకుతున్నాడని రేవూరి విమర్శించారు.
కేంద్రం నిధులపై ఫ్రీజింగ్...
రాష్ట్ర ప్రభుత్వం ని«ధులు ఇవ్వకపోగా కేంద్రం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులపై ఫ్రీజింగ్ పెట్టడంతో గ్రామాల్లో పనులు పడకేశాయని జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఇప్పటికే బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని, ఇందిరమ్మ బిల్లుల రాక ఇప్పటికీ లబ్ధిదారుల ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేరన్నారు. సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, పుల్లూరు అశోక్‌కుమార్, జయపాల్, మార్గం సారంగం, సంతోష్‌కుమార్, హన్మకొండ సాంబయ్య, బైరపాక ప్రభాకర్‌లు పాల్గొన్నారు.
----------------------
02డబ్ల్యూజీఎల్257: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి
Advertisement
Advertisement